EPAPER

ENGLAND TEAM 2023 : ఇంగ్లాండే హాట్ ఫేవరేటా? మళ్లీ కప్ కొడుతుందా?

ENGLAND TEAM 2023 : ఇంగ్లాండే హాట్ ఫేవరేటా? మళ్లీ కప్ కొడుతుందా?
ENGLAND TEAM 2023

ENGLAND TEAM 2023(Latest sports news) : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో అత్యధికసార్లు ఓడిన జట్టు ఇది. ఈ టీమ్ వరల్డ్ ఛాంపియన్ కల నెరవేరడానికి 44 ఏళ్లు పట్టింది. 13వ వరల్డ్ కప్ ఈ జట్టుదేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ జట్టే ఇంగ్లాండ్.


2019 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు మరోసారి హాట్ ఫేవరేట్ గా మారింది. ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉంది. మ్యాచ్ ఫలితాన్ని అనూహ్యంగా మార్చేయగల ఆలౌరౌండర్లు టీమ్ లో ఉన్నారు. భారత్ పిచ్ ల పై మాయాజలం సృష్టించే స్పిన్నర్లు ఉండటం మరో ప్లస్ పాయింట్. ఓపెనర్లు జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థి పేస్ ఎటాక్ ను చీల్చి చెండాగల బ్యాటర్లు. డేవిడ్ మలన్, జో రూట్ , బెన్ స్టోక్స్ క్రీజులో పాతుకుపోతే భారీ స్కోర్లు సాధిస్తారు. నయా సంచలనం హారీ బ్రూక్ మెరుపులు మెరిపిస్తాడనే అంచనాలున్నాయి.

ఆల్ రౌండర్లు ఇంగ్లాండ్ జట్టుకు అదనపు బలం. మొయిన్ అలీ, సామ్ కర్రన్ , లైమ్ లివింగ్ స్టోన్ , క్రిస్ హోక్స్ అటు బ్యాట్ తో ఇటు బంతితో అద్భుతంగా ఆడతారు. మార్క్ వుడ్ ప్రత్యర్థి బ్యాటర్లను తన వేగంతో హడలెత్తించే బౌలర్. అదిల్ రషీద్ కు భారత్ పిచ్ ల పై తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించే సత్తా ఉంది. డేవిడ్ విల్లీ, రీస్ టోప్లే, గస్ అట్కిన్సన్ బౌలింగ్ విభాగంలో అదనపు వనరులుగా అందుబాటులో ఉన్నారు. తుది జట్టు ఎంపికే ఇంగ్లాండ్ కు అసలైన సవాల్. ఎందుకంటే టీమ్ లో ఉన్న 15 మంది తుది జట్టులో చోటు పోటీ పడుతున్నారు. అందుకే రోటేషన్ పద్ధతిలో మ్యాచ్ మ్యాచ్ కు ప్లేయర్లను మార్చే అవకాశం ఉంది. ప్రత్యర్థి బట్టి ఇంగ్లాండ్ తుది జట్టును ఎంపిక జరుగుతుంది.


ఎంతో పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ పై విజయం ప్రత్యర్థి జట్లకు అంతవీజీ కాదు. ఈ వరల్డ్ కప్ లో అన్ని జట్ల కంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగమే అత్యంత పటిష్టంగా ఉంది. ఎక్కువ మంది ఆల్ రౌండర్లు ఉన్న టీమ్ కూడా ఇదే. బౌలింగ్ విభాగంలో చాలా బలంగా ఉంది. ఆల్ రౌండర్ల వల్ల ఎక్కువ బౌలింగ్ ఆఫ్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైదానంలో ఇంగ్లాండ్ ఫీల్డర్లు చురుగ్గా కదులుతారు. ఇలా అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ఇంగ్లాండ్ 13వ వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×