Cockroaches : ఇంట్లో ఎక్కడ చూసినా బొద్దింకలు తెగ తిరుగుంటాయి. ఆహారం దగ్గరి నుంచి కబోర్డ్స్ వరకు అన్నింటిలోనూ కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. ఇక మార్కెట్లో దొరికే అనేక స్ప్రేలను తెచ్చి ప్రయోగాలు చేస్తున్నా.. బొద్దింకల వల్ల ఇబ్బంది పడేవారు ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేస్తే ఫలితం ఉండొచ్చు.
ఈ టిప్స్ పాటించండి..
క్యారం బోర్డు మీద చల్లే బోరిక్ యాసిడ్ పౌడర్‌ను బొద్దింకలను తగ్గించటానికి ఉపయోగించవచ్చు.
బేకింగ్ సోడాతో పంచదారను కలిపి ఇంట్లో బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లితే ఆ వాసనకు బొద్దింకలు అక్కడికి రావు.
ఇక బిర్యానీ ఆకులతో కూడా బొద్దింకలను తరిమి కొట్టొచ్చు.బిర్యానీ ఆకుల వాసన బొద్దింకలకు అస్సలు పడదు.
లవంగాలను వంటగదిలోని మూలల్లో,ర్యాకుల్లో,షెల్పుల్లో అక్కడక్కడా పెడితే, దాని వాసనకు బొద్దింకలు పరార్ అయిపోతాయి.
వేప ఆకులు, వేప నూనె కూడా బొద్దింకలకు పడవు. వీటి వాసన తగిలినా పారిపోతాయి.