EPAPER

Mamata Benerjee : ఇలాగే కొనసాగితే దేశంలో అధ్యక్ష పాలన తప్పదు : మమత

Mamata Benerjee : ఇలాగే కొనసాగితే దేశంలో అధ్యక్ష పాలన తప్పదు : మమత

Mamata Benerjee : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశంలో అధికారాన్ని కేవలం ఒక వర్గం తన చెప్పుచేతల్లో పెట్టుకుందని.. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందని అన్నారు. ఇదే తరహా ఏకఛత్రాదిపత్యం పాలన సాగితే దేశంలో అధ్యక్ష పాలన వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు బెంగాల్ సీఎం. కోల్‌కతాలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిగికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


దేశంలో అసలు ప్రజాస్వామ్యమనేదే లేదన్నారు మమత. ఓ వర్గం అధికారాన్ని మొత్తం హస్తగతం చేసుకొని.. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టిస్తోందన్నారు. సామాన్య ప్రజల్ని అన్యాయం నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అభ్యర్ధనలను విని వారి పక్షాన నిలబడి న్యాయం అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కోల్‌కతాలో జరిగిన ఈ స్నాతకోత్సవంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు సుప్రీం కోర్ట్ ఛీఫ్ జస్టిస్ యుయులలిత్ పాల్గొన్నారు.


Tags

Related News

Vande Bharat Express: వందేభారత్ రైలు వివాదం.. ఉద్యోగుల మధ్య ఘర్షణ

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Big Stories

×