EPAPER

Telangana Elections 2023 : కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. కొడంగల్ నుంచి రేవంత్ పోటీ

Telangana Elections 2023 : కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. కొడంగల్ నుంచి రేవంత్ పోటీ

Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే రేసు గుర్రాలను ప్రకటించి పొలిటికల్‌ హీట్‌ను పెంచింది కాంగ్రెస్‌. 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 12 స్థానాలు ఎస్సీలకు, రెండు ఎస్టీ, మూడు మైనార్టీలకు కేటాయించారు. వెలమలకు ఏడు, రెడ్డి సామాజికవర్గానికి 18, బీసీలకు 12, బ్రహ్మణకమ్యూనిటీకి రెండు సీట్లు కేటాయించింది కాంగ్రెస్‌ అధిష్టానం.


టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కొండగల్‌ నుంచే పోటీ చేయనుండగా.. సీతక్క ములుగు నుంచి రణరంగంలో దిగనున్నారు. ఇక ఉత్తమ్‌, మైనంపల్లి ఫ్యామిలీకి ఏఐసీసీ రెండేసి టికెట్లు కేటాయించింది. దీంతో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్‌, కోదాడ నుంచి పద్మావతి, మెదక్‌ నుంచి మైనంపల్లి రోహిత్‌రావు, మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు పోటీ చేయనున్నారు. తనతోపాటు తన కొడుక్కి టికెట్‌ ఆశిస్తూ బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చిన మైనంపల్లి కోరికను తీర్చింది కాంగ్రెస్‌. రోహిత్‌కు మెదక్‌ సీటు కేటాయించింది. అలాగే ఇతర పార్టీల నుంచి తమ గూటికి చేరిన మొత్తం 11 మందికి టికెట్లు కేటాయించింది ఏఐసీసీ.

బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గడ్డం వినోద్‌, మంచిర్యాల నుంచి ప్రేమ్‌సాగర్‌, నిర్మల్‌ నుంచి శ్రీహరిరావు, బోధన్ నుంచి సుదర్శన్‌రెడ్డి, బాల్కొండ నుంచి సునీల్‌కుమార్‌, జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డిలు ప్రజాక్షేత్రంలో తమ బలాన్ని నిరూపించుకోనున్నారు. అదేవిధంగా ధర్మపురి నుంచి లక్ష్మణ్‌కుమార్‌, రామగుండం నుంచి రాజ్‌ఠాకూర్‌, మంథని నుంచి శ్రీధర్‌బాబు, పెద్దపల్లి నుంచి విజయరమణారావు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్‌, మానకొండూరు నుంచి సత్యనారాయణ, అందోల్‌ నుంచి దామోదర రాజనర్సింహాలు పోటీ చేయనున్నారు. జహీరాబాద్‌ నుంచి ఏ చంద్రశేఖర్, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, గజ్వేల్‌ నుంచి నర్సారెడ్డి, మేడ్చల్‌ నుంచి వజ్రేష్‌ యాదవ్‌లు ఎన్నికల బరిలో దిగనున్నారు.


ఇక ఇదే లిస్టులో మరికొందరి రేసు గుర్రాలను ప్రకటించింది. కుత్బుల్లాపూర్‌ నుంచి కొలను హన్మంతరెడ్డి, ఉప్పల్‌ నుంచి పరమేశ్వర్‌రెడ్డి, చేవేళ్ల నుంచి భీం భరత్‌, పరిగి నుంచి రామ్మోహన్‌రెడ్డి, వికారాబాద్‌ నుంచి గడ్డం ప్రసాద్‌కుమార్‌ పేర్లను ప్రకటించింది. అలాగే ముషీరాబాద్‌ నుంచి అంజనీకుమార్‌ యాదవ్‌, మలక్‌పేట్‌ నుంచి షాకీ అక్బర్‌, సనత్‌నగర్‌ నుంచి కోట నీలిమ, నాంపల్లి నుంచి ఫిరోజ్‌ఖాన్‌, కార్వాన్‌ నుంచి మహ్మద్‌ అల్‌ అజారి, గోషామహల్‌ నుంచి సునీతను ఎన్నికల బరిలో దించింది. అదే విధంగా చాంద్రాయణగుట్ట నుంచి నగేష్, యాకత్‌పుర నుంచి రవిరాజు, బహుదురపుర నుంచి రాజేశ్ కుమార్, సికింద్రాబాద్‌ నుంచి సంతోష్‌కుమార్‌, గద్వాల్‌ నుంచి సరిత, ఆలంపూర్‌ నుంచి సంపత్‌కుమార్ ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌ నుంచి కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, అచ్చంపేట నుంచి వంశీకృష్ణ, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీ చేయనున్నారు. షాద్‌నగర్‌ నుంచి శంకరయ్య, కొల్లాపూర్‌ నుంచి జూపల్లి, నాగార్జునసాగర్‌ నుంచి జయవీర్‌ ఎన్నికల బరిలో దిగనున్నారు.

నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నకిరేకల్‌ నుంచి వేముల వీరేశం, ఆలేరు నుంచి బీర్ల అయిలయ్య, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి ఇందిర, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ, మధిర నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్య ప్రజాక్షేత్ర రణరంగంలో పోటీ చేయనున్నారు. ఇక సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే 55 మంది అభ్యర్థుల్లో 15 మంది రెడ్డి వర్గానికి, 12 స్థానాల్లో ఎస్సీ, 2 స్థానాల్లో ఎస్సీ వర్గానికి సీట్లను కేటాయించింది కాంగ్రెస్‌ పార్టీ.

మరి కొద్ది రోజుల్లోనే రెండో జాబితాను కూడా విడుదల చేయనుంది హస్తం పార్టీ. రోపక్క సీపీఐతో పొత్తు ఖరారు కావడంతో.. సీపీఎంతో చర్చలు కొనసాగిస్తోంది. పొత్తులో భాగంగా ఇప్పటికే సీపీఐకి రెండు స్థానాలను త్యాగం చేసింది. చెన్నూరు, కొత్తగూడెం సీట్లను సీపీఐకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక సీపీఎంతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉండటంతో.. ఏయే స్థానాల్లో కామ్రేడ్లు బరిలో దిగుతారన్న ఆసక్తి నెలకొంది.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×