EPAPER
Kirrak Couples Episode 1

Chandrayaan 3 Success: చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్.. జయహో భారత్..

Chandrayaan 3 Success: చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్.. జయహో భారత్..
chandrayaan-3 modi

Chandrayaan 3 Success: చంద్రయాన్‌-3 చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయింది. 17 మినిట్స్ ఆఫ్ టెర్రర్‌ను సాఫ్ట్‌గా హ్యాండిల్ చేసింది. చందమామను ముద్దాడి.. అంతరిక్షంలో భారత్ చెరగని సంతకం చేసింది. రష్యా, అమెరికా, చైనాల తర్వాత.. చండ్రుడిపై ల్యాండ్ అయిన దేశంగా.. ఇండియా పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది.


అపురూపం. అద్వితీయం. అత్యంత ఉద్వేగభరితం. వంద కోట్లకు పైగా భారతీయులు నరాలు తెగే ఉత్కంఠగా ఎదరుచూసిన క్షణం. సాయంత్రం 5.40 నుంచే అందరి గుండె వేగం పెరిగింది. ఇస్రో హెడ్ క్వార్టర్స్‌ చారిత్రక విజయం సాకారం కోసం తమ పని తాము చేసుకుపోతున్నారు. యావత్ ప్రజానీకం లైవ్‌లో ఆ దృశ్యాలు చూస్తున్నారు. క్షణ క్షణం.. హైటెన్షన్. దేవుడా.. చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని కోరిక. ఆ సమయం రానే వచ్చింది. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నిమిషం ఒక యుగంగా గడుస్తోంది. కనురెప్పలు కొట్టకుండా.. టీవీలవైపే చూస్తున్నారంతా.

ఆఖరికి ఆ క్షణం రానేవచ్చింది. సరిగ్గా 6.04 గంటలకు చంద్రయాన్ 3 ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అయింది. అంతే. అంతా కేరింతే. ఇస్రోలో హర్షాతిరేకం. సైంటిస్టుల చిరకాల స్వప్నం సాకారమైన వేళ. అందరి ముఖాల్లో ఆనందం. ఘనత సాధించిన గర్వం. భరతజాతి నిండు గౌరవాన్ని ప్రపంచానికి చాటిన సంతోషం.


ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. అహోరాత్రులు ఇస్రో సైంటిస్టులు పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. ఒక్కో అడుగు వేస్తూ.. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా.. ఓ మూవీ బడ్జెట్‌లో ఓ రాకెట్‌ను నిర్మించి.. జాబిల్లి వరకు పంపడమే కాదు.. సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ చేశారు ఇస్రో సైంటిస్టులు. విక్రమ్‌ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండయ్యింది. భారత అంతరిక్ష చరిత్రలో ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అని చెప్పాలి. మూన్‌పై సక్సెస్‌ఫుల్‌గా ల్యాండర్లను దింపిన అభివృద్ధి దేశాల సరసన.. తల ఎత్తుకొని గర్వంగా నిలుచుంది భారత్.

యావత్ దేశంలో ఆనందోత్సవం. పిల్లలు, పెద్దలు.. అంతా జిల్ జిల్ జిగా. జై భారత్.. జయహో భారత్.. జయజయహో ఇస్రో అంటూ నినాదాలు. భారతదేశం పులకించింది. ప్రపంచానికి మన సత్తా చాటింది. ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా నుంచే ఈ ప్రయోగాన్ని వీక్షించారు. ఇస్రో సైంటిస్టులకు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.

జులై 14న విక్రమ్ ల్యాండర్‌తో పాటు నింగిలోకి ఎగిరింది జీఎస్‌ఎల్వీ రాకెట్. ఆ రోజు నుంచి ఒక్కోరోజు వారికి ఒక్కో యుగంగా గడిచిందనే చెప్పాలి. 41 రోజుల పాటు.. ఒక్కో అడ్డంకిని దాటుతూ.. వడివడిగా చంద్రుడి వైపు కదిలింది విక్రమ్‌. భూమి నుంచి క్షక్ష్యను పొడిగిస్తూ.. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడం ఒక టాస్క్ అయితే.. చంద్రుడి కక్ష్యను వడివడిగా తగ్గిస్తూ.. ల్యాండ్‌ చేయడం అతి పెద్ద టాస్క్‌. వీటన్నింటికి మించి చివరి 17 నిమిషాలైతే.. దేశం మొత్తాన్ని మునివేళ్లపై నిల్చునేలా చేసిందని చెప్పాలి. సినిమా లాంగ్వేజ్‌లో చెప్పాలంటే.. ప్రతి సీన్‌ క్లైమాక్స్‌లా ఉంది. క్లాక్‌లో ఒక్కో సెకన్‌ మారుతుంటే.. ఎప్పుడేం జరుగుతుందో అని టెన్షన్ పడిపోయారు అంతా. ఇక ఇస్రో సైంటిస్టులకైతే ఏసీ రూమ్‌ల్లో కూడా చెమటలు పట్టించే సీన్‌ అది.

చంద్రయాన్‌-2 ఫెయిల్యూర్.. మనకంటే అత్యాధునిక టెక్నాలజీ ఉన్న రష్యా లూనా-25 మిషన్ ఆఖరి నిమిషంలో ఫెయిల్. సక్సెస్ సాధిస్తామా? చివరి నిమిషంలో చంద్రయాన్‌-2 సీన్‌ రీపిట్‌ అవుతుందా? అని బుర్రా నిండా అన్ని ఆలోచనలే.. మరోవైపు ఎలాగైనా సక్సెస్‌ అవ్వాలని మనసులో కోరుకొని వారండరు. రఫ్‌ బ్రేకింగ్ ఫేజ్.. ఫైన్ బ్రేకింగ్‌ ఫేజ్‌.. ఇలా ఒక్కో ఫేజ్‌ సైంటిస్టులతో పాటు… టీవీల ముందు కూర్చొన్న భారతీయుల హార్ట్‌ బ్రేక్‌ చేసేంత పనిచేశాయి. ఒక్క చిన్న తప్పు జరిగినా.. మళ్లీ కొన్నేళ్ల పాటు ఆగాల్సిందే. కానీ అలాంటిదేం జరగలేదు. 17 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌ ఫేజ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది విక్రమ్‌. జాబిల్లిపై నిప్పులు చిమ్ముకుంటూ ల్యాండ్‌ అయ్యి దుమ్ము రేపింది.

Related News

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Shock To KCR: కేటీఆర్‌కి మాజీ BRS ఎమ్మెల్యేలు షాక్.. కారణం ఇదేనా?

Death of Nasralla: 80 టన్నుల బాంబులతో.. నస్రల్లాను ఎలా చంపారంటే..!

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

Big Stories

×