EPAPER
Kirrak Couples Episode 1

Home Minister Mahmood Ali : అధిష్ఠానానికి తలనొప్పిగా మారుతున్న బీఆర్ఎస్ నేతల చేష్టలు

Home Minister Mahmood Ali : అధిష్ఠానానికి తలనొప్పిగా మారుతున్న బీఆర్ఎస్ నేతల చేష్టలు

Home Minister Mahmood Ali : తెలంగాణలో మంత్రులు, కీలకనేతలు.. ఇతరులపై దాడులు చేసి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ.. గన్‌మెన్‌ చెంప చెళ్లుమనిపించారు. ఊహించని ఈ ఘటనతో గన్‌మెన్‌ సహా స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంత్రి దగ్గరికి పిలిస్తే ఏదో చెబుతారనుకున్న గన్ మెన్.. ఈ హఠాత్ పరిణామంతో విస్తుపోయాడు.


మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు హోంమంత్రి మహమూద్ అలీ. అంతలోనే పక్కన ఉన్న గన్ మెన్ ను బొకే ఎక్కడ అని ప్రశ్నించారు. ఆగ్రహం తట్టుకోలేక..చేయి చేసుకున్నారు. కోపంతో ఊగిపోయిన హోంమంత్రిని.. తలసాని వారించారు. పోనీలేండి అంటూ సర్థిచెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అత్యంత సౌమ్యుడిగా పేరున్న ముహబూబ్‌ అలీ ఇలాంటి చర్యలకు పాల్పడటం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.

హోంమంత్రి మహమూద్ అలీ వద్ద నమ్మకంగా పని చేస్తున్న గన్ మెన్ ను కొట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హోంమంత్రి ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సైతం వెనుకాడని గన్ మెన్ ను ఎలా కొడతారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 24 గంటలు విధుల్లో ఉంటూ.. తమ కుటుంబాలకు సైతం దూరంగా ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీసులంటే అంత అలుసా అని హోంమంత్రిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.


చిన్న ఉద్యోగులంటే మంత్రులకు ఎందుకు అంత అలుసో తెలియడం లేదు. హోంమంత్రి దగ్గర పని చేసే గన్ మెన్ చిన్న ఉద్యోగి. హోంమంత్రి మహమూద్ అలీ కొట్టడంతో గన్ మెన్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తన కుటుంబం డిప్రెషన్ లోకి వెళ్లింది. ఏ పిల్లల దృష్టిలో అయి ఆ తండ్రి హీరో. అలాంటి వారి పరిస్థితి ఏంటి. ఇలాంటి సంఘటనలతో బీఆర్ఎస్ మంత్రులు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ఈ వీడియోను ట్రోల్ చేస్తున్నారు.

పోలీసులకు బాస్ హోంమంత్రి. అలాంటి పెద్ద హోదాలో ఉండి, పోలీసులను నిత్యం అన్ని విధాలుగా కాపాడుకోవాల్సిన హోంమంత్రి మహమూద్ అలీ గన్ మెన్ ను కొట్టడంతో ఒక్కసారిగా తెలంగాణలో విపరీతంగా చర్చ మొదలైంది. హోదా మర్చిపోయి చిన్న ఉద్యోగిని, పైగా.. హోం మంత్రి ప్రాణాలను రక్షించాల్సిన గన్ మెన్ పై చేయి చేసుకోవడం ఏంటని ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకుని, తమ హోదాకు తగ్గట్టుగా ప్రవర్తించాలని కోరుతున్నారు.

ఇక.. గతంలోనూ ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లో జరిగింది. ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓ అభిమాని మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు ఆయన వద్దకు వచ్చే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ అభిమానిని వెనుక నుంచి కాలర్ పట్టుకొని లాగారు. ఎక్కడికి వెళ్తున్నావంటూ.. ఆగ్రహానికి గురయ్యారు. ఆ అభిమానిని కొట్టడానికి ప్రయత్నం చేశారు. అంతలోనే తనను తాను కంట్రోల్ చేసుకున్నారు. కట్ చేస్తే.. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేసింది. మంత్రి తలసాని పూనకంతో ఊగిపోయిన వీడియోను కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు.

ఈ ఘటనపై మంత్రి తలసాని క్షమాపణలు చెప్పారు. తనకు ఎమ్మెల్సీ దండె విఠల్ ఫోన్ చేసి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్ గురించి చెప్పారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తాను కాలర్ పట్టి వెనుకకు లాగింది బైంసా ఏఎంసీ చైర్మన్ రాజేశ్ కుమార్ బాబునని వివరించారని తెలిపారు. వెంటనే రాజేశ్ కుమార్ బాబుకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పానన్నారు. ఎవరో కాలు తొక్కడంతో రక్తం వచ్చిందని, వెంటనే కాలు తీయడానికి కాలర్ పట్టుకొని లాగాల్సి వచ్చిందన్నారు. అంతకు మించి ఎలాంటి తారతమ్యాలు లేవన్నారు.

ముషిరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి మంత్రి కేటీఆర్ వస్తున్నారని తెలిసి వెళ్లానని బైంసా ఏఎంసీ చైర్మన్ రాజేశ్ కుమార్ బాబు తెలిపారు. నా స్నేహితుడికి మంత్రి కేటీఆర్ ను పరిచయం చేయాలని మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్తున్న క్రమంలో ఎవరో బలంగా వెనుక నుంచి లాగినట్లు అనిపించిందన్నారు. నా కాలర్ పట్టుకొని లాగింది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారని రాజేశ్ కుమార్ బాబు తెలిపారు. ఆయన అలా ఎందుకు చేశారో అర్థం కాలేదన్నారు.

ప్రజలు అధికారం ఇచ్చింది.. మంత్రి పదవులు ఉన్నది అభివృద్ధి చేయడానికి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆదర్శంగా నిలవాల్సిన వారే ఆగ్రహానికి గురైతే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్రమ శిక్షణతో మెలగకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

Related News

Jani Master: నువ్వు మామూలోడివి కాదయ్యో.. ఇంతమందిపై లైం*గి*క దాడా..?

Bigg Boss 8 Day 21 Promo: సెట్ ఆర్ కట్.. రియల్ ఫన్ డే అయ్యిందిగా..?

Bigg Boss: పోటీ లేదు.. టీఆర్పీ రేటింగ్ రాదు.. ఆ తప్పే రిపీట్ కానుందా..?

Kalki Sequel: కల్కి సీక్వెల్ పై అభిమానులలో టెన్షన్.. అసలు కారణం ఏంటంటే..?

Heroine Simran: వారు క్షమాపణ చెప్పాలి.. బహిరంగ ప్రకటన చేసిన సిమ్రాన్..!

R.K.Roja: జానీ మాస్టర్ పై షాకింగ్ కామెంట్.. నిజం తేల్చాలంటూ..?

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Big Stories

×