EPAPER

AUS VS SA Match : సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిన ఆస్ట్రేలియా

AUS VS SA Match : సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిన ఆస్ట్రేలియా
South Africa vs Australia Match

South Africa vs Australia match(World cup today match):

వన్డే ప్రపంచకప్ లో భాగంగా  లక్నోలో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా తగిన మూల్యం చెల్లించుకుంది.  50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా… భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది.


మొదట సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు క్వింటన్ డికాక్, డెంబా బవుమా ఇద్దరూ 20 ఓవర్ల వరకు వికెట్ పడకుండా ఆడారు. జట్టు స్కోరు 108 వద్ద బవుమా (35) తొలి వికెట్ రూపంలో వెనుతిరిగాడు. తర్వాత వచ్చిన డసెన్ తో కలిసి డికాక్ ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. స్కోరుని పరుగులెత్తించాడు. ఈ దశలో 158 పరుగుల వద్ద డసెస్ (26) రూపంలో ఆస్ట్రేలియాకు మరో వికెట్ దొరికింది. అయితే ఈ ప్రపంచకప్ తొలిమ్యాచ్ లో సెంచరీ చేసిన డికాక్,  ఆస్ట్రేలియాపై మరో సెంచరీ (109) తో కదం తొక్కాడు. జట్టు స్కోరు 197వద్ద తను వెనుదిరిగాడు.

తర్వాత అందరూ స్ట్రోక్ ప్లేయర్లు ఉండటంతో సౌత్ ఆఫ్రికా 350 స్కోర్ చేస్తుందనుకున్నారు. కానీ ఎలాగోలా ఆస్ట్రేలియా బౌలర్లు నిరోధించగలిగారు. తర్వాత మార్ క్రమ్ (56), హెన్రిచ్ క్లసెస్ (29) చేసి పెవెలియన్ కి చేరారు. ముఖ్యంగా స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్ మ్యాచ్ కే హైలెట్ గా మారింది. ఎందుకంటే ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఇదే మొదటి నుంచి ఇలా వేస్తే ఎంత బాగుండేదని అభిమానులు అనుకున్నారు.


మొత్తానికి అలా 311 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా ప్రయాణం అనుకున్నంత సజావుగా సాగలేదు.  27 రన్స్ కి మొదటి వికెట్ పడింది. అదే స్కోరు ఉండగానే మరో వికెట్ పడింది. బండి 50 రన్స్ దగ్గరికి వచ్చేసరికి కీలకమైన స్మిత్ వికెట్టు పడింది. అప్పటికి 10 ఓవర్లకి మూడు వికెట్లు 50 రన్స్. అక్కడైనా ఆగుతుందనుకుంటే మరో ఆరు పరుగులు జోడించారో లేదో 56 దగ్గర మరో వికెట్లు పడింది. ఇంక 65 దగ్గర 5వ వికెట్టు, 70 పరుగుల దగ్గర ఆరో వికెట్టు టపటపా పడ్డాయి. కాసేపు స్టార్క్, లబూషాగ్నే వికెట్ల పతనాన్ని ఆపారు. కానీ అదెంతో సేపు ఉండలేదు. 139 పరుగుల వద్ద స్టార్క్ వెనుతిరిగాడు.  ఆ సమయంలో లబుషాగ్నే జట్టుని ఆదుకున్నట్టే కనిపించాడు. కానీ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు  వద్ద 8 వ వికెట్టుగా వెనుతిరిగాడు.

అప్పటికి జట్టు స్కోరు 143. తర్వాత కెప్టెన్ కమిన్స్ వచ్చి జట్టుకి గౌరవప్రదమైన స్కోరు అయినా అందించాలని యత్నించాడు. ఆ టైమ్ లో హజెల్ వుడ్ (2) వెనుతిరిగాడు. చివరికి 9 వికెట్టుగా కెప్టెన్ 21 పరుగులు చేసి నిష్క్రమించాడు. అలా 177 పరుగుల వద్ద ఆస్ట్రేలియా కథ ముగిసింది. చివరికి 134 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది.

ముఖ్యంగా రబాడా ఆస్ట్రేలియా వెన్ను విరిచాడు. వరుసగా వికెట్లు పడగొట్టి మళ్లీ ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, షమ్సీ చెరో రెండేసి వికెట్లు క్రమం తప్పకుండా తీశారు. దీంతో ఏ దశలోనూ ఆస్ట్రేలియా కోలుకోలేక పోయింది.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×