EPAPER

Bhola Shankar Review : ఫ్యాన్స్ లో పూనకాలు లోడ్ అయ్యాయా? భోళా శంకర్ మెప్పించాడా?

Bhola Shankar Review : ఫ్యాన్స్ లో పూనకాలు లోడ్ అయ్యాయా? భోళా శంకర్ మెప్పించాడా?
Bhola Shankar Movie Review

Bhola Shankar Movie Review(Latest tollywood Updates) : 

ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అదే ఊపులో తమిళ మూవీ వేదాళంకు రీమేక్ గా రూపొందిన భోళా శంకర్ గా ఇప్పుడు సందడి చేస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మరి ప్రేక్షకులను భోళా శంకర్ మెప్పించాడా? ఫ్యాన్స్ లో పూనకాలు లోడింగ్ చేశాడా? ఈ సినిమా టాక్ ఎలా ఉంది.? ఆ విషయాలు తెలుసుకుందాం.


కథ: శంకర్ (చిరంజీవి) తన చెల్లి మహాలక్ష్మి (కీర్తి సురేష్)తో కలిసి కోల్ కతాకు వెళ్తాడు. బతుకుతెరువు కోసం టాక్సీ నడుపుతూ ఉంటాడు. సిటీలో ఓ మాఫియా గ్యాంగ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి అమ్మేస్తుంది. ఈ మాఫియాను పోలీసులు పట్టుకోలేకపోతారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు జరుగుతాయి. శంకర్ ఆ మాఫియాను టార్గెట్ చేస్తాడు. అసలు శంకర్ ఆ మాఫియాను ఎందుకు టార్గెట్ చేశాడు? గతంలో ఆ మాఫియాతో శంకర్ కు ఉన్న సంబంధం ఏంటి ? మధ్యలో లాయర్ లాస్య (తమన్నా) పాత్ర ఏంటి ? చివరకు శంకర్ ఆ మాఫియాను అంతం చేశాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

హైఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో భోళా శంకర్ తెరకెక్కింది. మెగాస్టార్ మాస్ పాత్రలో మరోసారి మెప్పించాడు. చిరంజీవి పాత్రలోని షేడ్స్ ఆకట్టుకుంటాయి. యాక్షన్ సీన్స్ అదుర్స్ అనిపిస్తాయి. మెగాస్టార్ కామెడీ టైమింగ్ అదిరింది. తమన్నాతో సాగే సీన్స్ మెప్పిస్తాయి. ప్లాష్ బ్యాక్ సినిమాకు ప్లస్ పాయింట్.


చిరు చెల్లి పాత్రకు కీర్తి సురేష్ ప్రాణం పోసింది. తమన్నా పాత్ర గ్లామర్ కే పరిమితమైంది. సాంగ్స్ లోనే మెరిసింది. అతిధి క్యారెక్టర్ లో సుశాంత్ కనిపించాడు. కీలక పాత్రలో మురళీ శర్మ నటన ఆకట్టుకుంది. శ్రీముఖికి తన నటనతో మెప్పించింది. రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిషోర్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

కథనం నెమ్మదిగా సాగడం భోళా శంకర్ కు పెద్ద మైనస్ పాయింట్. సెకెండ్ హాఫ్ లో పాత్రల మధ్య ఎమోషన్స్ అతిగా అనిపించేలా ఉన్నాయి. కీలక సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ రొటీన్ గా సాగాయి. దర్శకుడు మెహర్ రమేష్ ఆకట్టుకునే విధంగా భోళా శంకర్ ను మలచలేకపోయాడు. కథే మైనస్ పాయింట్. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా సాగకపోవడంతో ప్రేక్షకుల సహనానికి కాస్త పరీక్షే.

మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ పాస్ మార్కులే తెచ్చుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని కీలక సన్నివేశాల్లో ఆకట్టుకుంది. డడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ సూపర్. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా మెగాస్టార్ నటన, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఫ్యాన్స్ ఓసారి చూడొచ్చు. సాధారణ ప్రేక్షకులకు భోళాశంకర్ ఓ రోటీన్ మాస్ మూవీలా అనిపిస్తుంది.

Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×