EPAPER
Kirrak Couples Episode 1

Nani: జెర్సీ నష్టాలు తెచ్చిందా..? కౌంటర్ తో నాని క్లారిటీ..

Nani: జెర్సీ నష్టాలు తెచ్చిందా..? కౌంటర్ తో నాని క్లారిటీ..

Nani: నాచురల్ స్టార్ నాని,మృణాల్ ఠాకూర్ కాంబో లో తెరకెక్కిన హాయ్ నాన్న మూవీ ట్రైలర్ మాంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 7వ తేదీన గ్రాండ్ గా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 21 లేదా 22 తారీకులలో విడుదల చేయాలి అని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని ప్రిపోన్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ లో మూవీ హీరో నాని కూడా యాక్టివ్ గా పాల్గొన్నారు..


టీజర్ ఈవెంట్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన నాని.. హాయ్ నాన్న సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. హాయ్ నాన్న మూవీ తన కెరీర్ లోని ఒక ప్రత్యేకమైన మూవీ అని నాని అన్నారు. అంతేకాదు ఈ మూవీ చూసేటప్పుడు ప్రతి చాలా సీన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారని నాని చెప్పాడు. ఈ మూవీ లో అవకాశం రావడం నిజంగా తన అదృష్టం అన్నట్లు నాని మాట్లాడాడు. ఈ చిత్రం గురించి ప్రమోషనల్ వీడియోలు విడుదల అయ్యే కొద్ది ప్రేక్షకులలో ఒక క్లారిటీతో పాటు ఆసక్తి కూడా కలుగుతుందని నాని అన్నాడు.

మొదటినుంచి నానికి కూతురు కావాలి అని ఎంతో ఆశ ఉండేదట.. అయితే ఇన్ని రోజులకు హాయ్ నాన్న మూవీతో ఆ కలలో జీవించే అవకాశం కలిగిందని నాని చెప్పుకొచ్చాడు. ఆల్రెడీ తండ్రి కూతుర్ల బ్యాక్ డ్రాప్ తో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి.. మరి ఈ మూవీ వాటికి కాస్త భిన్నంగా ఉంటుందా అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు నాని తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు. మీకు చూడడానికి ఇది రెగ్యులర్ చిత్రంలా అనిపించవచ్చు ,కానీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అలాగే ఇతర ప్రమోషన్ వీడియోస్ విడుదలైన తర్వాత మీకు దీని గురించి ఇంకా స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ మూవీలో ఎమోషన్స్ మన నిజ జీవితానికి ఎంతో దగ్గరగా ఉండడమే కాకుండా మనసుకు హత్తుకుని ఎలా ఉంటాయి అని నాని అన్నారు.


అంతేకాదు ఇది కమర్షియల్ గా ఉపయోగపడే కంటెంట్ తోనే కాకుండా అన్ని వయసుల వారిని అలరించే మూవీ అవుతుందని.. అందుకే తన దృష్టిలో ఇది మోస్ట్ కమర్షియల్ మూవీ అని ధీమాగా చెప్పాడు . అయితే కమర్షియల్ సినిమా అన్నాను కదా అని ఎక్కువ యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు అని కూడా క్లారిటీ ఇచ్చాడు.
అలాగే ఫ్యాన్ ఇండియా మూవీలో తెలుగు నటులను ఎక్కువగా తీసుకోలేదే అన్న ప్రశ్నకి కూడా నాని స్పందించారు. పాత్రలకు తగిన విధంగా ఉండే వ్యక్తులను ఎంచుకోవాలి అనే భావనే తప్ప ,వారు ఏ ఇండస్ట్రీకి సంబంధించిన వారు అన్న హద్దులు సినిమాకి ఉండవు అని నాని అన్నారు. పాత్రల ఎంపిక కేవలం ఒక మంచి సినిమా అందించాలి అన్న ఉద్దేశం మీద మాత్రమే ఆధారపడి ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇక మూవీ ముందుకు తీసుకురావడం వెనుక కారణాన్ని కూడా నాని వివరించాడు.

అన్నయ్య ప్రభాస్ చిత్రం సలార్ కోసం తమ్ముడు తన మూవీ డేట్స్ మార్చుకున్నాడు అని నాని అసలు రీజన్ ని ఎంతో జోవియల్ గా చెప్పాడు. అంతేకాకుండా ఒక మంచి లవ్ స్టోరీ, సూపర్ డూపర్ యాక్షన్ మూవీ లతో డిసెంబర్ నెల ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి సిద్ధంగా ఉంది అని నాని అన్నాడు. ఈ నేపథ్యంలో నాని ఇంతకుముందు నటించిన జెర్సీ, శ్యామ్ సింగరామ్ మూవీలకు టాక్ తప్ప ప్రాఫిట్ పెద్ద రాలేదు.. అన్నమాటకు నాని కొంత అసహనంగా సమాధానం ఇచ్చాడు. అసలు మీకు ఈ సినిమాలకు డబ్బులు రాలేదు అని ఎవరు చెప్పారు స్పష్టంగా చెప్పండి. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ మంచి వసూళ్లు రాబట్టాయి. మీరు కావాలి అంటే అలా సుందరానికి మూవీని ఇక్కడ ఉదాహరణగా చూపించండి తప్ప జెర్సీ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అని నాని అసహనం వ్యక్తం చేశాడు. ఇదే విషయంపై జెర్సీ మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా తన ట్విట్టర్ లో స్పందించాడు. జెర్సీ మూవీ వల్ల మంచి లాభాలు వచ్చాయని, అలాగే సితార బ్యానర్ కు జాతీయస్థాయిలో ఈ చిత్రం వల్లే గుర్తింపు వచ్చిందని నాగవంశీ తన ట్వీట్లో పేర్కొన్నాడు.

Related News

Rhea Singha: 19 ఏళ్ల అమ్మాయి, 51 మందితో పోటీ.. చివరికి మిస్ యూనివర్స్ ఇండియాగా కిరీటం, ఇంతకీ తనెవరు?

Devara Movie: ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్.. ‘దేవర’ కోసం స్పెషల్ ప్లానింగ్

Aishwarya Rai Bachchan: ఒక్క ఫోటోతో రూమర్స్ కి చెక్.. ఇకనైనా ఆగేనా..?

Upasana Konidela: ఆరోగ్యం విషయంలో మరో ముందడుగు.. హెచ్పీసీఎల్‌తో మెగా కోడలు పార్ట్‌నర్‌షిప్

Star Hero Daughter : హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో కూతురు..

Rakul Preet : మరో బిజినెస్ లోకి రకుల్ ప్రీత్.. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ..

Hari Hara Veera Mallu: చేసేది ప్యాచ్ వర్క్ మాత్రమే.. పవన్ ఎన్ని రోజులు కేటాయించారంటే.?

Big Stories

×