EPAPER

Leo Movie : లియో మూవీ కి ఝలక్ ఇచ్చిన స్టాలిన్ ప్రభుత్వం

Leo Movie : లియో మూవీ కి ఝలక్ ఇచ్చిన స్టాలిన్ ప్రభుత్వం
Leo Movie

Leo Movie : తమిళ్ స్టార్ హీరో విజయ్ భారీ అంచనాల మధ్య వస్తున్న చిత్రం లియో. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ మూవీ కలెక్షన్స్ చిత్రంపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి స్టార్ట్ ఇచ్చిన జలక్ మూవీ కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది అనిపిస్తుంది. లియో బెనిఫిట్ షో పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. ఈ నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫాన్స్ ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది.


దసరా పండుగ సందర్భంగా 19వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న లియో చిత్రం ప్రస్తుతం సరికొత్త సవాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తమిళ్ నాట తళపతి విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న సరే మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మినిమం ఓ రేంజ్ లో వసూలు అవుతాయి. అయితే లియో విషయంలో మాత్రం ఇది జరిగేలా కనిపించడం లేదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్రెండ్ ప్రకారం స్టార్ హీరోని సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చేది బెనిఫిట్ షోస్ ద్వారానే. బెనిఫిట్ షోలో వచ్చే కలెక్షన్స్ ని బట్టి ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా ఆధారపడి ఉండడం మనం చూస్తున్నాం. అందుకే నిర్మాతలతో పాటు ఫాన్స్ కూడా ఈ బెనిఫిట్ షోపై ఎక్కువగా తమ ఫోకస్ పెడతారు. కానీ ప్రభుత్వం ఇటువంటి బెనిఫిట్ షోస్ కారణంగా సాధారణ జనాలు ఇబ్బందికి గురి అవుతున్నారు అనే ఉద్దేశంతో సరికొత్తగా ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది.


ఏ హీరో సినిమా అయినా సరే.. బెనిఫిట్ షో కి అనుమతి ఇచ్చేది లేదు అంటూ స్టాలిన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాదు ఉదయం 4 కే కాకుండ 5, 6గంటలకి వేసే షోస్ ని పూర్తిగా నిరాకరించింది. ఉదయం 9 గంటలు దాటిన తర్వాతే మామూలు సినిమాలకు ఎలాగైతే ఉంటుందో అలాగే థియేటర్లో ఆట మొదలవుతుంది అని ప్రభుత్వం సరికొత్త జీవో ను విడుదల చేసింది. అది కూడా పండగ సీజన్.. పైగా వచ్చేది విజయ్ సినిమా.. మంచిగా కలెక్షన్స్ వస్తాయి కదా అని ఆశించే సమయంలో ఇలా జరగడం కాస్త నిరాశ పరుస్తోంది.

ఈ పండుగ సీజన్ ని నమ్ముకుని భారీ మార్కెట్ ను ఎక్స్పెక్ట్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా ఈ నిర్ణయం కాస్త ఇబ్బందిగానే ఉంది. లియో బెనిఫిట్ షోపై ఎన్నో ఆశలు అంచనాలు పెంచుకున్న ఈ నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. బెనిఫిట్ షోలను నిరాకరిస్తూ లియో సినిమాకి కేవలం రోజుకి ఐదు షోల వరకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. మామూలుగా అయితే నాలుగు షోలకు మాత్రమే పరిమితి ఉంటుంది కానీ లియో సినిమాకి ఐదు షోలు పరమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఊహించుకున్న లియో మార్కెట్ విలువ పడిపోతుందేమో వేచి చూడాలి.

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×