EPAPER

Ustaad movie review : థియేటర్లలో ఉస్తాద్ సందడి.. మూవీ ఎలా ఉందంటే..?

Ustaad movie review : థియేటర్లలో ఉస్తాద్ సందడి..  మూవీ ఎలా ఉందంటే..?
Ustaad movie review Telugu

Ustaad movie review telugu(Today tollywood news):

మ‌త్తువ‌ద‌ల‌రా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహా కోడూరి.. తొలి ప్రయత్నంలో హిట్ కొట్టాడు. ఆ త‌ర్వాత ఈ యువహీరో నటించిన మూవీస్ ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ ప్రయోగాలు చేస్తూనే వస్తున్నాడు. వైవిధ్య కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఉస్తాద్‌గా థియేటర్లలో సందడి చేస్తున్నాడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. రాజ‌మౌళి, నాని లాంటి ప్ర‌ముఖులు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో ఉస్తాద్ పై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఉస్తాద్ ఆకట్టుకున్నాడా?


క‌థ: మ‌న‌సుకు న‌చ్చిన పనినే చేసే యువకుడు సూర్య‌ (శ్రీసింహా)కు చిన్న‌ప్పుడే తండ్రి మ‌ర‌ణిస్తాడు. త‌ల్లే (అను హాస‌న్‌) పెంచి పెద్ద చేస్తుంది. సూర్య‌కు ఎత్తైన ప్ర‌దేశాలంటే ఎంతో భ‌యం. జీవితంపై క్లారిటీ ఉండ‌దు. పాత కాలం నాటి బైక్‌ను కొంటాడు. ఆ బైక్ కు ఉస్తాద్ అని పేరు పెడతాడు. ఆ బైక్ వ‌ల్లే మేఘ‌న (కావ్యా క‌ల్యాణ్ రామ్‌) పరిచయం అవుతుంది. ఇద్ద‌రూ ప్రేమలో పడతారు.

ఆ తర్వాత సూర్య‌ పైల‌ట్ అవ్వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంటాడు. ఎత్తైన ప్ర‌దేశాలంటే భ‌య‌ప‌డే సూర్య త‌న క‌ల‌ను ఎలా నెర‌వేర్చుకున్నాడు? ఈ క్ర‌మంలో ఎదురైన స‌వాళ్లేంటి? ప్రేమ‌లో వ‌చ్చిన చిక్కులేంటి? బైక్ మెకానిక్ బ్ర‌హ్మం (ర‌వీంద్ర విజ‌య్‌), పైల‌ట్‌ జోసెఫ్ డిసౌజా (గౌత‌మ్ మేన‌న్‌) పాత్రలు ఏంటి ? ఈ అంశాలన్నీ వెండితెరపై చూడాల్సిందే.


సూర్య కాలేజ్ లైఫ్.. మేఘ‌న‌తో ప్రేమ ప్ర‌యాణంతో ఫస్టాఫ్ సాగుతుంది. పైలట్ అవ్వాలన్న త‌న క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు సూర్య ఏం చేశాడు? ప్రేమ‌ను ఎలా సాధించాడు. ఇలా సెకండాఫ్ సాగుతుంది. అయితే క‌థ‌నం నెమ్మదిగా సాగడం మైనస్ పాయింట్. ల‌వ్ ట్రాక్‌ నేచురల్ గా ఉండటం ప్లస్ పాయింట్. ఉస్తాద్‌కు.. బైక్ మెకానిక్ బ్ర‌హ్మంకు మ‌ధ్య వ‌చ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇటర్వెల్ బ్యాంగ్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది. చివరివరకు అదే ఆసక్తిని కలిగించడంలో దర్శకుడు ఫణిదీప్ ఫెయిల్ అయ్యాడు.

సూర్య పాత్ర‌లో శ్రీసింహా మెప్పించాడు. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. మేఘ‌న పాత్ర‌లో కావ్యా కల్యాణ్ రామ్ నేచురల్ గా కనిపించింది. ప్రేమ స‌న్నివేశాలు చాలా స‌హ‌జంగా పండాయి. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. హీరో త‌ల్లిగా అను హాస‌న్ మెప్పించారు. గౌత‌మ్ మేన‌న్, వెంక‌టేష్ మ‌హా ప్ర‌త్యేక పాత్ర‌ల్లో మెరిశారు. అకీవా అందించిన మ్యూజిక్, నేపథ్య సంగీతం ఫర్వాలేదు. ప‌వ‌న్ కుమార్ ఛాయాగ్ర‌హణం బాగుంది. ఓవరాల్ గా ఉస్తాద్ పర్వాలేదనిపిస్తాడు.

Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×