EPAPER

Top Horror Movies: భయానికే భయం పుట్టించే.. టాప్ హర్రర్ మూవీస్

Top Horror Movies: భయానికే భయం పుట్టించే.. టాప్ హర్రర్ మూవీస్

Top Horror Movies: హర్రర్ మూవీస్ అంటే మనలో చాలామందికి ఇష్టం. చూడడానికి కాస్త భయపడిన ,సినిమాలో హర్రర్ సీన్స్ వచ్చినప్పుడు అలా భయంతో వణుకుతూనే.. కళ్ళకి అడ్డం పెట్టుకున్న చేతి వేళ్ల సందులో నుంచి సగం కళ్ళు తెరిచి మూవీ ఎంజాయ్ చేస్తాం.హాంటెడ్ హౌస్, విలేజ్,ఫారెస్ట్ ఇలా చాలా బ్యాక్ డ్రాప్స్ తో హారర్ మూవీస్ వచ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్రం చూడడం మాట అటు ఉంచితే ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు తలుచుకున్నా భయం పుట్టిస్తాయి. మరి అలాంటి వణికించే హారర్ చిత్రాల్లో ది బెస్ట్ ఏవో ఓ లుకేద్దాం పదండి.


కాష్మోరా

1986 లో యెండమూరి వీరేంద్రనాథ్ రాసిన హారర్ నవల తులసి ఆధారంగా రాజేంద్ర ప్రసాద్, భాను ప్రియ,రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ కాష్మోరా మూవీ ఒంటరిగా చూడాలంటే ఎవరైనా భయపడాల్సిందే. అఘోరాలు చేసే తంత్ర మంత్ర ప్రయోగాలతో, భయంకరమైన సన్నివేశాలతో వణుకు పుట్టిస్తుంది కాష్మోరా.


దెయ్యం

కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కి బాగా అలవాటు పడ్డ ప్రేక్షకులని సడన్గా వచ్చి భయపెట్టిన చిత్రం దెయ్యం.రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో 1996 లో వచ్చిన ఈ మూవీ ఒక ఆసక్తికరమైన కథ, కథాంశం తో ఒకపక్క భయం పుట్టిస్తూనే మరోపక్క ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

రాత్రి

1992లో హిందీలో రాత్,తెలుగు లో రాత్రి అనే టైటిల్స్ తో వచ్చిన హై హారర్ మూవీ ఇది.ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికి 3 దశాబ్దాలు గడిచినప్పటికీ, చూసిన ప్రతిసారీ వెన్నులో వణుకు పుట్టించే మూవీ ఇది. ఈ మూవీ లో ముప్పు ఎక్కడ, ఎప్పుడు, ఎలా వస్తుందో అర్దం కాదు.

రక్ష

1980లో యెండమూరి వీరేంద్రనాథ్ రాసిన తులసి దళం అనే నవల లో నుంచి కొంత కాన్సెప్ట్ తీసుకుని 2008లో తెరకెక్కించిన ఈ రక్ష మూవీ అత్యంత భయానక చిత్రాలలో ఒకటి. హిందీలో తీసిన ఫూంక్‌కి రీమేక్ అనే చిత్రానికి ఇది రీమేక్.

అరుంధతి

అనుష్క సరికొత్త యాంగిల్ లో ఆవిష్కరించి లేడీస్ సూపర్ స్టార్ గా మార్చిన హారర్ మూవీ అరుంధతి. అందులో “వదల బొమ్మాళి డైలాగ్, జేజమ్మ సాంగ్, పశుపతి పాత్ర, అరుంధతి తెగువ ఏపటికి మర్చిపోలేము. హారర్ ఫాంటసి కాన్సెప్షన్ మిక్స్ చేసి, అప్పటివరకు టాలీవుడ్ లోనే రూపొందించినటువంటి సాంకేతిక పరమైనటువంటి విలువలను వాడి తెరకెక్కించిన మూవీ అరుంధతి. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు గోడ మీద దెయ్యం పాకుతూ వచ్చే సీన్ చూసినవారికి అప్పట్లో గుండెల్లో దడ పుట్టిందంటే అతిశయోక్తి కాదు.

అవును

హారర్ జోనర్ లో వినూతమైన కాన్సెప్ట్ తో స్క్రీన్ పై దయ్యం ఉందా లేదా అనే భ్రమ కలిగించే విధంగా వెరైటీగా తెరకెక్కించిన భయానకమైన చిత్రం అవును. ఇది నిజంగా ఎప్పటికీ టాలీవుడ్ లో ఒక మాస్టర్ పీస్ హారర్ మూవీ గా నిలిచిపోతుంది.

చంద్రముఖి

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార, ప్రభు, జ్యోతిక, వినీత్ ముఖ్యపాత్రలో వచ్చిన చిత్రం చంద్రముఖి. అప్పట్లో ఈ మూవీ అందరిని ఎంత భయపెట్టిందో కదా. ఇప్పటికీ ఈ చిత్రం లోని వారాయి పాట క్రేజ్ తగ్గలేదు. సినిమాలో చూపించే భారీ పాము.. అందరినీ భయపెట్టింది.

భాగమతి

అనుష్క మెయిన్ లీడ్ లో తెరకెక్కించిన ఈ చిత్రం భయపెడుతూనేప్రేక్షకులను కన్ఫ్యుస్ కూడా చేస్తుంది. ఒకపక్క సైన్స్ ,మ్యాజిక్ అంటూనే మరో పక్క బ్లాక్ మ్యాజిక్, దెయ్యాలు, భూతాలు అంటూ లాస్ట్ వరకు ఏది నిజం, ఏది అబద్దం అర్థం కాని విధంగా ఉంటుంది ఈ చిత్రం. మొత్తానికి ఇందులో దెయ్యం ఉందో లేదో తెలియదు కానీ అనుష్క దెయ్యం గా ప్రవర్తించిన తీరు చూసిన ప్రతిసారి గుండెల్లో భయం గొంతులోకి రావడం కన్ఫర్మ్.

కాంచన సిరీస్ (కాంచన, గంగ, కాంచన3)

కాంచన మొదట ఒక సినిమాగా మొదలైనా ,విపరీతమైన ప్రేక్షకాదరణ పొందడంతో మూడు సీక్వెల్స్ గా వచ్చాయి. కథలు వేరైనప్పటికీ కాన్సెప్ట్ మాత్రం ఒకటే.. చూసే వాళ్ళని భయపెట్టడం. అసలు దెయ్యం ఎలా వస్తుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? అన్న సస్పెన్స్ ఒకపక్క, భయం ఒకపక్క ఉండే మూవీస్ ఇవి.

ప్రేమ కథా చిత్రమ్

హారర్ లో కామెడీ ను అద్భుతంగా మిక్స్ చేసి ఒక ఎక్స్ట్రాడినరీ మూవీగా మనం ముందుకు తీసుకువస్తే అదే ప్రేమ కథ చిత్రమ్. ఈ మూవీ ఎంతగా నవ్విస్తుందో అంతగా వణికిస్తుంది.

జాంబిరెడ్డి

జాంబిస్ అనే కాన్సెప్ట్ ని తెలుగులో మొట్టమొదటిసారిగా స్ట్రైట్ గా తీసిన మూవీ జాంబీ రెడ్డి. ఈ మూవీలో హారర్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఒకపక్క భయపడుతూనే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న టెన్షన్ తో మూవీ చూస్తూనే ఉంటాం.

మసూద

రీసెంట్ గా చూసిన హారర్ మూవీస్ లో భయాన్ని పీక్స్ కి తీసుకెళ్లే చిత్రం మసూద. సినిమాలో ఒక్కొక్క సీన్ అవుతున్న కొద్ది మనలో భయం కూడా ఒక్కొక్క లెవెల్ పెరుగుతూ ఉంటుంది. మరి క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ థ్రిల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

విరూపాక్ష

సాయిధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో రీసెంట్ గా వచ్చిన హారర్ సస్పెన్స్ మూవీ విరూపాక్ష. అసలు మూవీ ఎండింగ్ వరకు విలన్ ఎవరు అన్న విషయం తెలియనివ్వకుండా ఒక పక్క సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ మరోపక్క వణుకు పుట్టిస్తుంది ఈ మూవీ స్టోరీ. మరీ ముఖ్యంగా వరస హత్యలు ఎలా జరుగుతాయో చూపించినప్పుడు చాలా భయం వేస్తుంది.

Related News

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Big Stories

×