EPAPER
Kirrak Couples Episode 1

Yuvraj Singh Statement : కేఎల్ రాహుల్ ఉండగా అతడు ఎందుకు దండగ…వైరల్ అవుతున్న యువరాజ్ స్టేట్మెంట్….

Yuvraj Singh Statement : కేఎల్ రాహుల్ ఉండగా అతడు ఎందుకు దండగ…వైరల్ అవుతున్న యువరాజ్ స్టేట్మెంట్….

Yuvraj Singh Statement : భారత్ ఆతిథ్యంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో మొన్న భారత్ ఆస్ట్రేలియా తో తన తొలి మ్యాచ్ ఆడడం జరిగింది. భారీ అంచనాల మధ్య మొదలైన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ సమయంలో భారత్ టాప్ ఆర్డర్ తబడడం పలు రకాల విమర్శలకు దారితీస్తోంది. మరీ ముఖ్యంగా రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడం పై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా టార్గెట్ అవుతున్న వ్యక్తి శ్రేయాస్ అయ్యర్.


భారత్ యువ సంచలనం.. సూపర్ ఓపెనర్ గిల్ అస్వస్థత కారణంగా వచ్చిన అరుదైన అవకాశాన్ని ఇషాన్ ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. కనీసం ఖాతా కూడా తెరవకుండా గోల్డెన్ డక్ గా వెనుతిరిగిన ఈ ఓపెనర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పటి క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ గురించి యువరాజ్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు.

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ…ఈ ఇద్దరు ఘోరంగా విఫలమై డక్ అవుట్ గా వెనుతిరిగారు.. అలాంటి సమయంలో ఫీల్డ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్…బాధ్యతారహితంగా ఆడడమే కాకుండా ఒక చెత్త షాట్ కొట్టడానికి ప్రయత్నించి డక్ అవుట్ అయ్యాడు.


ఈ నేపథ్యంలో జట్టులో ఉండాల్సిన నాలుగవ ప్లేయర్ గురించి యువరాజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీమ్ లో నాలుగవ మెంబర్ గా పంపినప్పటికీ శ్రేయాస్ అయ్యర్‌ బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. రెండు వికెట్లు వరుసగా పడిన సమయంలో ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ఎంతో ఆచితూచి ఆడాల్సి ఉంటుంది.

పైగా తాను వచ్చింది ఫోర్త్ ప్లేస్ అంటే అది స్కోర్ పెరగడానికే  ఎంతో ముఖ్యమైన ప్లేస్. అలాంటి స్థానంలో వచ్చిన ఆటగాడు ఒత్తిడిని ఎదుర్కొని స్కోర్ బోర్డ్ పరిగెత్తించాలి కానీ…చెత్త షాట్లు ఆడి పెవిలియన్ వైపు పరుగులు పెట్టకూడదు. ఏదో అదృష్టం కొద్దీ కోహ్లీ క్యాచ్ మిస్ అయింది.. లేకపోతే మ్యాచ్ రిజల్ట్ వేరే విధంగా ఉండేదేమో. అందుకే యువరాజ్ ఫోర్త్ ప్లేస్ గురించి అంత ప్రామినెంట్గా చెప్పాడు.

అయ్యర్ ను నాలుగో స్థానంలో ఆడించాలి అని భారత్ జట్టు తీసుకున్న నిర్ణయంపై యువరాజ్ తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువరాజ్ తన ట్వీట్ లో “మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ ను నాలుగవ స్థానంలో పంపినప్పటికీ అతను ఘోరంగా విఫలమయ్యాడు. రెండు వరుస వికెట్లు పడిన నేపథ్యంలో జాగ్రత్తగా ఆడాల్సింది పోనిచ్చి మూడవ వికెట్ ని కూడా అందించాడు. నాలుగవ స్థానంలో బరిలోకి దిగే బ్యాట్స్మెన్ ఒత్తిడిని భరించాల్సి ఉంటుంది. అయినా కేఎల్ రాహుల్ లాంటి వ్యక్తి టీమ్ లో ఉండగా నాలుగో నెంబర్ లో శ్రేయాస్ అయ్యర్ ను ఎందుకు పంపుతున్నట్లు నాకు అర్థం కావడం లేదు. పాకిస్తాన్ పై 100 పరుగులు సునాయాసంగా చేసిన తర్వాత కూడా అతని నాలుగో స్థానానికి ఎందుకు ఎంచుకోలేదు.”అని ప్రశ్నించాడు.

ఇక కోహ్లీ గురించి మాట్లాడుతూ…ఆస్ట్రేలియా కోహ్లీ క్యాచ్ జార విడిచి నందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చిందని…తన క్యాచ్ మిస్ చేసిన ఏ జట్టు ని కూడా కింగ్ వదలడని యువరాజ్ పేర్కొన్నారు.

కోహ్లీ 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు మార్ష్ అతని క్యాచ్ ను జారవిడిచాడు. కాబట్టి టీం ఇండియా సులభంగా గెలిచింది…లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేది. ఇక కోహ్లీకి రాహుల్ తోడవడంతో 165 పరుగుల భాగస్వామ్యాన్ని చేయగలిగారు. అయితే ప్రస్తుతం యువరాజ్ కేఎల్ రాహుల్ గురించి చెప్పిన విషయం కరెక్టే అంటూ నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. మరి రోహిత్, ద్రవిడ్ అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనున్న ఇండియా జట్టులో నాలుగవ స్థానంలో ఎవరిని తీసుకుంటారో వేచి చూడాలి. ఎందుకంటే ఇంకా కోలుకొని గిల్ ఈ మ్యాచ్ లో కూడా పాల్గొనడం లేదు అని బీసీసీఐ స్పష్టం చేసింది.

Related News

IND VS BAN: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా జట్టు ఎంపిక..తెలుగోడికి ఛాన్స్ !

IPL Mega Auction: 5+1 RTM కార్డ్..ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్స్ ఇవే..ధోనికి రూట్‌ క్లియర్‌!

SRH: హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ గుడ్‌న్యూస్..SRHలోకి మొనగాడు వస్తున్నాడు !

Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్‌ కు దూరం !

IPL 2025: CSK జట్టులో కల్లోలం…సీక్రెట్‌ గా జారుకుంటున్న ప్లేయర్లు ?

Ashwin: అశ్విన్​తో కలిసి పంత్ తొండాట…ఇంటి దారి పట్టిన బంగ్లా కెప్టెన్​!

Rishabh Pant: పాపం…RCBలోకి రాకుండా పంత్‌ పై కోహ్లీ కుట్రలు..?

Big Stories

×