EPAPER

God Movie Review : సైకో థ్రిల్లర్ మూవీ గాడ్.. ఎలా ఉందంటే..?

God Movie Review : సైకో థ్రిల్లర్ మూవీ గాడ్.. ఎలా ఉందంటే..?
God movie review

God movie telugu review(Movie Reviews in Telugu):

లేడీ సూపర్ స్టార్ నయనతార, జయం రవి కాంబోలో వచ్చిన సరికొత్త సైకో క్రైం థ్రిల్లర్ మూవీ ఈ రోజు విడుదలై ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వరుసగా సిటీ లో జరిగే హత్యల.. సైకో కిల్లర్ పోలీస్ ఆఫీసర్. ఇలా రొటీన్ స్టోరీ తో వెరైటీ స్క్రిప్ట్ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందామా.


స్టోరీ:

కోపం ,దూకుడు, అవేశం ఎక్కువగా ఉండే ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ అర్జున్ (జయం రవి). అతని సొంత మనిషిలా చూసుకునే అతని ఫ్రెండ్ ఆండ్రూ (నరైన్) ,అతని కుటుంబం. న్యాయం కోసం చట్టాన్ని కూడ పక్కన పెట్టే తెగింపు…నిందితులను పట్టుకునేందుకు ఏదైనా చేసే సాహసం ఉన్న అజయ్ లైఫ్ లోకి ఎంటర్ అవుతాడు ఒక సీరియల్ కిల్లర్. ఇక్కడ అక్కడ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది.


సిటీ లో చాల మంది మహిళలను కిడ్నాప్ చేసి దారుణంగా వేధించి.. అత్యంత కిరాతకంగా చంపుతుంటాడు ఒక సైకో కిల్లర్. అతని పట్టుకోవడానికి రంగంలోకి దిగిన అజయ్ అండ్ టీమ్ చేసే ప్రయత్నంలో అతని ఫ్రెండ్ ఆండ్రూ చనిపోతాడు. దాంతో విరక్తి చెందిన అజయ్ డిపార్ట్మెంట్ వదిలి వెళ్ళిపోతాడు. కానీ జైల్ నుంచి కిల్లర్ తప్పించుకోవడం, కిల్లర్స్ ఒకరు కాదు ..ఇద్దరు అని తెలియడం తో కొత్త ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది.

అయితే ఈ సారి బయటకు వచ్చిన కిల్లర్ అర్జున్ సన్నిహితులను టార్గెట్ చేస్తాడు. మళ్ళీ సిటీ లో వరుస హత్యలు జరగడం మొదలవుతాయి. ఇక సైకో కిల్లర్ బ్రాహ్మ దగ్గర నుంచి తన వారిని హీరో ఎలా తప్పిస్తాడు. లాస్ట్ కి కిల్లర్స్ ను ఎలా పట్టుకుంటాడో తెలియాలంటే.. గాడ్ మూవీ చూసేయండి.

విశ్లేషణ:

ఇప్పటికే సైకో కిల్లర్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. జనరల్ గా ఇలాంటి సినిమాల్లో హత్య జరిగే విధానం ..సైకో కిల్లర్ వేసే స్కెచెస్.. పోలీసులు వాళ్ళని పట్టుకోడానికి వాడే మైండ్ గేమ్.. మధ్యలో సాగే ఎమోషనల్ సీక్వెన్స్.. మూవీ పై ఆసక్తిని పెంచుతాయి. హత్య చేసే విధానం ,చుట్టూ చూపించిన సన్నివేశాలు ఈ మూవీలో చాలా బాగున్నాయి కానీ మైండ్ గేమ్ వచ్చేసరికి లాజిక్ ఎక్కడ కనిపించదు.

ఇంటర్వెల్ అప్పటికి ఇద్దరు సైకో కిల్లర్ లో ఉన్నారు అని రవి అవడం భూమిపై ఇంట్రెస్ట్ ని పెంచుతుంది. ఫస్ట్ ఆఫ్ కాస్త సాగదీత గా ఉన్నా సెకండ్ హాఫ్ పర్వాలేదు. జైల్లో సైకో కిల్లర్ మరొక సైకోని తయారు చేసే విషయం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే హీరో ప్రతి విషయాన్ని చాలా సులభంగా కనిపెట్టడం ,కిల్లర్ తన గతం గురించి తానే చెప్పడం..కాస్త అసహజంగా ఉంటాయి. హీరో ఇంట్రడక్షన్ , సైకో సీక్వెన్స్ అంత పది నిమిషాల్లో చూపించి ఇక ఆ తర్వాత ఇంటర్వెల్ సీన్ వరకు బాగా డ్రాగ్ చేశారు.స్క్రిప్ట్ పై ఇంకా కాస్త వర్క్ అవుట్ చేసి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్:

జయం రవి యాక్టింగ్ మూవీ కి మాంచి ప్లస్

ఇక నయనతార తన పరిధి వరకు తను అద్భుతంగా నటించింది.

బ్రేక్ కి ముందు ట్విస్ట్ స్టోరీ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.

సెకండ్ హాఫ్ స్క్రిప్ట్

మైనస్ పాయింట్స్:

స్టోరీ మరి సాగదీతగా ఉంటుంది.

నయనతార సినిమా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ,ఎండింగ్ కి మాత్రమే పరిమితమైంది.

కొన్ని సన్నివేశాలు ఎటువంటి లాజిక్ లేకుండా ఉంటాయి.

అక్కడక్కడ స్క్రిప్ట్ కాస్త గందరగోళంగా ఉంది.

సినిమా: గాడ్

నటీనటులు: జయం రవి, నయనతార, నరైన్, ఆశిష్ విద్యార్థి, వినోద్ కిషన్,రాహుల్ బోస్, విజయలక్ష్మి 

కొరియోగ్రఫీ: హరి కె. వేదాంతం

 మ్యూజిక్: యువన్ శంకర్ రాజా

డైరెక్టర్: ఐ. అహ్మద్

నిర్మాతలు: సుధన్ సుందరం, జి.జయరాం, సి. హెచ్. సతీష్ కుమార్

రిలీజ్ డేట్: 13-10-2023

రేటింగ్:2 /5 

చివరి మాట:

కిల్లర్, థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మంచి ఛాయిస్.

Related News

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Big Stories

×