EPAPER
Kirrak Couples Episode 1

Israel Rocket Attack : ఇజ్రాయెల్ పై మిలిటెంట్ల భీకర దాడులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన సైన్యం

Israel Rocket Attack : ఇజ్రాయెల్ పై మిలిటెంట్ల భీకర దాడులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన సైన్యం

Israel Rocket Attack : ఇజ్రాయెల్‌పై భీకర రాకెట్ దాడులు జరిగాయి. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు 5 వేలకు పైగా రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్‌ను ప్రారంభించిన హమాస్ సాయుధ విభాగం.. 20 నిమిషాల పాటు రాకెట్ల దాడికి పాల్పడింది. పవిత్ర నగరం జెరూసలెం సహా, ఇజ్రాయెల్ అంతా మంటలు ఎగసిపడుతున్నాయి. అంతేకాదు.. గాజా స్ట్రిప్‌ నుంచి ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ తీవ్రవాదులు ఇష్టానుసారంగా కాల్పులు జరిపారు. దాంతో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.


గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి అనేక మంది ఉగ్రవాదులు చొరబడటంతో… గాజా స్ట్రిప్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లు ఇళ్లలోనే ఉండాలని ఇజ్రాయెల్ సైనిక దళాలు సోషల్‌ మీడియాలో ప్రజల్ని హెచ్చరించాయి. హమాస్‌ మిలిటెంట్ల దాడుల్ని తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్ సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి. దాడిలో ఉగ్రవాదులు పారాగ్లైడర్‌లను కూడా ఉపయోగించారు. తాజా దాడులపై సమీక్ష నిర్వహించేందుకు.. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు త్వరలో భద్రతా దళాధిపతుల సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా హింస పెరుగుదలను తాజా దాడి సూచిస్తోందని అభిప్రాయపడింది.

ఇవాళ సెలవు రోజు కావడంతో ఇజ్రాయెల్ ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. గాజా నుంచి సైరన్లు మోగించి ఎమర్జెన్సీ ప్రకటించడం, రాకెట్లను పేల్చడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రజలు ధైర్యంగా ఉండి, పోరాడాలని ఇజ్రాయెల్ రక్షణ దళం పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ పై జరిగిన దాడుల వీడియోలను అక్కడి పౌరులు ఇళ్లలో నుంచే వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Related News

Indian stuck in Foreign for 23 years: పరాయి దేశంలో 23 ఏళ్లుగా చిక్కుకుపోయిన భారతీయుడు.. ఎలా తిరిగొచ్చాడంటే..

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Israel vs Iran War: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Big Stories

×