EPAPER

Rohit Sharma : సిక్సర్లతో రోహిత్ రికార్డుల మోత

Rohit Sharma : సిక్సర్లతో రోహిత్ రికార్డుల మోత
This image has an empty alt attribute; its file name is rohith-sarma-1.jpg

Rohit Sharma : ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఆ హీట్ వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటిది అందులో మళ్లీ రికార్డుల మోత మోగిందంటే అంతకన్నా మజా ఏముంటాది…హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాట్ నుంచి సిక్సర్ల వర్షం కురిసింది. పాక్ తో జరిగిన మ్యాచ్ లో ఎంతో అవలీలగా ఆరు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు.  ఈ దెబ్బతో ప్రపంచకప్ లో  అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ల జాబితాలో మూడో స్థానానికి చేరిపోయాడు.


రోహిత్ ఖాతాలో ఇప్పటికి 34 సిక్సర్లు ఉంటే అతనికన్నా ముందు గేల్ 49 సిక్సర్లతో టాప్ లో ఉన్నాడు. తర్వాత డివిలియర్స్ 37 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే డివిలియర్స్ ని దాటడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే ఇంకా ఆడాల్సిన మ్యాచ్ లున్నాయి. ఇంక నాలుగు సిక్సులే బాకీ ఉన్నాయి. అది పెద్ద విషయం కాదు. కానీ నెంబర్ వన్ కావాలంటే 16 కావాలి.  ఈ వరల్డ్ కప్ లోనే సాధ్యం కావాలని అభిమానులు కోరుతున్నారు. ఎందుకంటే వచ్చే నాలుగేళ్లలో నేను జట్టులో ఉండకపోవచ్చు, ఇదే నా ఆఖరి వరల్డ్ కప్ అని తనే చెప్పాడు.

అయితే  వీటితో పాటు మరొక  రికార్డు ఉంది…అదేమిటంటే ప్రపంచకప్ లో ఒకే ఇన్నింగ్స్ లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు అత్యధికసార్లు కొట్టిన ఇండియన్ బ్యాట్స్ మెన్ గా రోహత్ నిలిచాడు. తను మూడు సార్లు ఈ ఫీట్ నమోదు చేయగా, అంతకుముందు సచిన్ టెండుల్కర్ రెండుసార్లు ఐదుకన్నా ఎక్కువ సిక్సర్లు కొట్టాడు.


ఇంతటితో అయిపోలేదు…రోహిత్ శర్మ సిక్సర్ల పంట…
పాక్ మ్యాచ్ లో కొట్టిన ఆరు సిక్సర్లతో కలిపి ఇప్పటికి 300 సిక్సర్లు కొట్టిన మూడో బ్యాట్స్ మెన్ గా రికార్డ్ స్రష్టించాడు. అయితే మొదటి స్థానంలో షాహిద్ ఆఫ్రిది ఉండగా, రెండో ప్లేస్ లో గేల్ కొనసాగుతున్నాడు.

అలాగే ప్రపంచకప్ హిస్టరీలో పాకిస్తాన్ మీద అత్యధిక స్కోర్ చేసిన ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ మరో రికార్డు లిఖించాడు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×