EPAPER

TS rain alert : మరో 3 రోజులు వర్షాలు.. ఎక్కడెక్కడంటే?

TS rain alert : మరో 3 రోజులు వర్షాలు.. ఎక్కడెక్కడంటే?
Telangana weather news telugu

Telangana weather news telugu(Telangana news today):

తెలంగాణ వాతావరణం చల్లచల్లగా హాయిహాయిగా మారింది. శుక్రవారం నుంచి వానలు కురుస్తున్నాయి. శనివారం, ఆదివారం భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత కూడా ఓ మోస్తారు వానలు పడతాయట.


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ప్రస్తుత వర్షాలకు కారణం. రాబోయే మూడు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా చేల్పూర్‌లో 7.95, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 7.6, భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 5.76 సెం.మీ. వర్షం పడింది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 5.6, ఏటూరునాగారంలో 5.1, వెంకటాపురంలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.


మంచిర్యాల, కుమురంభీమ్‌-ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. హైదరాబాద్‌తో పాటు శివార్లలోనూ తేలికపాటి జల్లులు కురిశాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో స్వర్ణ ప్రాజెక్టు 2 గేట్లు తెరిచారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఒక గేటు నుంచి నీటిని వదులుతున్నారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×