EPAPER
Kirrak Couples Episode 1

Russia : రష్యాలో విమాన ప్రమాదం.. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌ మృతి..?

Russia : రష్యాలో విమాన ప్రమాదం.. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌ మృతి..?

Russia : యెవ్ గనీ ప్రిగోజిన్.. కొంతకాలంగా ఈ పేరు రష్యాలోనేకాదు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యలో ప్రిగోజిన్ పాపులర్ అయ్యారు. రష్యా ప్రైవేట్ సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధినేతగా ఉన్నారు. ఇటీవల అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వెనక్కి తగ్గారు ప్రిగోజిన్‌. తాజాగా విమాన ప్రమాదంలో ఆయన మరణించారని సమాచారం.


ఓ ప్రైవేట్ జెట్‌ మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. విమానంలో ప్రయాణిస్తున్న 10 మంది వ్యక్తులు మరణించారు. ప్రయాణికుల జాబితాలో ప్రిగోజిన్‌ పేరు ఉందని తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన ఆ విమానంలో ప్రిగోజిన్ ఉన్నారో లేదో నిర్ధారణ కాలేదని రష్యా అత్యవసర విభాగం అధికారులు ప్రకటించారు. కూలి పోయిన జెట్ మాత్రం ప్రిగోజిన్‌దేనని నిర్ధారించారు.

మాస్కోకు ఉత్తరాన ఉన్న త్వేర్‌ రీజియన్‌లో ఎంబ్రాయర్‌ విమానం కూలిపోయిందని రష్యా విమానయాన సంస్థ రోసావియాత్సియా వెల్లడించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు.


ప్రిగోజిన్‌ ఉక్రెయిన్‌పై యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ప్రిగోజిన్ నేర చరిత్రతోనే పాపులర్ అయ్యారు.
1981లో దొంగతనం, దోపిడీ కేసుల్లో దోషిగా తేయారు. 12 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యాపారవేత్తగా మారారు.
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో రెస్టారెంట్ల నిర్వహించారు. రష్యా ప్రభుత్వ ఆహార కాంట్రాక్టులన్నీ ఆయన రెస్టారెంట్లకే దక్కాయి. ఈ సమయంలో రష్యా అధ్యక్షడు పుతిన్‌తో ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పుతిన్ కు బాగా దగ్గరై ముఖ్య అనుచరుడిగా ఎదిగారు. ప్రిగోజిన్ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఆర్థికంగా బలపడిన ప్రిగోజిన్ వాగ్నర్‌ ముఠా ఏర్పాటు చేశారు. ఈ‌ గ్రూపులో 90 శాతం మంది ఖైదీలే ఉన్నారని అమెరికా ఓ నివేదికలో పేర్కొంది. తీవ్ర నేరాలు చేసిన వ్యక్తులను తన బృందంలో చేర్చుకున్నారు. ప్రిగోజిన్‌ అగ్రరాజ్యాల వాంటెడ్‌ లిస్ట్ లోనూ ఉన్నారు.

గత జూన్‌లో పుతిన్‌పై వాగ్నర్‌ గ్రూప్ తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఒక్కరోజులోనే మళ్లీ వెనక్కి తగ్గింది. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ ప్రిగోజిన్ భేటీ అయ్యారు. ప్రిగోజిన్ కు బెలారస్‌లో ‌ ఆశ్రయం కల్పించారు పుతిన్. వాగ్నర్‌ గ్రూపు సభ్యులు రష్యా సైన్యంలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదం జరగడం అనేక అనుమానాలను కలిగిస్తోంది.

Tags

Related News

Bomb Threat: పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. అలర్ట్ అయిన అధికారులు

Nirmala Sitharaman: ఆ స్కీమ్ వెనుక భారీ అవినీతి? ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు!

Rajnath Singh Kashmir: ‘పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు కంటే ఎక్కువ అప్పు భారత్ ఇవ్వగలదు’.. కశ్మీర్‌లో రాజ్ నాథ్ సింగ్

Mallikarjun Kharge : జమ్మూ ర్యాలీలో ఖర్గేకు అస్వస్థత… మోదీని గద్దె దించేవరకు ప్రాణం పోదన్న కాంగ్రెస్ చీఫ్

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Udhayanidhi: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం

Maihar Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిది మంది స్పాట్ డెడ్!

Big Stories

×