EPAPER

Netherlands Cricket Team: నెదర్లాండ్స్ లో…సౌతాఫ్రికా ప్లేయర్లా?

Netherlands Cricket Team: నెదర్లాండ్స్ లో…సౌతాఫ్రికా ప్లేయర్లా?

Netherlands Cricket Team: అండర్ డాగ్ గా ఎంటర్ అయిన డచ్ టీమ్ లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లున్నారనే ప్రచారం జోరందుకుంది. వాళ్లకి ఆ జట్టు బలాలు-బలహీనతలు తెలియడం వల్లే, అందరినీ టపటపా అవుట్ చేసి పారేశారని అంటున్నారు. అంతేకాదు శిక్షణ కూడా వారి తరహాలోనే ఉండటంతో బ్యాటింగులో నిలదొక్కుకున్నారని అంటున్నారు. వారి బౌలింగ్ ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెబుతున్నారు.


ఇంతకీ డచ్ టీమ్ లో ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎవరంటే స్పిన్నర్ రోలాఫ్ వాండర్ మెర్వ్ తో పాటు సైబ్రాండ్ ఎంగిల్ బ్రెక్ట్, కోలిన్ ఏకెర్ మెన్ గా చెబుతున్నారు. వీళ్లు ముగ్గురు గతంలో దక్షిణా ఫ్రికా టీమ్ కి ప్రాతినిథ్యం వహించారు. వాండర్ మెర్వ్ అయితే దక్షిణాఫ్రికా తరఫున 26 మ్యాచ్ లు కూడా ఆడాడు. ఇక కోలిన్, ఎంగిల్ బ్రెక్ట్ అయితే అండర్ 19 జట్టులో ఆడారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

నిజానికి దక్షిణాప్రికా-నెదర్ ల్యాండ్ దేశాల మధ్య వలస బంధాలు ఉన్నాయి. అంటే దక్షిణాఫ్రికాలో జన్మించిన ముగ్గురు క్రీడాకారులు ఇప్పుడు నెదర్లాండ్ జట్టులో ఉన్నారు. అందువల్ల జన్మతహా వారికి పౌరసత్వం రావడంతో దక్షిణాఫ్రికాలో క్రికెట్ శిక్షణ తీసుకున్నారు. అయితే మన ఇండియాలాగే క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాలంటే విపరీతమైన పోటీ దక్షిణాఫ్రికాలో కూడా ఉంది. అందుకనే ఈ ముగ్గురు ఏం చేశారంటే, తమ స్వదేశమైన నెదర్లాండ్ కి వచ్చి, ఇక్కడ క్రికెట్ టీమ్ లో చేరారు. జాతీయ జట్టులో సులువుగా చోటు సంపాదించారు. నేరుగా ప్రపంచకప్ కే వచ్చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో శిక్షణ వీరికి ఉపయోగపడింది. అలా గురువుగారి జట్టునే ఓడించి ఔరా అనిపించారు.


అయితే నెట్టింట మీమ్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ‘వాడు మనోడు కాదు రా…పగోడు’ అంటూ కొందరు మిర్చి సినిమాలో డైలాగులు రాస్తున్నారు. కొందరేమో నెదర్లాండ్ జట్టులో కట్టప్పలున్నారు…జాగ్రత్తరోయ్… అని రాస్తున్నారు.
కొందరేమో విభీషణులున్నారు. ఇంటిగుట్టు చెప్పి లంకకే చేటు తెచ్చినట్టు, సౌతాఫ్రికా గుట్టు తెలుసుకుని వారిని మట్టి కరిపించారని రాస్తున్నారు.

ఇలా ఎవరి క్రియేటివిటీని వారు చూపిస్తున్నారు. నెట్టింట అడ్డుచెప్పేవారే లేరు కదా…ఆకాశమే హద్దుగా మరికొందరు రాసి పారేస్తున్నారు. ఏదేమైనా అత్తగారు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకన్న చందంగా దక్షిణాఫ్రికా పరిస్థితి మారిందని కొందరంటున్నారు. ఎందుకంటే ఓడిపోయినందుకు కాదు…నెట్టింట మీమ్స్ బాధపడలేకపోతున్నామని తలపట్టుకుంటున్నారంట. అని రాస్తున్నారు.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×