EPAPER
Kirrak Couples Episode 1

Hawaii: ఊరంతా కాలి బూడిద.. ఆ ఇల్లు మాత్రం సేఫ్.. ఎందుకంటే?

Hawaii: ఊరంతా కాలి బూడిద.. ఆ ఇల్లు మాత్రం సేఫ్.. ఎందుకంటే?
hawaii wildfires house

Hawaii: ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. కారుచిచ్చుకు నగరమంతా కాలి బూడిదైంది. చెట్లు, ఇళ్లు, వాహనాలు, వస్తువులు.. సమప్తం అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇప్పుడా ప్రాంతం.. స్మశానంతో సమానం.


అమెరికా, హవాయి దీవిలోని లహైనా. రిసార్టు నగరంగా ఫేమస్. నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుండేది. సడెన్‌గా మీదపడిన రాకాసి కార్చిచ్చు.. వేగంగా వ్యాపించింది. సర్వం తుడిచిపెట్టేసింది. నగరాన్ని బూడిద కుప్పగా మార్చేసింది. వందేళ్లలో ఎన్నడూ చూడని విపత్తు.. వందమందికి పైగా బలి తీసుకుంది.

అంతటి బీభత్సంలోనూ ఓ ఇల్లు మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉండటం ఆసక్తికరంగా మారింది. పై ఫోటోలో.. రెడ్ కలర్ రూఫ్‌తో ఉన్నదే ఆ ఇల్లు.


ఆ ఇంటి చుట్టూ చూడండి.. ఎలా కాలిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయో. మధ్యలో దర్పంగా.. రాజసంగా.. ఎర్ర రం గులో ఠీవిగా నిలిచింది ఈ ఒకే ఒక్క ఇల్లు. ఆ బిల్డింగ్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. కనీసం మసి కూడా అంటుకోలేదు. ఊరంతటినీ కబలించిన ఆ అగ్ని పిశాచి.. ఈ ఇంటిని మాత్రం ఏమీ చేయలేకపోవడం విశేషం.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫొటోషాప్‌ అస్సలే కాదు. పక్కా రియల్ పిక్స్.

అగ్నిప్రమాద సమయంలో ఈ ఇంటి ఓనర్స్ అందులో లేరు. విషయం తెలిసి వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. తమ ఇల్లే ఇలా సేఫ్‌గా ఉండటానికి ఓ కారణం కావొచ్చని చెబుతున్నారు. అదేంటంటే…

ఆ పాతకాలం ఇంటిని ఇటీవలే కొన్నారట ఆ ఓనర్స్. రెనొవేషన్‌లో భాగంగా.. ఆస్ఫాల్ట్ పైకప్పును తొలగించి.. భారీ బరువుండే మెటల్‌ రూఫ్‌ను ఏర్పాటు చేశారట. ఇంటి చుట్టూ గార్డెన్ ఉంటే.. దాన్ని కూడా తీసేసి.. బండలతో ఫ్లోరింగ్ చేయించారట. ఇదే ఇప్పుడు తమ ఇంటిని కాపాడి ఉండొచ్చని అంటున్నారు.

కార్చిచ్చు కమ్మేసినప్పుడు.. అగ్నికీలలు ఒక ఇంటి నుంచి మరో ఇంటిపైకి ఎగిరిపడి.. అలా అలా ఊరంతా తగలబడింది. అయితే, ఈ ఇంటిపైనా నిప్పు కణికలు పడినా.. మెటల్ రూఫ్ కావడంతో అంటుకోలేదు. మంటలు చెలరేగలేదు. ఇల్లు సేఫ్ అయిందని భావిస్తున్నారు. లక్ అంటే ఇట్లుండాలె అంటున్నారంతా.

Related News

Israel Bomb Hezbollah: దారుణమైన చావు.. హిజ్బుల్లా చీఫ్ హత్యకు 900 కేజీ అమెరికా బాంబు ఉపయోగించిన ఇజ్రాయెల్..

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

Lebanon Beirut : బేరుట్‌లో కూలిపోయిన ఇళ్లు.. బాంబుల భయంతో రోడ్లపై నిద్రిస్తున్న వేలాది ప్రజలు..

Jaishankar at UNGA: పాకిస్తాన్ కు ఇచ్చి పడేసిన ఇండియా.‌. అందరి ముందు పరువు పోయిందిగా!

Mehbooba Mufti: హెజ్బుల్లా చీఫ్ హత్యకు వ్యతిరేకంగా మెహ్‌బూబా ముఫ్తీ నిరసన.. ఎన్నికల ప్రచారం నిలిపివేత..

Hezbollah Chief Killed: హెజ్బొల్లాకు భారీ షాక్.. చీఫ్ హసన్ నస్రల్లా మృతి

NASA Will Launch Crew-9 Today: ఈ మిషన్ సక్సెస్ అయితే చాలు.. సునీతా విలియమ్స్ భూమి మీదికి వచ్చినట్లే..

Big Stories

×