EPAPER

KCR Movie : రాంగోపాల్ వర్మ వ్యూహంకు ధీటుగా రాబోతున్న కేసీఆర్ ….

KCR Movie : రాంగోపాల్ వర్మ వ్యూహంకు ధీటుగా రాబోతున్న కేసీఆర్ ….
KCR Movie update

KCR Movie update(Cinema News in Telugu) :

ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ సారి రాజకీయ పార్టీలకు మద్దతుగా కొందరు ఔత్సహికులు అయిన డైరెక్టర్లు తమ వంతు మద్దతు ఇవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న రామ్ గోపాల్ వర్మ తన రెండు చిత్రాలు వ్యూహం, శపథం మూవీస్ ను ఆంధ్రాలో ఎన్నికలకు ముందుగా అంటే నవంబర్లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.


అయితే తెలంగాణకు ఇటువంటి సినిమా ఏది లేదు అనుకుంటున్నా సమయంలో ఇప్పుడు, జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన కమీడియన్ రాకింగ్ రాకేష్ తెలంగాణ నేపథ్యంలో కేసీఆర్ అనే సరికొత్త మూవీతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ తెలంగాణ రాజకీయాలను ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. పైగా దీని రిలీజ్ చేసింది తెలంగాణ మంత్రి సి మల్లారెడ్డి.

జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ ఇప్పుడు హీరోగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రాకేష్ హీరోగా తెలంగాణ బంజారా బ్యాక్ డ్రాప్ తెరకెక్కబోతున్న మూవీ కు కేసీఆర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లు క్ అండ్ టైటిల్ పోస్టర్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కట్ అవుట్ ముందు ఒక అబ్బాయి నిలుచుని తదేకంగా కేసీఆర్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో రైతులు ,బంజారా మహిళలు, గొర్రెలు, పొలాలు…కనిపిస్తుంటాయి.


అయితే బ్లాక్ కలర్ లో నీడలాగా కనిపిస్తున్న ఆ భారీ కటౌట్ కేసీఆర్ ది అన్న విషయం ఇంతవరకు డైరెక్ట్ గా మూవీ బృందం చెప్పలేదు. అలాగే పోస్టర్లో కూడా ఇంతవరకు అది కేసీఆర్ ఫోటో అన్నట్టు ఏమి రివిల్ చేయలేదు.కానీ లుక్, టైటిల్ చూస్తే అది కచ్చితంగా కేసీఆర్ దే అయి ఉంటుంది అని అర్థమవుతుంది. ఇక టైటిల్ విషయానికి వస్తే కేశవ చంద్ర రమావత్.. షార్ట్ కట్ లో కేసీఆర్ అని పెట్టారు. మరి ఈ చిత్రానికి రాజకీయ సంబంధం ఉందా? లేక ఎలాగో వచ్చే సీజన్ రాజకీయాలది కాబట్టి ఓన్లీ హైప్ క్రియేట్ చేయడం కోసం అలా పెట్టారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

.

అయితే సీఎం కేసీఆర్ అడ్వైజర్స్ గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్, పెద్దింటి అశోక్ ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు అందించినట్లు ఓ టాక్ నడుస్తోంది. దీంతో ఈ మూవీ ఇండైరెక్ట్ గా పొలిటికల్ గా కేసీఆర్ ని హైలైట్ చేయడానికి వస్తోంది అన్న అనుమానం కలుగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణ కూతురు అనన్య హీరోయిన్ గా ఈ మూవీ ద్వారా తెలుగుతెరకు పరిచయం కానుంది. ఇంకా ఈ చిత్రంలో తనికెళ్ల భరణి ,కృష్ణ భగవాన్, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాజేష్ ఈ చిత్రంతో హీరో అవుతాడో లేదో చూడాలి.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×