EPAPER
Kirrak Couples Episode 1

Latest Tomato Price : గుడ్ న్యూస్ .. టమాటా ధర తగ్గింది.. రైతుబజార్లలో ఎంతో తెలుసా?

Latest Tomato Price : గుడ్ న్యూస్ .. టమాటా ధర తగ్గింది.. రైతుబజార్లలో ఎంతో తెలుసా?

Tomato Price : టమాటా కొన్నిరోజులుగా అంత్యంత ఖరీదైన కాయగూర. రేటు చూస్తే జనాల ముఖాలు ఎర్రగా వాచిపోయేవి. దిగుబడి భారీగా తగ్గడంతో మార్కెట్లలోకి వచ్చే సరకు తగ్గిపోయింది. దీంతో డిమాండ్ పెరిగి రేటు కొండెక్కింది. సామ్యాడికి చుక్కలు చూపించింది. పేదలు టమాటాలు కొనడం మానేశారు. దాదాపు రెండునెలలుగా ఇదే పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో టమాటా రేటు ఇన్నాళ్లపాటు స్థిరంగా లేదు. ఒకదశలో కిలో టమాటా రేట్ రూ. 300 కూడా పలికింది. చికెట్ రేట్ ను బీట్ చేసింది.


ఇప్పడిప్పుడే క్రమంగా టమాటా రేటు తగ్గుతోంది. మార్కెట్లోకి సరుకు రాక పెరుగుతోంది. రైతుబజారులో ధర రూ. 100 దిగువకు వచ్చేసింది. ఇప్పుడు కిలో టమాటా రూ.63లకే దొరుకుతోంది. బయట మార్కెట్‌లో రూ.120 నుంచి రూ.140 వరకు ఉంది. 10 రోజుల క్రితం హైదరాబాద్ కు 850 క్వింటాళ్ల సరకు వచ్చింది. కానీ సోమవారం 2,450 క్వింటాళ్ల టమాటా హోల్‌సేల్‌ మార్కెట్‌కు వచ్చింది.

అనంతపురం, చిత్తూరు, కర్ణాటకలో దిగుబడి పెరిగింది. అలాగే రంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌ జిల్లాలు , చేవెళ్ల, నవాబ్‌పేట నుంచి కూడా మార్కెట్లకు టమాటా భారీగా వచ్చింది. దీంతో ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు నాటికి కేజీ రూ.50లోపు దొరికే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.


హోల్‌సేల్‌ మార్కెట్ లో డిమాండ్‌ ఆధారంగా అధికారులు ధరలు నిర్ణయిస్తారు. నాణ్యతను బట్టి సరకును విభజిస్తారు. దాని ఆధారంగా ధర నిర్ణయించి రైతుబజార్లలో విక్రయాలకు ఆదేశిస్తారు. కానీ వ్యాపారులు మాత్రం ఒకే ధరకు అమ్ముతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కేజీ టమాటా రూ. 63గా రైతుబజార్లలో బోర్డు పెట్టారు. కానీ దుకాణదారులు కిలో రూ.100కు తగ్గకుండా అమ్ముతున్నారని సామాన్యులు మండిపడుతున్నారు.

Tags

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×