EPAPER

World Cup 2023 : ఒక్క సెకనుకు రూ.3 లక్షలు

World Cup 2023 : ఒక్క సెకనుకు రూ.3 లక్షలు
World Cup 2023

World Cup 2023 : క్రికెట్ అభిమానులకు వన్డే వరల్డ్ కప్ ఫీవర్ మొదలైంది. అక్టోబర్ 5 నుంచి మొదలయ్యే వరల్డ్ కప్ మ్యాచ్ లు నవంబర్ 19వ తేదీ వరకూ జరగనున్నాయి. తొలిరోజు అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ – న్యూజిల్యాండ్ దేశాలు తలపడుతున్నాయి. అక్టోబర్ 8న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఇండియా జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. వన్డే వరల్డ్ కప్ అంటే అందరూ ఎదురుచూసేది ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ కోసమే. అక్టోబర్ 14న జరిగే ఇండియా – పాకిస్థాన్ ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కు నరేంద్రమోదీ స్టేడియం వేదిక కానుంది.


వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం ఆయా దేశాల క్రికెట్ జట్టులు భారత్ కు చేరుకుంటున్నాయి. క్రికెట్ మ్యాచ్ లు అంటే వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు చాలానే ఉంటుంది. ఒక్కో క్రికెటర్ తీసుకునే పారితోషికమే కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇక వారి బసకు, ఆహారానికి, విలాసాలకు చాలానే ఖర్చు ఉంటుంది. అన్నింటికీ మించి.. వరల్డ్ కప్ మ్యాచ్ యాడ్స్ కు వేల కోట్ల రూపాయల్లో ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడిదే అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. 2019లో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ యాడ్స్ కోసం ఖర్చు చేసిన దానికంటే ఈసారి 40 శాతం అధికంగా వ్యాపారసంస్థలు వరల్డ్ కప్ యాడ్స్ కు ఖర్చు చేస్తున్నాయని ఇండస్ట్రియల్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మార్కెట్ నిపుణుల అంచనాల మేరకు.. ప్రపంచస్థాయి బ్రాండ్స్ ఈ టోర్నమెంట్ లో తమ బ్రాండ్స్ అడ్వర్ టైజ్ మెంట్స్ కోసం ఏకంగా రూ.2000 కోట్లు ఖర్చు చేస్తున్నాయట. కేవలం 10 సెకండ్ల యాడ్ కోసం 3 మిలియన్ రూపాయలు అంటే.. భారత కరెన్సీలో సుమారు రూ.30 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ అయిన జహిల్ థక్కర్ పేర్కొన్నారు. 2019లో కంటే ఇది 40 శాతం అధికమన్నారు. అందుకు కారణం వరల్డ్ కప్ టోర్నమెంట్ అందరి దృష్టినీ ఆకర్షించడమేనన్నారు.


వరల్డ్ కప్ ఎయిర్ టైమ్ లో కోకాకోలా, గూగుల్ పే, యూనిలివర్ ఇండియా యూనిట్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ వంటి కంపెనీలతో పాటు సౌదీ ఆరామ్ కో, ఎమిరేట్స్ అండ్ నిస్సాన్ మోటార్ కో సంస్థలు యాడ్స్ కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నాయి. వరల్డ్ కప్ బ్రాడ్ కాస్ట్ రైట్స్ ను తీసుకున్న డిస్నీ స్టార్ సంస్థ.. తమతో 26 కంపెనీలు యాడ్స్ కోసమై పార్టనర్స్ గా ఉన్నాయని తెలిపింది. క్రికెట్ మ్యాచ్ ల సమయంలో యాడ్స్ కోసం వివిధ సంస్థలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకునేందుకు ఈ స్థాయిలో ఖర్చు చేయడానికి కారణం..వరల్డ్ కప్ కు ఉన్న క్రేజ్ అని ఫ్యాన్ కోడ్ కో ఫౌండర్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అఫీషియల్ రిటైల్ పార్ట్నర్ యానిక్ కొలాకో తెలిపారు.

భారతీయులను క్రికెట్ ఆకర్షించినంతగా.. మరే క్రీడా ఆకర్షించలేదని కొలాకో అభిప్రాయపడ్డారు. అందులోనూ వరల్డ్ కప్ అంటే.. అస్సలు మిస్ అవకుండా చూస్తారన్నారు. క్రికెట్ స్పాన్సర్ షిప్ లో ఒక ఏడాదికి 1.5 బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతుందని జెఫరీస్ పరిశోధన చెబుతోంది. భారత్ ఇప్పుడిప్పుడే ప్రపంచ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అనువైనదిగా మారుతుండటం అందరికీ ఆనందాన్నిస్తోంది. 2035 నాటికి ప్రపంచ ఆర్థిక విస్తరణలో భారత్ 5వ వంతుగా ఉండి.. 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో చైనాలో ప్రపంచ సంస్థల పెట్టుబడులు తగ్గుతున్నాయి. ఫలితంగా అక్కడ ఆర్థిక మందగమనం పెరుగుతోంది.

క్రికెట్ అభిమానులు మ్యాచ్‌ల కోసం దూరప్రాంతాలకు ప్రయాణించడం, రెస్టారెంట్లు, బార్‌లు వంటి వేదికలలో వాటిని చూడటం లేదా ఇంట్లోనే ఆర్డర్ టేకౌట్ చేయడం వంటి వాటి వల్ల కూడా ప్రపంచ కప్ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. జెఫరీస్ విశ్లేషకుడు ప్రతీక్ కుమార్ చెప్పినదాని ప్రకారం భారతదేశంలో క్రికెట్ మ్యాచ్ లు ఉన్న రోజుల్లో సమీప హోటల్ ఛార్జీలు సగటున 150% పెరిగాయి.

సెప్టెంబరు నుండి జనవరి వరకు జరిగే భారతదేశపు పండుగల సీజన్‌తో ప్రపంచ కప్ సమానంగా ఉండటంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకునేందుకు ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. అక్టోబర్ 5 నుంచి 48 రోజుల పాటు జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ లకు భారత్ లో 10 స్టేడియంలు వేదికలవుతున్నాయి. ముంబై, లక్నో, హైదరాబాద్, కోల్ కతా, పూణే, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ధర్మశాల, అహ్మదాబాద్ లలో ఉన్న స్టేడియంలలో వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. నవంబర్ 15,16 తేదీల్లో ముంబై వాంఖడే స్టేడియం, కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో సెమీ ఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 10 టీమ్ లలో ఏ టీమ్ లు తుదిపోరుకు చేరుకుంటాయో..వేచి చూడాలి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×