EPAPER

Constipation : ఇవి తింటే మలబద్ధకం మాయం

Constipation : ఇవి తింటే మలబద్ధకం మాయం

Constipation : ప్రస్తుత కాలంలో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. దీన్ని తేలిగ్గా తీసుకుంటే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మలబద్ధకం దీర్ఘకాలం ఉంటే కిడ్నీ సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు, పైల్స్‌, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం, ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు వస్తాయి. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, జంక్‌ ఫుడ్‌, సరిగ్గా నీరు తాగకపోవడం, ఫైబర్‌ ఎక్కువగా తీసుకోకపోవడం, ఎక్ససైజ్‌లు చేయకపోవడం, వల్ల మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే చెంచా మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తినండి. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా మెంతి పొడిని వేసుకుని తాగాలి. అధిక వాత దోషం, కఫ దోషం ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. అధిక పిత్త దోషం ఉన్నవారు మాత్రం దీనికి దూరంగా ఉండాలి. అల్పాహారం తర్వాత, మధ్యాహ్న భోజనానికి ముందు, సాయంత్రం మీకు ఇష్టమైన కూరగాయలతో చేసిన ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మలబద్ధకం సమస్య త్వరగా తగ్గుతుంది. బచ్చలికూర, టొమాటో, బీట్‌రూట్, నిమ్మరసం, అల్లం కలిపి జ్యూస్‌ని తయారు చేసుకోండి. రోజూ ఉదయం నానబెట్టిన సబ్జా గింజలు తింటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఖాళీ కడుపుతో 1 చెంచా నానబెట్టిన సబ్జా గింజలు తీనాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నాన బెట్టిన 5 బాదంపప్పులు, ఒక వాల్‌నట్, 3 నల్ల ఎండుద్రాక్షలను తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అంజీర్‌లో విటమిన్ B6 బాగా ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్‌ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. రాత్రి నానబెట్టిన అంజీర్‌ పండ్లను ప్రతిరోజూ ఉదయం తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంజీర్‌ పేగు కదలికలను సులభతరం చేస్తుంది. ఉ.11 గంటల ప్రాంతంలో భోజనానికి ముందు ఒక కప్‌ బొప్పాయి తీసుకుంటే చాలా మంచిది. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు మజ్జిగ, అర స్పూన్ గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్ తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్స్ చాలా ఉంటాయి. ఇది కరిగే ఫైబర్, ఇది కడుపు పనితీరును ప్రోత్సహిస్తుంది. ఓట్స్‌‌ ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయి. ఓట్స్ ప్రేగుల పనితీరును ప్రోత్సహించడంలో, మెరుగుపరచడంలో సహాయపడతాయి. నెయ్యిలోని బ్యూట్రేట్ కంటెంట్ మలబద్ధకాన్ని దూరం చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బెల్లం, నెయ్యి రెండూ కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×