EPAPER

Talasani: ఆయనకు సారీ.. తగ్గిన తలసాని

Talasani: ఆయనకు సారీ.. తగ్గిన తలసాని
talasani beating

Talasani: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెనక్కి తగ్గారు. భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్‌బాబుకు క్షమాపణ చెప్పారు. స్టీల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభోత్సవంలో రాజేష్‌బాబును తలసాని నెట్టివేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తలసాని స్పందించారు.


ఈ నెల 20న హైదరాబాద్‌ ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని.. రాజేశ్‌ బాబుపై దాడి చేయబోయారు. తనకు, మంత్రి కేటీఆర్‌కు మధ్యలో రాజేశ్‌ బాబు రావడంపై కోపంతో ఊగిపోయారు. నాలుక మడతపెట్టి.. కాలర్ పట్టుకొని.. వెనక్కి లాగి.. చేయెత్తి కొట్టబోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో కలకలం చెలరేగింది.

నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన రాజేశ్‌ బాబు.. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నారు. ఉద్యమకాలంలో చురుగ్గా వ్యవహరించారు. ముధోల్ అసెంబ్లీ సీటుపై చర్చించడానికి మంత్రి కేటీఆర్ ని కలవడం కోసం వచ్చిన ఆయనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దాడి చేయడం వివాదాస్పదమైంది.


మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైఖరిపై గిరిజన సంఘాలు మండిపడ్డాయి. నిర్మల్ జిల్లా భైంసా, కుబీర్ ప్రాంతాల్లో గిరిజన నాయకులు నిరసన తెలిపారు. మంత్రి తీరును గిరిజన మండల నాయకులు ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. గిరిజన సమాజానికి మంత్రి తలసాని వెంటనే బహిరంగ క్షమాపణ డిమాండ్ చేశారు. దీంతో వెనక్కి తగ్గారు మంత్రి తలసాని.

భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్‌బాబుకు క్షమాపణ చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజేష్‌బాబును తలసాని నెట్టివేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. తలసాని స్పందించారు. ఆ కార్యక్రమంలో రద్దీ ఎక్కువగా ఉండటం, తన కాలును ఎవరో తొక్కడం వల్ల రాక్తం రావడంతో.. అనుకోకుండా రాజేష్‌బాబును నెట్టి వేశానని తలసాని తెలిపారు. ఈ ఘటన బాధాకరమని, ఆయనకు తాను క్షమాపణ చెబుతున్నానని చెప్పారు.

Related News

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

Big Stories

×