EPAPER
Kirrak Couples Episode 1

Leo: చరణ్ లియోలో భాగం కాదు.. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన క్లారిటీ.

Leo: చరణ్ లియోలో భాగం కాదు.. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన క్లారిటీ.

Leo: తమిళ్ సూపర్ స్టార్ విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య దసరాకు రిలీజ్ కాబోతున్న చిత్రం లియో. విడుదలకు ముందే ఈ చిత్రంపై హైప్ విపరీతంగా క్రియేట్ చేస్తున్నారు. విజయ్ ఇంతకుముందు నటించిన వారసుడు తెలుగు మూవీ పెద్దగా క్లిక్ కాలేదు. ఎలాగైనా లియో టాలీవుడ్ లో మంచి బిజినెస్ చేయాలి అనే ఉద్దేశమో లేక ఎవరైనా కావాలని పుట్టించిన పుకారో తెలియదు కానీ గత కొద్దికాలంగా లియో కి సంబంధించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది.


మెగా హీరో రామ్ చరణ్ లియోలో ఉన్నాడు అనేదే ఆ రూమర్. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు అదే నమ్ముతూ వచ్చారు. పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి టాలీవుడ్ లో ఈ మూవీకి భలే కలిసి వస్తుంది అని కొందరు తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే ఇంతకీ ఈ సినిమాలో చరణ్ ఉన్నాడా లేడా అనే విషయంపై చిత్ర బృందం కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో లాస్ట్ లో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తాడు కదా. అదేనండి లాస్ట్ వచ్చే గ్యాంగ్స్టర్ లాగా కనిపిస్తాడు. ఇంచుమించు అదే మాదిరిగా రామ్ చరణ్ తో లియోలో లోకేష్ ఒక చిన్న పాత్రను చేయించాడు అంటూ సోషల్ మీడియా అంతా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దాంతో మెగా ఫాన్స్ అందరు ఈ మూవీలో రామ్ చరణ్ ఉన్నాడనే ఫిక్స్ అయిపోయారు.


అయితే అసలు విషయం ఏమిటంటే ఈ మూవీకి రాంచరణ్ కి ఎటువంటి సంబంధం లేదు.. అసలు చరణ్ పేరు కూడా ఈ మూవీలో వినిపించదు. ఈ విషయంపై ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి క్లారిటీ కూడా వచ్చింది. రామ్ చరణ్ లియో మూవీలో లేడు అని.. కొందరు కావాలని అలా ప్రచారం చేస్తున్నారు అని అర్థమయిపోయింది. చరణ్ పుణ్యమా అని లియో మూవీకి టాలీవుడ్ లో కాస్త మంచిగా బజ్ క్రియేట్ అవుతుంది అనుకున్నారో ఏమో లియో మూవీ టీం మాత్రం సైలెంట్ గా ఉన్నారు.

ఆ విషయం పక్కన పెడితే లియో ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ చిత్రంపై పలు రకాల విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. చాలావరకు సన్నివేశాలు విక్రమ్ సినిమాతో పోల్చి అలాగే ఉన్నాయి అంటూ మిమర్స్ మిమ్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క 9 గంటలకు ముందు షోలు వేయడానికి వీలు లేదు అంటూ స్టాలిన్ గవర్నమెంట్ మరొక షాక్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత నాలుగు షోస్ కి బదులు ఐదు షోస్ కి పర్మిషన్ ఇవ్వడంతో కాస్త లియో డిస్ట్రిబ్యూటర్లు కాస్త కుదుటపడ్డారు. మొత్తానికి రేపు అక్టోబర్ 19వ తారీఖున దసరా సందర్భంగా విడుదలయ్యే ఈ చిత్రం రవితేజ టైగర్ నాగేశ్వరరావు, బాలయ్య భగవంత్ కేసరితో ఢీ కొట్టాలి.. మరి అప్పుడు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related News

Tirupati Laddu Controversy: 300 ఏళ్ల చరిత్రకి మరకలు పడ్డాయా.. తిరుపతి లడ్డూ గురించి ఎవరికీ తెలియని నిజాలు

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

Big Stories

×