EPAPER

Revanth Reddy Comments on KCR: సెక్యూరిటీ లేకుండా కేసీఆర్ వస్తారా? భయపడేదేలే.. రేవంత్ ఛాలెంజ్..

Revanth Reddy Comments on KCR: సెక్యూరిటీ లేకుండా కేసీఆర్ వస్తారా? భయపడేదేలే.. రేవంత్ ఛాలెంజ్..
Revanth Reddy latest speech

Revanth Reddy latest speech(Political news today telangana):

రాష్ట్ర ప్రభుత్వం తనకు సెక్యూరిటీ తగ్గించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. కోర్టు చెప్పినా ప్రభుత్వం తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదన్నారు. తాను ఎంపీగా ఉన్నానని.. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తనకు సెక్యూరిటీ ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.


తాను ప్రజల మనిషినని.. తనకు సెక్యూరిటీతో పనిలేదన్నారు రేవంత్ రెడ్డి. తాను సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వస్తానని.. అదే సీఎం కేసీఆర్‌ ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు రాగలరా? అని ప్రశ్నించారు.

తనను ఓడించడానికి సీఎం కేసీఆర్‌ పోలీసులను వాడుకున్నారని ఆరోపించారు. సెక్యూరిటీ విషయంలో తనను భయపెట్టాలని చూస్తే భయపడే వాడిని కాదన్నారు. లక్షలాది మంది కార్యకర్తలే తన సైన్యమని.. వాళ్లే తనకు సెక్యూరిటీ అన్నారు.


ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్న పోలీస్ అధికారులను వదిలిపెట్టబోమని మరోసారి హెచ్చరించారు రేవంత్‌రెడ్డి. వారి పేర్లు రెడ్ బుక్‌లో రాస్తున్నామని.. అధికారంలోకి వచ్చాక చర్యలు ఉంటాయని అన్నారు. తాను మాట్లాడుతున్నది ప్రభాకర్‌రావు, నర్సింగరావు, భుజంగరావు, రాధాకిషన్‌రావు.. లాంటి పోలీస్ అధికారుల గురించి మాత్రమేనని.. వారికి రాజకీయాలతో పనేంటని నిలదీశారు. మీడియాతో చిట్ చాట్‌ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×