పూరీ ఎమోషనల్ లెటర్.. సక్సస్.. లైఫ్.. ఫైల్యూర్ ‌పై ఏమన్నారంటే..!

సక్సస్, ఫెయిల్యూర్ రెండు వేరు కాదు.. రెండూ ఫ్లోలో ఉంటాయి..

ఏదీ పర్మనెంట్ కాదు.. ప్రతీ సంఘటన మనకి ఓ ఎక్స్‌పీరియన్స్

లైఫ్‌ని సినిమాలా చూడాలి.. మైండ్‌కి తీసుకుంటే మెంటల్ వస్తాది..

సక్సస్ అయితే డబ్బులొస్తాయి.. ఫెయిల్ అయితే బోలెడ జ్ఞానం వస్తుంది

లైఫ్‌లో రిస్క్ చేయకపోతే అది లైఫ్ కాదు.. ఏ రిస్క్ చెయ్యకపోతేనే అసలైన రిస్క్

నిజాయితీ పరుడనని చెప్పుకోనవసరం లేదు.. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు.. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది

ఏదీ ఆశించకుండా.. ఎవరినీ మోసం చేయకుండా మనపని మనం చేసుకుంటూ పోతే.. మనల్ని పీకే వాళ్లు ఎవరూ ఉండరు

నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్‌ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు..

నేను ఆడియన్స్‌కి మాత్రమే రుణపడి ఉన్న.. మళ్లీ ఓ సినిమా తీసి వాళ్లని ఎంటర్టైన్ చేస్తా..

చచ్చినాక ఇక్కడి నుంచి ఒక్క రూపాయి తీసుకెల్లిన ఒక్కడి పేరు చెప్పండి నేనూ దాచుకుంటా..

ఫైనల్‌గా అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేది అంతా డ్రామా..