EPAPER

World Sight Day 2023 : కంటి చూపు గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

World Sight Day 2023 : కంటి చూపు గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

World Sight Day 2023 : సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు పెద్దలు. నయనాలు మనకు దేవుడిచ్చిన వరం. మనం ఏ పని చేయాలన్నా చూపు చాలా ముఖ్యం. అలాగే కళ్లు మన ముఖానికి అందమైన ఆభరణాలు. కళ్లు ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటాయో.. మనం అంతే అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాం. మరి మీలో ఎంత మంది కళ్లను, వాటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు ? ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ? నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్ సంస్థ (IAPB) ప్రతి ఏటా అక్టోబర్ లో వచ్చే రెండవ గురువారం నాడు ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 12న ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1975లో కంటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ సంస్థను స్థాపించారు. సంస్థ నిర్వాహకులు 2000 సంవత్సరం నుంచి ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని నిర్వహిస్తూ..కంటిచూపు ఉండటం మనిషికి ఎంత అవసరమో తెలియజేస్తున్నామని IAPB చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ హాలెండ్ పేర్కొన్నారు.


కంటి సంరక్షణపై మనమంతా దృష్టి సారించాలి. కంటి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. కంటి చూపు ఉన్నవారికంటే లేని వారికే దాని విలువ బాగా తెలుస్తుంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకూ.. ఏం చూడాలన్నా, ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా మనకు కంటి చూపు ఉండటం చాలా ముఖ్యం. శరీరంలో ప్రతి అవయవానికి ఎంతో కొంత పని నుంచి విరామం ఉంటుంది కానీ.. కళ్లు మాత్రం విరామం లేకుండా, అలుపన్నది లేకుండా పనిచేస్తూనే ఉండాలి.

కంటి చూపు బాగుండాలన్నా, కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా.. కొన్ని ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. విటమిన్ A ఉండే ఆహారాలతో పాటు.. బీటారే రొటీన్ అధికంగా లభించే క్యారెట్ ను ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవాలి. అలాగే.. గుడ్లు, బీన్స్, నారింజ, బొప్పాయి పండ్లతో పాటు బాదంపప్పును కూడా తినాలి. కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే చేపలను ఆహారంగా తినాలి. వాల్ నట్స్, బాదం, పిస్తా వంటి నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లు, విటమిన్ ఈ కూడా ఉంటాయి. బచ్చలి, తోటకూర వంటి ఆకుకూరల్లోనూ కంటి ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్లు ఉంటాయి.


ఇటీవల కాలంలో పనిఒత్తిడి తగ్గుతుందన్న పేరుతో.. చాలా మంది సిగరెట్లు అధికంగా కాల్చుతున్నారు. ఇందుకు అమ్మాయిలేమీ అతీతం కాదు. ఎక్కువగా స్మోకింగ్ చేసేవారిలో కంటి శుక్లాలు, కంటి నరాలు దెబ్బతిని దృష్టి సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే పొగతాగే అలవాటును క్రమంగా తగ్గించుకోవడం మంచిది. బయటకు వెళ్లినపుడు అల్ట్రావైలెట్ కిరణాలు కంటిని గాయపరచకుండా సన్ గ్లాస్ లను ఉపయోగించాలి. ఎక్కువసమయం కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారు యాంటీ గ్లేర్ గ్లాసెస్ ను ధరిస్తే.. వాటి ఎఫెక్ట్ కళ్లపై పడకుండా ఉంటుంది. ప్రతిరోజూ 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూస్తూ ఉంటే.. కంటికి వ్యాయామం లభించినట్లు కూడా ఉంటుంది.

మరణానంతరం కళ్లను దానం చేయడంపై చాలామందికి చాలా అపోహలున్నాయి. ఈ జన్మలో కళ్లను దానం చేస్తే మరుజన్మలో అంధులుగా పుడతారన్న అపనమ్మకంతో చాలా మంది కంటిదానానికి ముందుకు రావడం లేదు. మరణానంతరం కళ్లను దానం చేస్తే.. ఎంతోమంది జీవితాల్లో వెలుగునింపినవారవుతారు. కనీసం ఒక్కరికైనా కంటి చూపు వచ్చి ఈ లోకాన్ని చూస్తారు. వారికి మరో కొత్తజీవితం లభిస్తుంది.

Related News

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Big Stories

×