EPAPER
Kirrak Couples Episode 1

MOSSAD: మొస్సాద్ టాప్ -3 ఆపరేషన్స్.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

MOSSAD: మొస్సాద్ టాప్ -3 ఆపరేషన్స్.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

MOSSAD: మొస్సాద్… ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంటలిజెన్స్ యూనిట్స్ లో ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌కి ఓటమి అనే పదం తెలీదంటే అది కేవలం మొస్సాద్ వల్లనే. అంతటి గొప్ప చరిత్ర కలిగిన మొస్సాద్ అక్టోబర్ 6 వ తేదీన హమాస్ జరిపిన రాకెట్ దాడులను పసిగట్టలేక పోయిందంటే , మొస్సాద్ తన ఉనికి ని కోల్పోతుందా ? ఇప్పటి వరకు మొస్సాద్ జరిపిన అతి ముఖ్యమైన ఆపరేషన్స్ ఏంటి ?


మొస్సాద్..ఇజ్రాయెల్ ప్రఖ్యాత గూఢచారి సంస్థ , యూదుల రక్షణాత్మక ఆయుధాగారం కలిగి ఉన్న అత్యంత ప్రభావవంతమైన సాధనాలలో మొస్సాద్ ఒకటి. ఇజ్రాయెల్ దేశం 1948 లో స్వాతంత్య్ర దేశం గా ఆవిర్భవించింది. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన అయినా దగ్గరనుండి జరిగిన నాటి నుండే అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటుంది. శత్రుదేశాలు ఎప్పుడూ ఇజ్రాయెల్ పతనాన్ని కోరుకున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇజ్రాయెల్ కి ఒక అత్యాధునిక ఇంటెలెజిన్స్ ఏజెన్సీ అవసరం ఏర్పడింది. అందుకే ఇజ్రాయెల్ ప్రభుత్వం 1949 లో మొస్సాద్ ని ఏర్పాటు చేసింది. స్థాపించిన నాటి నుండి మొస్సాద్ సాహసోపేతమైన ఆపరేషన్స్ కి పెట్టింది పేరు.

Operation Finale: The Mossad’s Hunt for Adolf Eichmann (1960)


1957లో, పశ్చిమ జర్మనీలోని హెస్సీ రాష్ట్రానికి ప్రాసిక్యూటర్-జనరల్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఫ్రిట్జ్ బాయర్, అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్ అర్జెంటీనాలో సజీవంగా ఉన్నాడన్న సమాచారంతో మొసాద్‌ను సంప్రదించాడు.ఎవరీ అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్?
గెస్టపో యూదుల SS ఆఫీసర్ ఇంచార్జి , అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్ హోలోకాస్ట్ సమయంలో వేల మంది యూరోపియన్ యూదుల రవాణాకు,వారి హత్యకు బాధ్యత వహించాడు. జర్మనీ లొంగిపోయిన తరువాత, అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్ ను మిత్రరాజ్యాలు మూడుసార్లు బంధించాయి. కానీ ప్రతిసారీ దళాల నుండి తప్పించుకోగలిగారు.1950లో, కాథలిక్ చర్చి సభ్యులు, మాజీ నాజీల సహాయంతో అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్ జర్మనీ నుండి తప్పించుకోగలిగాడు. అక్కడ నుండి అర్జెంటీనాకు బయలుదేరిన అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్ అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అసలు బాయర్ కి అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్ సమాచారం ఎలా తెలిసింది????

అర్జెంటీనాలో నివసిస్తున్న ఒక జర్మనీ సంతతికి చెందిన యూదు వ్యక్తి కూతురు అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్ కొడకుతో ప్రేమలో ఉండడంతో , సదరు వ్యక్తి బాయర్‌‌‌కి సమాచారం అందించాడు. ముందుగా బాయర్ వాదనలను ఇజ్రాయెల్ ఇంటలిజెన్స్ తోసిపుచ్చింది. బాయర్ పదేపదే సమాచారాన్ని నొక్కి చెప్పడం తో ఇజ్రాయెల్ సీరియస్ గా తీసుకుంది.మొస్సాద్ ముందుగా అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌ను ట్రాక్ చెయ్యమని ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ చీఫ్ ఇన్వెస్టిగేటర్, జ్వి అహరోని ని ఆర్జెంటినా రాజధాని బ్యూనోస్ ఎయిర్‌కి పంపింది. అహరోని, అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్ ని పట్టుకోవడానికి మొస్సాద్ అధిపతి హరేల్‌తో 30 మంది బృందాన్ని ఏర్పాటు చేసారు. మరింత నిఘా తరువాత,30 మంది బృందం అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్ ను కిడ్నాప్ చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించింది.మే 11, 1960 రాత్రి, అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్ తన పని ముగించుకొని ఇంటికి వెళుతుండగా పబ్లిక్ బస్సు దిగే సమయంలో మొస్సాద్ టీం కిడ్నాప్ చేసి సురక్షితమైన ప్రదేశానికి తీసుకుపోయింది. తొమ్మిది రోజుల తర్వాత, అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్, మొస్సాద్ టీం సభ్యులు , ఫ్లైట్ క్రూ లాగా రెడీ అయ్యి చార్టెడ్ ఫ్లైట్‌‌లో ఇజ్రాయెల్‌కు వెళ్లారు.అతను ఇజ్రాయెల్‌కు వచ్చిన రెండు రోజుల తర్వాత, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి డేవిడ్ బెన్ గురియన్ అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్ ను పట్టుకున్నట్లు బహిరంగంగా ప్రకటించాడు. అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్ ను జెరూసలేంలో విచారించారు,15 ఆరోపణలో దోషిగా తేలిన తర్వాత అడాల్ఫ్ ఐచ్‌‌‌‌‌‌‌‌‌‌మన్ ను ఉరి తీసారు.

The Mossad’s Man in Damascus: Eli Cohen

1960s లో ఇజ్రాయెల్‌కు సిరియా నుండి అతిపెద్ద బెదిరింపు వచ్చింది . సిరియా, ఇజ్రాయెల్ పొరుగున ఉన్న అరబ్ దేశాలతో జత కట్టి గోలన్ హైట్స్‌తో బోర్డర్ ప్రాంతంలోని ఉత్తర ఇజ్రాయెల్ ను దెబ్బ తీయాలని పూనుకుంది. సిరియా లో జరుగుతుహిన మిలిటరీ డెవలప్మెంట్స్ కోసం ఇజ్రాయెల్ కి ఒక ఏజెంట్ అవసరం ఏర్పడింది. ఇజ్రాయెల్ ఇంటలిజెన్స్‌కి ఎలి కోహెన్ రూపం లో ఒక అద్భుతమైన ఏజెంట్ దొరికాడు. ఎలి కోహెన్ ఈజిప్ట్‌లోని జియోనిస్ట్ కార్యకర్త, అతను 1957లో ఈజిప్ట్ నుండి బహిష్కరించబడటానికి ముందు ఇజ్రాయెల్ తరపున పనిచేశాడు. అతను మొదట్లో ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్‌లో చేరడానికి రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ, రెండుసార్లు తిరస్కరించబడ్డాడు.1960 లో మొస్సాద్ అతనికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఎలి కోహెన్ గూఢచారి గా నియమించారు. మొస్సాద్ ట్రైనింగ్ ముగిసిన తర్వాత ఎలి కోహెన్‌‌కి కమల్ అమిన్ తబేట్ గా పేరు చేంజ్ చేసి సిరియన్ మూలాలు ఉన్న ఒక వ్యాపారవేత్తగా మొస్సాద్ అతనిని ఆర్జెంటినాకి పంపించింది. అక్కడ కోహెన్ సిరియన్ రాజకీయ నాయకులతో మిలిటరీ సిబ్బందితో దౌత్యవేత్తలతో ఫ్రెండ్షిప్ చేసాడు. 1962లో, బాత్ పార్టీ ఆవిర్భావంతో, కోహెన్ సిరియాకు వెళ్లి అర్జెంటీనాలో తనకున్న పరిచయాలను ఉపయోగించి, సిరియన్ సమాజంలోని ఉన్నత స్ధాయిలోకి ప్రవేశించి, కొంతమంది ముఖ్యమైన అధికారులకు విశ్వసనీయుడిగా మారాడు. ఒకానొక సమయంలో, అతను రక్షణ శాఖ ఉప మంత్రి అభ్యర్థి రేస్ లో ఉంటాడు .సిరియాలో గూఢచారిగా పనిచేసిన మూడు సంవత్సరాలలో, ఎలి కోహెన్ ఇజ్రాయెల్ భద్రతకు,ఇజ్రాయెల్ శ్రేయస్సుకు కీలకమైన గూఢచార సమాచారాన్ని పంపించగలిగాడు .1964 లో సిరియా జోర్డాన్ నది జలాలను తరలించడానికి ఒక ఛానల్ ఏర్పాటు చేయాలనీ నిశ్చయించుకుంది. జోర్డాన్ నది ఇజ్రాయెల్ కు ప్రధాన నీటి వనరు. ఈ విధంగా జోర్డాన్ నీటి ని మళ్లించి ఇజ్రాయెల్ కి నీటి కొరత తీసుకురావాలని సిరియా ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని ఎలి కోహెన్ ఇజ్రాయెల్ వాసులకు చేర్చి వారిని హెచ్చరించాడు. ఈ విషయం తెల్సుకున్న ఇజ్రాయెల్ తమ వైమానిక దళాలతో ఛానల్ కోసం ఏర్పాటు చేసుకున్న మెషిన్స్ అన్నింటిని పేల్చేశారు. సిరియా కుట్రను భగ్నం చేసారు.1964 లో ఎలి కోహెన్ రక్షణ చర్యలను దగ్గరనుండి చూడటానికి సిరియా లోని గోలన్ హైట్స్‌‌ని సందర్శించి అక్కడ సైనికులకు నీడ కోసం చెట్లను నాటాలని సిరియా అధికారులను ఆదేశించాడు.ఇదే విషయాన్ని ఎలి కోహెన్ ఇజ్రాయెల్ అధికారులకు చేరవేసాడు.ఎలి కోహెన్ అందించిన సమాచారంతో ఇజ్రాయెల్ 1967లో జరిగిన సిక్స్-డే వార్‌లో చెట్ల స్థానాల కారణంగా గోలన్ హైట్స్‌లో సిరియా కోటలను గుర్తించగలిగింది.

1965లో ఎలి కోహెన్ కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయెల్ కి అందిస్తూ సిరియన్, సోవియెట్ధి అధికారులకు పట్టుబడ్డాడు. డమాస్కస్ కేంద్రానికి తీసుకెళ్లి 10,000 మంది ప్రజల సమక్షంలో బహిరంగంగా ఉరి తీసారు. ఉరి తీసేముందు ఎలి కోహెన్‌ను తన భార్య కి లేఖ రాయడానికి అనుమతిచ్చారు. ఈ రోజు వరకు కూడా అతని సమాధి , దాని తాలూకు గుర్తులు ఇప్పటికి ఇజ్రాయెల్ అధికారులకు దొరకలేదు. ఇజ్రాయెల్ చరిత్రలో ఎలి కోహెన్ అమరవీరుడిగా నిలిచి పోయాడు.

The Mossad Steals a Fighter Jet: Operation Diamond (1966)

1960s లో కోల్డ్ వార్ తారాస్థాయి కి చేరుకుంటుంది రోజులవి.అమెరికా,సోవియెట్ యూనియన్‌కి సపోర్ట్ గా ప్రపంచ దేశాలన్నీ రెండు గా విడిపోయాయి. అనేక అరబ్ దేశాలు సోవియెట్ యూనియన్ తో జత కట్టి అప్పటి సోవియెట్ సాంకేతికతకి అనుమతి పొందారు. అందులో భాగంగా అరబ్ దేశాలకు మిగ్-21 ఫైటర్ జెట్స్ సోవియెట్ యూనియన్ ట్రాన్స్ఫర్ చేసింది. ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఎలాగైనా మిగ్-21 సామర్ధ్యం తెలుసుకోవాలని దృఢ సంకల్పం తో ఉన్నారు. ఇక అప్పుడే ఇజ్రాయెల్ ఆపరేషన్ డైమండ్‌ని మొదలుపెట్టింది. 1963 లో మొస్సాద్ ఈ ఫైటర్ జెట్స్ ని కొనుగోలు చెయ్యాలని చూసి చతికిల పడింది. ఆ తర్వాత, 1964లో, ఇరాక్ వైమానిక దళంలో ఒక మెరోనైట్ క్రిస్టియన్ పైలట్ తమ కు ఉపయోగ పడొచ్చని ఇరాక్‌లోని ఒక యూదు మొసాద్‌కు సమాచారం అందించాడు. అతడే మునీర్ రెడ్ఫా.. ఇరాక్ ఎయిర్ ఫోర్స్ తో విసుగు చెందిన మునీర్ మొస్సాద్ గ్రూప్ తో యూరోప్‌లో చర్చలు జరిపి తన జెట్ ని ఇజ్రాయెల్ కి ఫ్లై చెయ్యడానికి ఒప్పుకుంటాడు. అందుకు ప్రతిగా తనకు తన కుటుంబానికి ఇజ్రాయెల్ పౌరసత్వ్యం ఇవ్వాలని దానితో పాటు పెద్ద మొత్తం లో డబ్బు, జీవనోపాధి కల్పించాలని కోరాడు.ఇరాక్‌కు తిరిగి రావడానికి ముందు, రెడ్‌ఫా ఇజ్రాయెల్‌ని సందర్శించి, ఇజ్రాయెల్ అధికారులతో తన ప్లాన్ ని డిస్కస్ చేసి , తన జెట్‌ను ల్యాండింగ్ చేసే హాట్జోర్ ఎయిర్‌బేస్‌ని సందర్శించాడు.ఆగష్టు 16 1966,న మునీర్ రెడ్ఫా తన జెట్ ని జిగ్ జాగ్ పద్ధతి లో ఇరాక్ జోర్డాన్ రాడార్లకు చిక్కకుండా ఇజ్రాయెల్ కి 900 km లు ప్రయాణించాడు. అదే సమయంలో, ఇరాక్‌లోని మొస్సాద్ బృందాలు రెడ్‌ఫా కుటుంబ సభ్యులను వ్యాన్‌లలో ఇరాన్ సరిహద్దుకు తరలించి ,కుర్దిష్ గెరిల్లాల ద్వారా ఇరాన్‌లోకి అక్రమంగా రవాణా చేసి, ఆపై ఇజ్రాయెల్‌కు తరలించారు.రెడ్‌ఫా తన మిగ్-21ని ఇజ్రాయెల్‌లో ల్యాండ్ చేసిన కొన్ని నెలల తర్వాత పూర్తి విశ్లేషణ కోసం ఆ జెట్ ని అమెరికాకి పంపారు . ఇజ్రాయెల్ లో ఈ జెట్ కి 007 అని పేరు పెట్టారు.

Avenging the Munich Massacre: Operation Wrath of God (1972)

1972 సెప్టెంబర్ 5, 6 తేదీన మునిచ్ ఒలింపిక్స్ సందర్బంగా బ్లాక్ సెప్టెంబర్ గ్రూప్ కి చెందిన ఉగ్రవాదులు ఇజ్రాయెల్ కి చెందిన 11 మంది అథ్లెట్లను కిడ్నప్ చేసి దారుణంగా హత్య చేసారు. ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం మునిచ్ మారణకాండకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వ్యక్తులను గుర్తించి చేసి వారిని హత్య చేసే బాధ్యతను మొసాద్‌కు అప్పగించింది.ఈ టాస్క్ కి ఆపరేషన్ వ్రాత్ అఫ్ గాడ్ అని పేరు పెట్టారు . ఈ ఆపరేషన్ లో పాల్గొనే టీం ఎవరిని టార్గెట్ చేయాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి నేతృత్వయం లోని ఒక సీక్రెట్ కమిటీ పర్యవవేక్షించి ఒక లిస్ట్ మొస్సాద్ కి అందచేసింది .బయోనెట్ అనే కోడ్ తో మొస్సాద్ టీం బ్లాక్ సెప్టెంబర్, ఫతాహ్ , పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజషన్ టీం లలో ని ముఖ్యమైన వారి ఏరివేత ప్రారంభించింది. ఈ ఆపరేషన్ వ్రాత్ అఫ్ గాడ్ తో పాటు మొస్సాద్ టీం ఇజ్రాయెల్ నేవీ తో కలిసి ఆపరేషన్ స్ప్రింగ్ అఫ్ యూత్ అనే ఆపరేషన్ తో బీరట్‌లో ఉన్న పాలెస్తీనా తీవ్రవాదులను టార్గెట్ చేసింది.
1973 లో మొస్సాద్ టీం నార్వే లో ని ఒక వెయిటర్ ని ప్రమాదవశాత్తు చంపడం తో ఈ ఆపరేషన్ కి తాత్కాలికంగా బ్రేక్స్ పడ్డాయి. రెడ్ ప్రిన్స్ పేరుతో చలామణి అవుతున్న బ్లాక్ సెప్టెంబర్ ఉగ్రవాద సంస్థ ఆపరేషన్స్ చీఫ్ అలీ హస్సన్ సలీమాహ్ ని హత్య చేయడానికి 1979 లో ఈ ఆపరేషన్ని తిరిగి ప్రారంభించారు.

ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన మొస్సాద్ అక్టోబర్ 6 న జరిగిన హమాస్ దాడులను ఎందుకు పసిగట్టలేకపోయింది.డజన్ల కొద్దీ సాయుధ హమాస్ ముష్కరులు ఇజ్రాయెల్-గాజా స్ట్రిప్ మధ్య అత్యంత పటిష్టమైన సరిహద్దును దాటగలిగారు, వేలాది రాకెట్లు గాజా నుండి ఇజ్రాయెల్‌లోకి ప్రయోగించబడ్డాయి.ఇజ్రాయెల్ డిఫెన్సె మిడిల్ ఈస్ట్‌లో కానీ ప్రపంచంలో కానీలోనే అత్యంత పటిష్టమైనది గా నిస్సందేహంగా చెప్పొచ్చు. దీనికి పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులలో, అలాగే లెబనాన్, సిరియా లాంటి ప్రాంతాలలో ఇన్‌ఫార్మర్లు, వారి ఏజెంట్లు ఉన్నారు. గాజా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త సరిహద్దు వెంట అత్యాధునిక కెమెరాలు, గ్రౌండ్-మోషన్ సెన్సార్లు ,సైన్యం గస్తీ ఉంటాయి . ముళ్ల కంచె ఖచ్చితంగా స్మార్ట్-బారియర్‌గా చెప్పొచ్చు.అయినప్పటికీ హమాస్ మిలిటెంట్లు దానిని బుల్డోజ్ చేసి, సముద్రం నుండి, పారా గ్లిడెర్ ద్వారా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు.అలాంటి దాడులు చెయ్యాలంటే ఎంతో సమన్వయము తో కూడిన ప్రయత్నాలు అవసరం. ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీస్కుని హమాస్ , మొస్సాద్ కి ఎలాంటి అనుమానం రాకుండా చేసింది అంటే ఇది హమాస్ గొప్పతనమా, మొస్సాద్ ఫెయిల్యూర్ ఆ .. ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ …ఏదేమైనా నలిగి పోయేది సామాన్య ప్రజలు !

Tags

Related News

Kimidi Family Cold War: కిమిడి ఫ్యామిలీ వార్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కత్తులు దూసుకునే రాజకీయం

DY CM Pawan Kalyan: పవన్ ప్రాయశ్చిత దీక్షవెనుక ఇంత కథ ఉందా ?

Telangana BJP: అభయ్ ఆగయా.. టీ బీజేపీకి వెన్నులో వణుకు?

KA Paul And JD Lakshmi Narayana: సరిపోయారు ఇద్దరూ.. విశాఖ నుండి ఔట్?

Khajaguda Land Kabja: ఖాజాగూడలో కబ్జా బాగోతం.. రూ.3000 కోట్ల భూమి ఖతం.. ఆ మాజీ మంత్రే సూత్రధారా?

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

TDP MLA Koneti Adimulam Case: నా ఇష్టంతోనే ఆ పని! ఆదిమూలం బాధితురాలు సంచలనం

Big Stories

×