EPAPER
Kirrak Couples Episode 1

YCP MLA Daughter Love : ప్రేమలో పడిన కుమార్తె .. ఆ వైసీపీ ఎమ్మెల్యే ఏం చేశారంటే..?

YCP MLA Daughter Love : ప్రేమలో పడిన కుమార్తె .. ఆ వైసీపీ ఎమ్మెల్యే ఏం చేశారంటే..?
YSRCP latest news today

YSRCP latest news today(Andhra news updates) :

సాధారణంగా ప్రేమ వివాహాలకు పెద్దలు ఒప్పుకోరు. కులాంతర వివాహమైతే అస్సలు అంగీకరించరు. ప్రేమ వ్యవహారాల్లో అమ్మాయి తరఫున కుటుంబాల నుంచే ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి అయితే ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు వెళ్లనివ్వరు. ఒకవేళ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే వరుడని హత్య చేయడానికి వెనుకాడరు. ఇలాంటి ఎన్నో ఉందతాలు నిత్యం జరుగుతున్నాయి. అయితే ఆ అబ్బాయి ఓ ఎమ్మెల్యే కుమార్తెతో ప్రేమలో పడ్డాడు. మరి ఈ ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్ చేసుకుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.


వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మొదటి కుమార్తె పల్లవి , పవన్ అనే యువకుడు కలిసి చదువుకున్నారు. కాలేజీ రోజుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.

పల్లవి తన ప్రేమ విషయాన్ని తండ్రికి చెప్పారు. తన కుమార్తె మనస్సు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అర్థం చేసుకున్నారు. ఈ యువకుడి ఆస్తులు, అంతస్తులు, కులం ఇలాంటి విషయాలను ఆయన పట్టించుకోలేదు. ఆ యువకుడితో పెళ్లి జరిపిస్తానని పల్లవికి హామీ ఇచ్చారు. కుమార్తెకు ఇచ్చిన మాట ప్రకారమే వివాహం జరిపించారు. బొల్లవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పల్లవి, పవన్ పెళ్లి పెద్దల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత ప్రొద్దుటూరులోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు.


తన కుమార్తె ఇష్టప్రకారమే ఈ వివాహం జరిపించానని ఎమ్మెల్యే రాచమల్లు చెప్పారు. ఆ జంటను ఆశీర్వదించానన్నారు. కలిసి చదువుకున్న రోజుల్లో ఇష్టపడటంతో పవన్‌తో పెళ్లి చేశామన్నారు. వారి ఇష్టప్రకారమే అంగీకరించి వివాహం చేశామని ఎమ్మెల్యే చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కుమార్తెకు ప్రేమ వివాహం చేయడంపై సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆదర్శ తండ్రిగా నిలిచారని జనం అంటున్నారు. ఆయనలాగే అందరు తల్లిదండ్రులు ఆలోసిస్తే అన్నీ ప్రేమకథలకు ఇలాగే శుభంకార్డు పడుతుంది.

Related News

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

AP Govt: రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఈ స్కీమ్ తో వేల రూపాయల ఆదా.. దీపావళి నుండే ప్రారంభం..

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Nara Bhuvaneshwari: ప్లీజ్ ఈ ఒక్క మాట వినండి.. ప్రజలను కోరిన సీఎం సతీమణి

Perni Nani: మీ హాస్పిటల్ లో భజన చేసుకోండి.. ఒక్క హిందువుకైనా ఫ్రీగా వైద్యం అందించారా.. బీజేపీ మహిళా నేతకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

Jagan Tirumala Tour : జగన్ తిరుమల టూర్ రద్దుకు కారణాలు ఇవేనా… కూటమికి ఛాన్స్ ఇచ్చినట్టేనా ?

Big Stories

×