EPAPER

Himachal Pradesh News: ప్రకృతి ప్రళయం.. విరిగి పడిన కొండచరియలు..కూలిన భవనాలు..

Himachal Pradesh News: ప్రకృతి ప్రళయం..  విరిగి పడిన కొండచరియలు..కూలిన భవనాలు..
Himachal pradesh latest news

Himachal pradesh latest news(Current news from India) :

హిమాచల్ ప్రదేశ్ ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రకృతి పెను విధ్వంసం సృష్టిస్తోంది. కొండచరియలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా కులు జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పెద్ద పెద్ద భవనాలు, ఇళ్లు కుప్పకూలాయి. హిమాచల్ ప్రదేశ్ లో భవనాలు కూలిన దృశ్యాల వీడియో వైరల్ గా మారింది.


ఆ వీడియాను సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ట్విటర్ లో పోస్టు చేశారు. భారీ స్థాయిలో వాణిజ్య సముదాయాలు కూలిపోయాయని తెలిపారు. ఈ ప్రమాదాన్ని స్థానిక యంత్రాంగం ముందే గుర్తించిందని వివరించారు. ప్రజలను ముందే తరలించారని పేర్కొన్నారు.

శిథిలాల కింద చాలామంది బాధితులు చిక్కుకున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని కాపాడేందుకు NDRF బృందాలు రంగంలో దిగాయి. స్థానిక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టాయి.


మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్ కు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కొన్నిరోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతోంది. భారీ వర్షాల కారణంగా కులు-మండీని ప్రాంతాలను కలిపే రోడ్లు దెబ్బతిన్నాయి. రాకపోకలు స్తంభించాయి. వర్షాల వల్ల ఇప్పటి వరకు రూ.8,014 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది. 300 మందికిపైగా మరణించారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×