EPAPER
Kirrak Couples Episode 1

Bangladesh vs Afghanistan : ఆఫ్ఘనిస్తాన్ పై బంగ్లాదేశ్ తొలి బోణీ…లక్కీ గా గెలిచేసిన మ్యాచ్…

Bangladesh vs Afghanistan  : ఆఫ్ఘనిస్తాన్ పై బంగ్లాదేశ్ తొలి బోణీ…లక్కీ గా గెలిచేసిన మ్యాచ్…
Bangladesh vs Afghanistan

Bangladesh vs Afghanistan : భారత్లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో ఈరోజు పొద్దున మూడవ మ్యాచ్ బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య జరిగింది. ఆరంభ మ్యాచ్లో బంగ్లాదేశ్ మంచి బోణీ కొట్టింది. ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ టీం సంబరాలు చేసుకుంటున్నారు. తొలిత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో…ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ కు దిగింది. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లలో కనీస స్కోర్ 200 దాటగా.. 37.2 ఓవర్లలో 156 పరుగులు చేసి చేతులెత్తేసింది.


 ప్రపంచ కప్ 2023 ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో ఇదే అతి స్వల్పమైన స్కోర్. పూర్తిగా 50 ఓవర్లు కూడా పూర్తి చేయలేని ఆఫ్గాన్ జట్టు బంగ్లాదేశ్ బౌలర్ల దాటికి పెవిలియన్ వైఫ్ పరుగులు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కేవలం రహ్మనుల్లా గుర్బాజ్ ఒంటరి పోరాటం చేశాడు. 62 బంతులకు అతను 4 ఫౌర్లు…1 సిక్స్ బాది..47 పరుగులు సాధించాడు.గుర్బాజ్ మినహా మిగిలిన ప్లేయర్లు దారుణంగా విఫలం అవడంతో కుప్పకూలిపోయింది.

మొదటి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ బౌలర్లు బాల్ బౌండరీ వైపుకు వెళ్లే అవకాశం ఇవ్వలేదు.మెహదీ హసన్ మిరాజ్, షకీబ్ ఉల్ హసన్ తమ ఖాతాలో చెరి మూడు వికెట్లు వేసుకున్నారు. షోరిఫుల్ ఇస్లామ్ రెండు వికెట్లు తీసి సరిపెట్టుకున్నాడు. ఇక బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్ళు 158 పరుగులు చేశారు. అయితే ఆ 158 పరుగులు కూడా అనుకున్నంత తొందరగా చేయలేదు.. 34.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించగలిగారు. బంగ్లాదేశ్ బ్యాటర్స్ నజ్ముల్ షాంటో.. 83 బంతులకు 3 ఫోర్లు, 1 సిక్స్ బాది 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా,మెహదీ హసన్ మిరాజ్ 73 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు సాధించి 57 పరుగులు చేయగలిగాడు.


మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్కారిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్కోర్ బోర్డు పరిగెత్తించాల్సిన ప్లేయర్స్ కాస్త పెవీలియన్ వైపు పరుగులు పెట్టారు. ఈరోజు బంగ్లాదేశ్ మ్యాచ్ గెలవడం వెనక క్రెడిట్ చాలా వరకు బంగ్లా బౌలర్లకే పోతుంది. ఎంతో కట్టుదిట్టమైన క్రమశిక్షణతో ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ ను పడగొట్టగలిగారు. బ్యాటింగ్ విషయంలో బంగ్లాదేశ్ ఇంకా పూర్తి ఫామ్ లో లేదు అన్న సందేహం ఈ మ్యాచ్ చూసిన ఎవరికైనా కలుగక మానదు. అతి స్వల్ప స్కోర్.. 50 ఓవర్ల చేతిలో ఉన్నాయి దూకుడుగా ఆడి కనీసం ఒక 100 అయినా ఓపెనింగ్ భాగస్వామ్యం ఇవ్వాల్సిన ఓపెనర్లు సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ స్కోర్స్ కి ఔట్ అయ్యారు.

బంగ్లాదేశ్ ఓపనర్స్ లిట్టన్ దాస్ 13 పరుగుల వద్ద అవుట్ కాగా ,తన్జిద్ హసన్ కేవలం 5 పరుగులకే వెనక్కి తిరిగాడు. తర్వాత టీం ని ఆదుకున్న మెహదీ హసన్ మిరాజ్, షాంటో మూడవ వికెట్ సమయానికి 97 పరుగుల భాగస్వామ్యం సాధించారు . ముందుండి నడిపించాల్సిన బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ 14 పరుగులు సాధించి పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత షాంటో పుణ్యమా అని బంగ్లాదేశ్ సునాయాసంగా గెలిచింది.

Related News

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

Big Stories

×