EPAPER

IND vs PAK: ఇండియన్ ప్లేయర్ ని ఓ గిఫ్ట్ అడిగిన…పాక్ కెప్టెన్ బాబర్

IND vs PAK: ఇండియన్ ప్లేయర్ ని ఓ గిఫ్ట్ అడిగిన…పాక్ కెప్టెన్ బాబర్

IND vs PAK: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో గూస్ బంప్స్ ఏమీ రాలేదు కానీ…మ్యాచ్ అయిన తర్వాత రకరకాల ఆసక్తికర ఘటనలు జరిగాయి. అందులో ఒకటి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మన ఇండియన్ క్రికెటర్ దగ్గరికి వచ్చి ఒక గిఫ్ట్ అడిగాడు. అదేమిటో తెలుసా? తను వేసుకున్న జెర్సీని అడిగాడు. ఇంతకీ అంత స్పెషల్ క్రికెటర్ ఎవరనుకున్నారు? ఇంకెవరండీ బాబూ…మన కింగ్ విరాట్ కొహ్లీ…


మ్యాచ్ అయిపోయిన వెంటనే బాబర్ గబగబా వచ్చి విరాట్ ని కలిశాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. వెంటనే విరాట్ తను వేసుకున్న జెర్సీని తీసి బాబర్ కి ఇచ్చాడు. ఇది మ్యాచ్ కే హైలెట్ గా మారింది. ఇది కదా…అభిమానం అంటే…ఒక పొరుగుదేశం కెప్టెన్…వచ్చి అంత ఇదిగా అడిగినప్పుడు కాదనకుండా ఎలా ఉంటారు?…మన ఇండియా గొప్పతనం అదే…అవసరమైనప్పుడు ప్రేమాభిమానాలు చూపించడంలో మనవాళ్లని మించినవారెవరు? చెప్పండి. అడిగిన వెంటనే విరాట్ తన జెర్సీనిచ్చి…షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

క్రీడాస్ఫూర్తి అంటే ఇదే కదా…అని నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక సందర్భంలో బాబర్ ఆజామ్ కూడా కొహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పాడు. చాలా సందర్భాల్లో కొన్ని టెక్నిక్స్ చెప్పాడని తెలిపాడు. అవి నా కెరీర్ కెంతో ఉపయోగపడ్డాయన అన్నాడు. కొహ్లీ నా గురువు అని కూడా అన్నాడు. అందుకే దీనిని గురుశిష్య అనుబంధంగా అందరూ కొనియాడుతున్నారు.


అయితే ఈ ఘటనతో పాటు మరొక ఆసక్తికర ఘటన జరిగింది. కామెంటేటర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ దగ్గరకు వెళ్లిన రోహిత్ చాలాసేపు మాటాడుతూ కూర్చున్నాడు. అందరూ మ్యాచ్ గెలిచిన సంతోషంలో ఉంటే..తను మాత్రం గంభీర్ తో మాట్లాడాన్ని గమనించారు. బహుశా వచ్చే మ్యాచ్ ల్లో ఎలా ఆడతే బాగుంటుందో తెలుసుకుంటున్నాడని పలువురు కామెంట్లు చేశారు. అయితే వరల్డ్ కప్ లో గంభీర్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అలాగే పాకిస్తాన్ మీద ఇంకా మంచి రికార్డ్ ఉంది. బహుశా అందుకే అతని సలహాలు తీసుకుంటున్నాడని అనుకున్నారు. అయితే కొహ్లీ అన్నా, ధోనీ అన్నా గౌతమ్ కి పడదనే సంగతి అందరికీ తెలిసిందే.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×