EPAPER

Telangana Politics : హాట్ టాపిక్ గా తెలంగాణ రాజకీయం.. ఎవరికి ఎవరు దోస్తులు ?

Telangana Politics : హాట్ టాపిక్ గా తెలంగాణ రాజకీయం.. ఎవరికి ఎవరు దోస్తులు ?

Telangana Politics : తెలంగాణలో ఎవరు ఎవరితో దోస్తీ కడుతున్నారు ? రహస్య స్నేహితులు ఎవరు? ఓపెన్ ఫ్రెండ్ షిప్ ఎవరిది? వీటిపైనే ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది. ప్రధాని మోడీ తొలిసారిగా కేసీఆర్ గురించి పూర్తిస్థాయిలో మాట్లాడడంతో విషయం ఓపెనప్ అయింది. దీంతో కాంగ్రెస్ ఇదే ఇష్యూను పట్టుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫ్రెండ్ షిప్ తేలిపోతుందంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వారి మధ్య పొత్తులు కుదిరాయని రేవంత్ చెప్పడం కీలకంగా మారింది.


తెలంగాణలో పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుతోంది. ఏ పార్టీలు రహస్య స్నేహితులుగా ఉన్నాయన్న అంశాల చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి. మొదటి నుంచి బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ వాదిస్తూ వస్తోంది. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని రాహుల్ గాంధీ కూడా చాలా సార్లు చెప్పారు. తాజాగా మోడీ నిజామాబాద్ లో కేసీఆర్ పై కామెంట్స్ చేసిన తర్వాత కూడా రాహుల్ బీజేపీ రిష్తేదార్ సమితి అంటూ ట్వీట్ చేశారు. నిజానికి ప్రధాని మోడీ.. ఇటీవలి కాలంలో రాష్ట్రానికి వచ్చినా కేసీఆర్ పేరు డైరెక్ట్ గా తీసుకుని ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కేసీఆర్ గురించి తొలిసారి మాట్లాడుతున్నానని చెప్పి కొన్ని విషయాలను బహిరంగసభలో ప్రకటించారు. కేసీఆర్ తనదగ్గరికొచ్చి ఎన్డీఏలో చేరుతానని చెప్పడం, కేటీఆర్ ను సీఎం చేస్తానని చెప్పారంటూ మాట్లాడారు. ఇదేమైనా రాజులు, మహరాజుల కాలమా అని తాను ప్రశ్నించినట్లు ప్రధాని చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఇదే ఇష్యూపై తీవ్రస్థాయిలో రగడ మొదలైంది.

కేసీఆర్ పై మోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎవరికి లాభం.. ఎవరికి నష్టం కలిగిస్తాయన్న ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ-బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలను ప్రధాని బయటపెట్టడమే ఇప్పుడు అంతటా చర్చనీయాంశమవుతోంది. మాటలో మాట చాలా విషయాలు చర్చకు వస్తాయని, అలాంటి వాటిని బయటకు చెప్పడం ఏంటని బీఆర్ఎస్ లో కొందరు నేతలు మాట్లాడుతుంటే.. మరోవైపు డిపాజిట్లే రాని పార్టీతో తాము ఎందుకు పొత్తు పెట్టుకుంటామన్న ప్రశ్నల్ని కేటీఆర్ వినిపిస్తున్నారు. మునిగిపోయే ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.


2020, 2021లో మోడీ-కేసీఆర్ మీటింగ్ విషయాలను ప్రధాని బయటపెట్టడంతో భవిష్యత్ లో కలిసే నేతలు అలర్ట్ గా ఉంటారన్న వాదన వినిపిస్తోంది. ఏం మాట్లాడితే.. ఏం బయటికొస్తుందోనని నేతలకు టెన్షన్ పట్టుకుంటోంది. కేసీఆర్ పై మోడీ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ-బీఆర్ఎస్ దోస్తీ మరోసారి బయటపడిందంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది. కేటీఆర్ ను సీఎం చేయాలనుకోవడం, పొత్తులు పెట్టుకోవాలనుకోవడం.. ఇవన్నీ వారి బంధాన్ని గుర్తు చేస్తున్నాయంటున్నారు. అంతేకాదు.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో BRS, BJP మధ్య పొత్తు కుదిరిందన్నారు రేవంత్‌. బీఆర్‌ఎస్‌ 9 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో, ఎంఐఎం ఒక్కస్థానంలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరిందని చెప్పుకొచ్చారు. బీజేపీ 4 సిట్టింగ్‌ స్థానాలతో పాటు మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, చేవెళ్ల స్థానాలను బీజేపీ అడిగినట్లు.. బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎంపీ తనకు చెప్పినట్లు రేవంత్ వెల్లడించారు.

కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్నది నిజమే అంటూ అటు విజయశాంతి, ఇటు ఈటల, ప్రకాశ్ జవదేకర్ కామెంట్ చేయడం కీలకంగా మారింది. తమతో కేసీఆర్ జట్టు కట్టాలనుకున్నది నిజమే అని అయితే తామే దూరం పెట్టామంటున్నారు. అయితే ఈ కామెంట్లను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇద్దరి మధ్య బంధానికి ఇదే రుజువు అని, అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక రహస్య స్నేహితులు కాస్తా బయటకు వస్తారంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనన్న విషయం చాలాసార్లు బయటపడిందని, కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారంటూ కమలం నేతలు కౌంటర్లు వేస్తున్నారు. బీజేపీ – బీఆర్‌ఎస్‌ మధ్య ఒప్పందం కుదిరిందన్నది గాలి వార్తలే అని ఈటల కొట్టి పారేస్తున్నారు. మొత్తంగా ప్రధాని మోడీ చెప్పిన ఇంటర్నల్ మీటింగ్ విషయాలు తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచేశాయి. ఇవి మూడు పార్టీల మధ్య మరోసారి మాటల మంటలు రేపుతున్నాయి.

Related News

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Big Stories

×