EPAPER

Jagadeka Veerudu Athiloka Sundari :‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రం కాపీరైట్స్ పై వైజయంతి మూవీస్ వార్నింగ్ ఇచ్చింది అతనికేనా ..?

Jagadeka Veerudu Athiloka Sundari :‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రం కాపీరైట్స్ పై వైజయంతి మూవీస్ వార్నింగ్ ఇచ్చింది అతనికేనా ..?

Jagadeka Veerudu Athiloka Sundari : ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కొత్త కథలకు డిమాండ్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే అగ్ర హీరో నటించినా సరే సినిమా స్టోరీ ఓల్డ్ అయితే ప్రేక్షకులు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అలాగే వినూత్నంగా ఉండే కొత్త కథలు చిన్న సినిమాలు అయినా సరే పనిగట్టుకొని హిట్ చేస్తున్నారు. దీంతో అగ్ర హీరోలు కూడా తమ జోరు తగ్గించి కొత్త కథల కోసం అన్వేషణ మొదలు పెడుతున్నారు.


అయితే కొత్త కథ అనేది ఏదో ఒకటైతే వస్తుంది కానీ ఏటా టాలీవుడ్ లో పదుల సంఖ్యలో విడుదలయ్యే అగ్ర హీరోల సినిమాలకు కొత్త కొత్త కథలు కావాలంటే కుదరదు కదా. అందుకే ఎంత కొత్తగా ఆలోచించినా…పాత కథను కాస్త బేస్ గా తీసుకొని కొత్తగా డెవలప్ చేస్తారు. అయితే కొందరు దర్శకులు మాత్రం కథను తిమ్మినిబమ్మిని చేసి కొత్తది అని కన్విన్స్ చేస్తారు. అయితే మరి కొందరు కన్విన్స్ చేయలేక దొరికిపోతారు.

ఇక మరికొందరైతే చేసేది లేక ఒక సినిమా హిట్ అయితే చాలు దాన్ని సీక్వెల్ లేక ప్రీక్వెల్ అంటూ ఒక రెండు మూడు సినిమాలు తీస్తారు. అయితే ప్రస్తుతం బాగా అబ్జర్వ్ చేస్తే టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా పాత సినిమాలకు కొత్త హంగులు అద్ది రీ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన షారుక్ చిత్రం జవాన్…తమిళ్ ,తెలుగు సినిమాలు అన్నీ ఒక మిక్సీలో వేసి బయటకు వచ్చిన రిజల్ట్ కు కాస్త బాలీవుడ్ మసాలా యాడ్ చేసినా ….ఈ చిత్రం ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు.


చాలావరకు ఒకప్పుడు హిట్ అయిన మూవీ నుంచి కాన్సెప్ట్ లైన్ వరకు తీసుకొని…ఇక ఆ తర్వాత తమకు నచ్చిన విధంగా దాన్ని మార్చుకొని హిట్ అందుకున్న డైరెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. సరే అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడు దీని గురించి ఇంతగా ఎందుకు డిస్కషన్ అనుకుంటున్నారా…? అదిగో అక్కడికే… అసలు విషయానికి వస్తున్నా…నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బాక్స్ ఆఫీస్ సంచలనం బింబిసార మూవీ తో డైరెక్టర్ గా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ వశిష్ఠ.

మొదటిసారి పిరియాడిక్ డ్రామా ద్వారా సక్సెస్ అందుకోవడం ఒక ఎత్తైతే…ఏకంగా మెగాస్టార్ కంట్లో పడడం మరింత గొప్ప అని చెప్పాలి. దాంతో అతని రెండవ సినిమా మెగాస్టార్ చిరంజీవి తో ఫిక్స్ అయింది. కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక సరియైన హిట్ లేక కుస్తీ పడుతున్న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య రూపంలో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఇదే జోరు కంటిన్యూ చేస్తూ మెగాస్టార్ తీయబోతున్న నెక్స్ట్ చిత్రం మెగా 157. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న వశిష్ఠ పంచభూతాలను కలిపి ఒక సెన్సేషనల్ స్టోరీ ని క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ నేపథ్యంలో అతడికి జగదేకవీరుడు అతిలోకసుందరి నిర్మాతల దగ్గర నుంచి ముందుగానే ఓ రేంజ్ ఇండైరెక్ట్ వార్నింగ్ వచ్చిందని ఇండస్ట్రీ టాక్. 1990లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కించబడిన జగదేకవీరుడు అతిలోకసుందరికి సీక్వెల్ కానీ….ప్రీక్వెల్ కానీ.. ఆ చిత్రం నుంచి ఎటువంటి సన్నివేశాలను రిపీట్ చేయడం కానీ కుదరదని…ఒకవేళ అలా చేస్తే లీగల్ చర్యలు తప్పవు అని ఆ మూవీ నిర్మాతలు హెచ్చరించడం జరిగింది. ఇంత సడన్ గా వైజయంతి మూవీస్ ఇటువంటి పబ్లిక్ నోటీస్ ఇవ్వడానికి వెనుక కారణం ఇండైరెక్టుగా మెగా 157 అని ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్. అప్పట్లో ఈ చిత్రంలో హీరోగా నటించిన చిరంజీవి కావడంతో.. ఈ విషయంపై మరింత జోరుగా డిస్కషన్ జరుగుతోంది. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయంపై స్పష్టత లేదు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×