EPAPER

National Film Awards List: పుష్ప, RRR.. జాతీయ అవార్డుల్లో తగ్గేదేలే..

National Film Awards List: పుష్ప, RRR.. జాతీయ అవార్డుల్లో తగ్గేదేలే..
National Film Awards 2023 winners list

National Film Awards 2023 winners list(Cinema News in Telugu):

2021 ఏడాదికి గాను.. 69వ జాతీయ సినీ అవార్డులను (69th National Film Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


ఉత్తమ తెలుగు చిత్రం — ఉప్పెన
ఉత్తమ జాతీయ నటుడు — అల్లు అర్జున్ ( పుష్ప )
ఉత్తమ జాతీయ నటి — అలియాభట్, కృతి సనన్

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ — దేవిశ్రీ ప్రసాద్ (పుష్ఫ)
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ — కీరవాణి ( RRR)
బెస్ట్ కొరియోగ్రాఫర్ — ప్రేమ్ రక్షిత్ (RRR)
బెస్ట్ స్టంట్స్ — కింగ్ సోలోమన్ ( RRR )
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ — శ్రీనివాస్ మోహన్ (RRR)


బెస్ట్ లిరిక్స్ — చంద్రబోస్ (కొండపొలం)
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ — కాలభైరవ (RRR)
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ — శ్రేయా ఘోషల్

బెస్ట్ పాపులర్ మూవీ — RRR
జాతీయ ఉత్తమ చిత్రం — రాకెట్రీ
ఉత్తమ హిందీ చిత్రం — సర్దార్ ఉద్దమ్
ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం — కశ్మీర్ ఫైల్స్
బెస్ట్ ఫిలిం క్రిటిక్ ( తెలుగు) — పురుషోత్తమాచార్యులు
ఉత్తమ కన్నడ చిత్రం — 777 చార్లి

RRR మూవీ 6 అవార్డులు, పుష్ప 2 అవార్డులు కొల్లగొట్టాయి. తెలుగు నుంచి జాతీయ ఉత్తమ అవార్డు పొందిన తొలి నటుడిగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు.

నేషనల్ ఫిలిం అవార్డుల్లో టాలీవుడ్ సత్తా చాటింది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ తగ్గేదే లేదన్నాడు. పుష్ప గాడి క్యారెక్టర్‌లో జీవించిన అల్లు వారి అందగాడు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఉత్తమ నటుడిగా నిలిచి టాలీవుడ్ ప్రతిష్టను మరో మెట్టు ఎక్కించాడు.

పుష్ప – తగ్గేదేలే. పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైర్. ఈ డైలాగ్‌లు అప్పట్లో మార్మోగాయి. అవార్డుల ప్రకటన తర్వాత మళ్లీ ఇప్పుడు రీసౌండ్‌ ఇస్తున్నాయి. పుష్పలో అల్లు అర్జున్ నటనకు భాష, ప్రాంతాలకు అతీతంగా ప్రశంసలు దక్కాయి. పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. కమర్షియల్‌గాను కొత్త రికార్డులు సృష్టించింది పుష్ప. అల్లు అర్జున్ ఆహార్యం మొదలు.. డైలాగ్ డెలివరీ వరకు స్పెషల్‌గా కనిపించాడు. ఆయన చెప్పిన డైలాగులకు విజిల్స్ పడ్డాయి. తగ్గేదే..ల్యా అంటూ ఆయన చెప్పిన డైలాగ్ థియేటర్ బయట కూడా రీసౌండ్ ఇచ్చింది.

నేషనల్ ఫిలిం అవార్డుల్లో.. తొలి నుంచీ రేసులో నిలిచిన చిత్రం RRR. అనుకున్నట్టే అవార్డుల పంట పండించింది. ఆ సినిమాలోని నాటునాటు సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఖండాంతరాలు దాటి కీర్తి దక్కించుకుంది. నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్ నిలిచాడు.

అటు ఎన్టీఆర్, ఇటు రామ్‌చరణ్.. ఇద్దరు టాప్‌స్టార్‌లు స్క్రీన్‌ షేర్ చేసుకున్న సినిమాలో ది బెస్ట్ స్టంట్స్ అందించిన కింగ్ సాల్మన్‌కు నేషనల్ అవార్డు దక్కింది. ఇక, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో RRR చిత్రానికి పనిచేసిన శ్రీనివాస్ మోహన్‌ను కొట్టే చెయ్యి లేకుండా పోయింది.

సంగీతం, నేపథ్యగానం విషయంలోను తెలుగోడు సత్తా చాటాడు. RRR సినిమాలో ఎన్టీఆర్ అభినయించిన కొమురం భీముడో సాంగ్ అవార్డుల జ్యూరీని సైతం కట్టిపడేసింది. బెస్ట్ మేల్ సింగర్‌గా కాలభైరవ నిలిచాడు. ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్ కేటగిరీలో RRR సినిమాకు పనిచేసిన కీరవాణిని అవార్డు వరించింది. సాంగ్స్‌ విషయంలో మాత్రం పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అవార్డు దక్కించుకున్నాడు.

ఇంతేకాదు.. ఉత్తమ గేయ రచయితగా కొండపొలం సినిమాకు చంద్రబోస్‌ అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఉప్పెన భారీ వసూళ్లు సాధించింది. బెస్ట్ ఫిలిం క్రిటిక్‌గా పురుషోత్తమాచార్యులకు పురస్కారం లభించింది.

Related News

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Sekhar Bhashaa : జానీ మాస్టర్ కేసు పై సంచలన నిజాలను బయట పెట్టిన శేఖర్ భాషా..?

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Tripti dimri: ఒకే గదిలో 50 మందితో.. భరించలేకపోయా – నేషనల్ క్రష్..!

Big Stories

×