EPAPER

Psyche Mission : సైకీ మిషన్ షురూ.. ఆ రహస్యాలు తెలుసుకోవడమే లక్ష్యం..

Psyche Mission :  సైకీ మిషన్ షురూ.. ఆ రహస్యాలు తెలుసుకోవడమే లక్ష్యం..

Psyche Mission: లోహ ప్రపంచపు నిగూఢ రహస్యాలను ఛేదించడమే లక్ష్యంగా సైకీ స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి 16 సైకీ మిషన్‌ను నాసా చేపట్టింది. 3.6 బిలియన్ కిలోమీటర్ల దూరంలో అంగారక-గురుగ్రహాల మధ్య ఉన్న సైకీ గ్రహశకలాన్ని చేరుకుంటుందీ స్పేస్ క్రాఫ్ట్.


పూర్తిగా లోహ ఉపరితలంతో ఉన్న సరికొత్త ప్రపంచాన్ని అన్వేషించే దిశగా ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి అని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు తెలిపారు. వాస్తవానికి సైకీ మిషన్‌ను 2022 అక్టోబర్‌లోనే చేపట్టాల్సి ఉండగా.. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ మిషన్ కోసం స్పేస్ ఎక్స్ భారీ రాకెట్లలో ఒకటైన ఫాల్కన్ హెవీని వినియోగించారు.

సైకీ వ్యోమనౌక సుదీర్ఘ రోదసి యానానికి తొలిదశలో చోదకశక్తిని అందిస్తుందీ రాకెట్. ఫాల్కన్ హెవీ సైడ్ బూస్టర్లు విడివడి తిరిగి భూమికి చేరతాయి. వీటిని భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు పునర్వినియోగించే వీలుంది. కొత్తగా చేపట్టిన సోలార్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టం వల్ల సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఐదు రెట్ల వేగం‌తో సైకీ స్పేస్ క్రాఫ్ట్ పయనిస్తుంటుంది.


జూలై 2029 నాటికి గ్రహశకలాన్ని చేరుతుంది. ఆస్టరాయిడ్‌ని గుర్తించిన వెంటనే ఫొటోలను ఎప్పటికప్పుడు భూమిపైకి చేరవేస్తుంటుంది. దాని ఉపరితలానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Related News

RahulGandhi reacts: తిరుమల లడ్డూ వివాదం.. రాహుల్‌గాంధీ రియాక్ట్, నెయ్యిపై సీఎం సిద్దరామయ్య..

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Big Stories

×