EPAPER
Kirrak Couples Episode 1

Primary Education: కేజీ టూ పీజీ ఉచిత విద్య.. కేసీఆర్ హామీ నెరవేరేది ఎప్పుడు..?

Primary Education: కేజీ టూ పీజీ ఉచిత విద్య.. కేసీఆర్ హామీ నెరవేరేది ఎప్పుడు..?

Primary Education: పాఠాశాలలో పాఠాలు నేర్వాల్సిన పాపలు మూడేళ్లుగా బడి మొహం కూడా చూడలేదు.పెన్ను పట్టి సమాధానాలు రాయాల్సిన చిన్నారుల చేతులు చీపురు పట్టి ఇంటిపనుల్లో నిమగ్నమయ్యే దుస్థితి.
ఈ చిన్నారులకు ఎదురవుతున్న పరిస్థితులేంటి? ఆడపిల్లల చదువుకు వచ్చిన ఆటంకాలేంటి.?


మౌనిక అనే అమ్మాయి నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలం అంతంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని దేవులాతండాలో ఉంటుంది. తండ్రి పేరు బిక్కు , తల్లి పేరు రాజి. ఇద్దరు నిరక్షరాస్యులే. ఇంటిల్లిపాది కూలికి వెళితేనే కడుపునిండేది. తండా లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం మూడేళ్లుగా బడి మాని పనుల్లో తల్లి దండ్రులకు ఊతంగా ఉంటోంది .

ఇది ఒక్క మౌనిక కథ కాదు.ఈ చుట్టుపక్కల తండాల్లో చాలామంది ఆడపిల్లల చదువుకు పట్టిన గ్రహణం. దీంతో బడిబాట మాని ఎందరో చిన్నారులు పొలంబాట పడుతున్నారు.ఇక్కడ పొలంలో పత్తి ఏరుతున్న ఈ పాప పేరు నందిని. ఈ పాపది కూడా అచ్చం మౌనిక లాంటి కథే! పొద్దున పొలం పని ఆ తర్వాత గ్రామంలోని పిల్లలతో ఆటలు. తమ తండాలో బడి ఉన్నంత వరకు బానే సాగిన వీరి చదువులకు ఆ తర్వాత ఏమైంది? ఎందుకు వీరి చదువులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.?


దేవులా తాండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఒకప్పుడు పిల్లల చదువులతో ఆటపాటలతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు నిర్మా నుష్యంగా మారింది. ఇక్కడ ఒకటి నుంచి 5తరగతుల చదువు చెప్పేవారు. ఈ తండాతోపాటు సమీపంలోని రెండు తండాల పిల్లలు కూడా ఇక్కడే చదువుకునేవారు. ఐతే కరోనా కల్లోలం ఈ బడికి గ్రహణంలా పట్టింది. నాడు మూతబడిన తలుపులు దాదాపు మూడేళ్లవుతున్నా ఇప్పటికీ తెరుచుకోలేదు.దీంతో విద్యార్థుల చదువులు ఆగిపోయాయి. డ్రాపౌట్స్ పెరిగిపోయాయి. ఇదే సాకుగా చూపుత విద్యార్థులు తక్కువగా ఉన్నారంటూ విద్యాశాఖ ఈ బడిని మూసేసింది. ఉన్న పిల్లలను అంతంపేటలోని ప్రభుత్వ స్కూల్ కు అటాచ్ చేసింది. దీంతో ఉన్న ఊర్లో ఎలాగోలో పిల్లలను చదివిద్దామనుకున్న పేరెంట్స్ కూడా పిల్లలను బడిమాన్పించి పనుల్లో పెట్టారు.

పిల్లలను బడి మాన్పించి పనుల్లో పెడుతున్న తల్లిందండ్రులు చెప్పిన విషయాల్లోనూ నిజం లేకపోలేదు. అంతంపేట బడికి ఈ తండాలు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం.కనీస రవాణా సౌకర్యం లేదు. పైగా నిర్మానుష్య ప్రదేశం నుంచి నడిచే వెళ్లాలి. దీంతో పిల్లలు ఒంటరిగా వెళ్లాలంటే భయపడే పరిస్థితి. ముఖ్యంగా ఆడపిల్లలను అంతదూరం పంపడం ఇష్టం లేక తల్లిదండ్రులు బడి మన్పించారు. కొంత మంది పిల్లలు పక్క గ్రామ బాడిలో చేరినా పనులు దొరకనప్పుడే చుట్టుపు చూపుగా బడికి పోతున్నారు. ఇంక చదువులేం సాగుతాయి.

ఐతే అందరు తల్లిదండ్రూలూ ఇలాగే లేరు. కొందరు తమ బిడ్డల చదువు కోసం కష్టాలను ఓర్చుకుంటున్నారు. తమ బిడ్డలకు ధైర్యం చెప్పి బడికి పంపుతున్నారు.దానికి మచ్చుకో ఉదాహరణ రఘుపతి. ధర్మాతండాలో నివాసం ఉంటారు. పిల్లలను బాగా చదివించాలనే సంకల్పంతో గతంలో తమ పిల్లలు వెళ్లే తండా స్కూ ల్ మూత బడ్డా పక్క గ్రామంలోని పాఠశాలకు పిల్లలను పంపుతున్నారు. తండాలో పిల్లలు ఎవ్వ రు బడికి వెళ్లినా వెళ్లకున్నా తమ పిల్లలను మాత్రం నిత్యం బడికి తప్పక పంపుతారు. పిల్లలు కూడా పొద్దునే లేచి రెడీ అయ్యి పుస్తకాల బ్యాగులు భుజాన వేసుకొని ధూరాభారాన్ని లెక్కచేయకుండా 2కిలోమీటర్లు నడిచి మరి పాఠశాలకు వెళ్తారు. తాము పడ్డ ఇబ్బం దులు తమ పిల్లలు పడొద్దని చదువుకొని ప్రయోజకులు కావాలని బడికి పంపుతున్నామని అయితే నిత్యం అంతదూరం నడిచివెళ్లడం పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. రవాణా సౌకర్యమన్నా కల్పించాలని కోరుతున్నారు.

ఇప్పటిదాకా మనం చూసినవి పరిస్థితులు ఒక్క నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్ మండల తండాలకే పరిమితం కాదు. మొత్తంగా రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల విద్యా నాణ్యత అంతంతమాత్రం గానే ఉంది. ఎక్కడో కొన్ని పాఠశాలలు తప్పి తే చాలా వరకు పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు అంతగా లేవు. చీకటి కొట్టాల్లాంటి తరగతి గదుల్లోనే పేద పిల్లల చదువులు కుంటుతున్నాయి. ఇది కొక్కిరాల గౌరారంలోని కొర్ర మాన్ సింగ్ తండా ప్రాథమిక పాఠశాల. పాఠశాలలో పిల్లలు కూర్చోవడానికి కనీసం బెంచీలు గాని ఇతర మౌలిక సదుపాయాలు గానీ సరిగా లేవు. ఉండేది ఒకే టీచర్. అన్ని తరగతుల పిల్లలు ఒక్కచోటే కూర్చొని చుదువుకోవాల్సిందే. ఈ పాఠశాలకు కనీసం ప్రహరీ గోడ కూడా లేదు. పిల్లలు ఉన్నారో లేదో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఉన్న టీచర్ కూడా బాధ్యుడు కాదు. దీంతో ముఖ్యంగా విద్యార్థులకు రక్షణ లేని పరిస్థితి. ఇది కూడా హాజరు తగ్గడానికి ఒక కారణం. ఇక్కడి పరిస్థితిపై సర్పంచ్ స్పందన వింటే పాఠశాల దుస్థితి అర్ధం
అవుతుంది.

చిన్నారుల చదువులకు పునాది ప్రాథమిక పాఠశాల విద్యే. మరి అలాంటి పునాది ఇలాంటి దుర్భర పరిస్థితుల మధ్య ఉండి గుల్లబారి పోతే వారి భావి జీవితానికి మంచి బాటలు ఎలా నిర్మితమవుతాయి. ఇప్పటికే ప్రభుత్వ చదువులు జనం నమ్మకం కోల్పోయింది. ఉన్నత వర్గాలు, మధ్యతరగలి వాళ్లు ప్రైవేట్ పాఠశాలలో చదివించడానికే తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు.ఆర్ధిక స్తోమత లేని తల్లిదండ్రులకు మాత్రం తమ బిడ్డల చదువు అందని ద్రాక్షగానే మారుతోంది.

ఇది నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కళ్లపల్లి ప్రభత్వ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ కరోనా సమయంలో విద్యార్థుల సంఖ్య 75మందిగా ఉండేది. ప్రస్తుతం ఇక్కడ చదివే పిల్లలు 39మంది మాత్రమే. ఎందుకు ఈ పరిస్థితి అంటే పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నా రనేది టీచర్ల సమాధానం.

ప్రభుత్వ పాఠశాలలో బీఈడీ చదివి డీఎస్సీ ఎదుర్కొని వచ్చిన ఉన్నత విద్యావంతులైన టీచర్లు ఉన్నా తల్లిదండ్రులు ప్రైవేట్ వైపు మారాలుతున్నారంటే కారణాలు బోలెడు. ఇదే మాట గ్రామస్థులను అడిగితే వారి నుంచి వచ్చిన సమాధానం కూడా ఆలోచింప చేసేదిగా ఉంది.టీచర్ లు భారీగా జీతాలు తీసుకుంటున్నారు కానీ బడి నడపడంపై మాత్రం శద్ధపెట్టడం లేదంటున్నారు. బడి టైమ్ కు టీచర్లే రావట్లేదంటున్నారు.వారి హాజరుకు ఓ పద్ధతీ పాడు లేకపోవడం ఆలసత్వానికి కారణమంటున్నారు. విద్యాశాఖ పర్యవేక్షణా లోపం కూడా కారణమేనంటున్నారు. అందుకే మరో దిక్కులేక అప్పుచేసి మరీ పిల్లలను ప్రైవేటు బడులకు పంపాల్సి వస్తున్నదంటున్నారు.

అసలే రెండు సంవత్సరాలపాటు కరోనా వల్ల పిల్లల చదువులు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పిల్లలపై ఈ ప్రభావం ఎక్కు వగా ఉంది. దీన్ని అధిగమించి పిల్లల్లో అభ్యాసన సామర్థ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం తొలి మెట్టు పేరుతో ఫౌండేషన్ లిట్రేచర్ న్యూమరసి ప్రోగ్రాం చేపట్టింది. అయితే బడులు మొదలై ఐదు నెలలు నిండుతున్నా చాలా పాఠశాలల్లో విద్యార్దుల అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపడిన దాఖలాలేలేవు . ఈ ఒక్క కార్యక్రమం అనే కాదు బడిబాట మన ఊరు మన బడి లాంటి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వం పాఠశాల విద్య మెరుగు పరిచే క్రమంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నా అవి గ్రామీణ స్థాయిలో ప్రభావ వంతంగా అమలు కావడం లేదు.

ప్రాథమిక పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కొరత కూడా తీవ్రంగా ఉంది. ఎన్నో స్కూల్స్ లో బెంచీలు లేక బండలపై కూర్చొనే చదువుకోవాల్సిన పరిస్థితి. లైటింగ్ లేక గుడ్డి వెలుతురులోనే అక్షరాలు నేర్వాల్సిన పరిస్థితి. పాఠశాలల్లో పారిశుధ్య బాధ్యత నిర్వర్తించే స్కా వేంజర్స్ లేక బాత్రూంలు కంపుకొడుతున్నాయి. పాఠశాల పరిశుభ్రత బాధ్యతను గ్రామపంచాయతీకి అప్పగించడంతో బాత్రూంల క్లీనింగ్ సరిగా జరగడం లేదు. పాఠశాల ఆవరణ కూడా చెత్త చెదారం నిండిపోతున్నది. చాలా పాఠశాలలో మంచి నీటికి కూడా దిక్కు లేదు. పిల్లలే ఇంటి నుండి బాటిల్ లలో తెచ్చు కోవాల్సిన పరిస్థితి.

చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని ఇది పిల్లలకు నాణ్యమైన విద్య అందకుండా పోవడానికి ప్రధాన కారణం అంటున్నారు ఉపాధ్యాయ సంఘనేతలు. గతకొంత కాలంగా కొత్త రిక్రూట్ మెంట్ అనేదే లేదంటున్నారు. ఇలాం టి పరిస్థితి ఉంటే తొలిమెట్టు లాంటి కార్యక్రమం ఎలా ముందుకు పోతుంది అని ప్రశ్ని స్తున్నా రు. పాఠశాల విద్య మెరుగు పడాలంటే వీలైనంత త్వరగా ఉపాధ్యాయ పోస్ట్ లు రిక్రూట్ చేయాలంటున్నారు.

ఇప్పటిదాకా మీరు ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను చూశారు కదా. అందుకు కారణాలు కూడా అందరికీ తెలిసినవే. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి కూడా బోలెడు కారణాలు. మరి ఏంటి మార్గం. ఇంకో మార్గమేమీ లేదా. అంటే దానికి సమాధానమే ఇప్పుడు మనం చూస్తున్న స్కూల్. ఉపాధ్యాయుల చిత్త శుద్ధికి ప్రజల సహకారం తోడైతే ప్రభుత్వ పాఠశాలు ఎంత అద్భుతంగా మారుతాయో అనేందుకు నిదర్శనం ఈ పాఠశాల. కార్పొ రేట్ పాఠశాలకు దీటుగా విద్యాబోధన చేస్తున్నది చింతపల్లి మండలంలోని పోలేపల్లి రాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.

2015లో అన్ని పాఠశాలల మాదిరిగానే ఇక్కడి పాఠశాల కూడా అరకొరగానే ఉండేది. అప్పుడు ఇక్కడికి హెడ్ మాస్టర్ గా వచ్చిన వెంకట్ రెడ్డి అనే ఉపాధ్యాయులు పరిస్థితి అంతా గమనించి పాఠశాలను బాగుచేసేందుకు నడుం కట్టారు. విద్యార్థుల ఇండ్లకు వెళ్లారు. తల్లిదండ్రులు ఎలాంటి చదువులు ఆశిస్తున్నారో తెలుసుకున్నారు. పై అధికారులతో మాట్లాడి ఇంగ్లీష్ మీడియంకు పాఠశాలని మార్పు చేయించారు.

స్వయంగా ప్రధానోపాద్యాయులు నారాయణరెడ్డి పర్యవేక్షణలో టీచర్ల పనితీరు కూడా మెరుగైంది. విద్యాబోధనలో వాస్తవిక పద్ధతులను అమలు చేస్తున్నారు. బోధన మెరుగవడంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే అక్కడి గ్రామ పంచాయతీ కూడా 2019లో గ్రామసభ ఏర్పా టు చేసి గ్రామంలోని ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చేరితేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని పార్టీలకు అతీతంగా తీర్మా నం చేసుకున్నా రు. అందరికి ఆదర్శంగా ఉండాలని సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డు మెంబర్లు తమ పిల్లలందరిని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఇంత మంచి కార్యక్రమానికి తమ చేయూత కూడా తోడుకావాలని తమ బడి బాగుండాలని కొందరు దాతలు ముందుకు వచ్చారు. పాఠశాల సుందరీకరణకు అండగా నిలిచారు. కొందరు స్కూ ల్ గోడలపై అందమైన బొమ్మలు వేయించారు. మరికొందరు బెంచీలు ఇప్పించారు. ఇంకొందరు స్టేజి, అదనపు గదులు కట్టించారు. దీంతో కార్పొరేట్ పాఠశాలకు ఎంతమాత్రం తీసిపోకుండా తయారైంది ఈ పాఠశాల. ఏటా జరిగే గురుకుల ప్రవేశ పరీక్షలో ఇక్కడివిద్యార్థులు మంచి ర్యాంకులు సాదించి సీట్లు పొందుతున్నా రు.

చింతపల్లి మండలంలోని పోలేపల్లి రాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు రాష్ట్రమంతటికీ ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రభుత్వం నిర్లక్ష్యం శాపమవుతున్నా, చేయూత లేకున్నా.. టీచర్లు, ప్రజలు భాగస్వామ్యమైతే తమ ఊరి బడి ఎంత బాగా నడుపుకోవచ్చో అనేందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది.

చింతపల్లి మండలంలోని పోలేపల్లి రాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రజలు , టీచర్ల బాధ్యతగా ఉంటే ఏంసాధించవచ్చో చెబుతున్నది. మరి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల సంగతేంటి. దేశంలోనే ఆగ్ర రాష్ట్రంగా మనం ఎదుగుతున్నామని సీఎం కేసీఆర్, కేటీఆర్ ఎప్పుడూ చెబుతున్నారు. సంతోషం కానీ.. విద్యలో మనం ఎక్కడ ఉన్నాం. కేసీఆర్ చెప్పిన కేజీ టూ పీజీ ఉచిత విద్యకు మోక్షం ఎప్పుడు.? ఇంకెన్నాళ్లకు.?

Related News

Kimidi Family Cold War: కిమిడి ఫ్యామిలీ వార్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కత్తులు దూసుకునే రాజకీయం

DY CM Pawan Kalyan: పవన్ ప్రాయశ్చిత దీక్షవెనుక ఇంత కథ ఉందా ?

Telangana BJP: అభయ్ ఆగయా.. టీ బీజేపీకి వెన్నులో వణుకు?

KA Paul And JD Lakshmi Narayana: సరిపోయారు ఇద్దరూ.. విశాఖ నుండి ఔట్?

Khajaguda Land Kabja: ఖాజాగూడలో కబ్జా బాగోతం.. రూ.3000 కోట్ల భూమి ఖతం.. ఆ మాజీ మంత్రే సూత్రధారా?

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

TDP MLA Koneti Adimulam Case: నా ఇష్టంతోనే ఆ పని! ఆదిమూలం బాధితురాలు సంచలనం

Big Stories

×