EPAPER

Rachin Ravindra : ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి మ్యాచ్ లో విధ్వంసం సృష్టించిన భారతీయుడు…రచిన్ రవీంద్ర…

Rachin Ravindra : ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి మ్యాచ్ లో విధ్వంసం సృష్టించిన భారతీయుడు…రచిన్ రవీంద్ర…
Rachin Ravindra

Rachin Ravindra : అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన తొలి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభ మ్యాచ్ తర్వాత క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు రచిన్ రవీంద్ర. 23 సంవత్సరాల ఈ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ ప్రస్తుతం తన అజయ్ శతకంతో జట్టును గెలిపించడమే కాకుండా ప్రపంచంలోని ఎందరో క్రికెట్ అభిమానుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. ఈరోజు అతని విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రపంచ కప్ చరిత్రలోనే కివిస్ తరఫున సెంచరీ సాధించిన అత్యంత చిన్న వయసు కలిగిన ప్లేయర్గా రికార్డు సృష్టించింది.


ర‌చిన్‌ రవీంద్ర వినడానికి ఇది న్యూజిలాండ్ పేరులా లేదే అనుకుంటున్నారా.. కరెక్టేనండోయ్ ఎందుకంటే అతను వాస్తవానికి భారతీయుడే…కానీ అతను పుట్టకముందే కుటుంబం న్యూజిలాండ్ కి వెళ్లి స్థిరపడడంతో అతను న్యూజిలాండ్ పౌరుడయ్యాడు. ఈ స్వదేశీ …విదేశీ ఆటగాడి తండ్రి రవి కృష్ణమూర్తి మొదట బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ గా పనిచేసేవారు. అంతేకాక క్రికెట్ పట్ల అతనికి ఎంతో ఆసక్తి ఉంది. అందుకే న్యూజిలాండ్ లో హాట్ హాక్స్ అనే పేరుతో ఒక క్రికెట్ క్లబ్ ను కూడా ప్రారంభించాడు. అప్పుడప్పుడు కృష్ణమూర్తి బెంగుళూరు కి వచ్చి క్రికెట్ ఆడేవాడట.

స్వతహాగా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉన్న రవి కృష్ణమూర్తికి ఇండియన్ దిగ్గజ ప్లేయర్స్ రాహుల్ ద్రవిడ్ మరియు సచిన్ టెండూల్కర్ అంటే విపరీతమైన ఇష్టంతో పాటు గౌరవం కూడా ఉండేది. వాళ్ళిద్దరి పై ఉన్న గౌరవాన్ని ప్రదర్శించడానికి అతను ఎంచుకున్న మార్గం కూడా ఎంతో వినూత్నమైనది. రచిన్ పేరు బాగా గమనించండి.. మీకే అర్థమవుతుంది. రచిన్ అంటే….రాహుల్ + సచిన్… పేరులోనే ఇద్దరు సూపర్ డూపర్ క్రికెట్ ఆటగాళ్ల పేరు కలిసి వచ్చిన రచిన్…. ఇప్పుడు ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.


2016 ,18 న్యూజిలాండ్ తరఫున అండర్ 19 ప్రపంచ కప్ లో ఆడిన రచిన్…మొదటి నుంచే దూకుడుగా ఆడుతూ నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చాడు. 2021 సెప్టెంబర్ లో జరిగిన టి20 మ్యాచ్ ద్వారా న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 20201 లో టెస్ట్ మ్యాచ్లు.. 2023లో వన్డే మ్యాచ్లలో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు అతని క్రికెట్ కెరియర్ లో 13 వన్డేలు 18 టీ20లు, 3 టెస్ట్ మ్యాచులు ఆడడం జరిగింది.

 ఇక ఈరోజు జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే గత వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైన న్యూజిలాండ్ ఈసారి తన సత్తా చూపించింది. తొలుత టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది…ఇక బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 282 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. అయితే కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే దూకుడుగా ఆడడం…అతనికి రచిన్ తోడు కావడంతో న్యూజిలాండ్ స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. కాన్వే 121 బంతులలో 152 పరుగులు సాధించగా…రచిన్ రవీంద్ర 96 బంతులలో 123 పరుగులు సాధించాడు. దీంతో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై భారీ విజయాన్ని నమోదు చేసింది.

Related News

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

Big Stories

×