EPAPER
Kirrak Couples Episode 1

Ambati on Pawan Kalyan ‘BRO’: ప్యాకేజీ బ్రో.. పవన్‌పై అంబటి సినిమా.. త్రివిక్రమ్‌కు వార్నింగ్

Ambati on Pawan Kalyan ‘BRO’: ప్యాకేజీ బ్రో.. పవన్‌పై అంబటి సినిమా.. త్రివిక్రమ్‌కు వార్నింగ్
Ambati Rambabu on bro movie

Ambati Rambabu on bro movie(AP politics): బ్రో సినిమా పొలిటికల్‌గా బ్లోఅవుట్ అవుతోంది. శ్యాంబాబు వర్సెస్ రాంబాబు ఎపిసోడ్ ఫుల్ జోష్ మీదుంది. తనలాగే డ్రెస్ వేసి, తనలాగే డ్యాన్స్ చేసిన ఆ శ్యాంబాబును తానేనంటూ, తనను టార్గెట్ చేశారంటూ అంబటి ఫైర్ అవుతున్నారు. అంతలేదు.. ఆ శ్యాంబాబు రాంబాబు కాదని.. ఆయన్ను అనుకరించేంత సీన్ లేదని.. అతనెవరో తెలీదని నటుడు పృథ్వీ మరింత నిప్పు రాజేశారు. ఇన్నాళ్లూ వైసీపీలో ఉన్న పృథ్వీనే తానెవరో తెలీదని చెప్పడం అంబటి ఇగోను బాగా హర్ట్ చేసింది. మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి.. బ్రో సినిమాతో పాటు పవన్‌ కల్యాణ్ పెళ్లిళ్లు, రెమ్యునరేషన్‌, త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌పై విమర్శలు చేశారు. తాను పవన్‌పై ఓ సినిమా చేస్తానంటూ అంబటి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఇంతకీ రియల్ రాంబాబు ఏమన్నారంటే….


బ్రో సినిమా ఫ్లాప్ అయిందని.. కలెక్షన్లు తగ్గుతుండటం వల్లే.. పృథ్వీతో తనపై విమర్శలు చేయిస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. తనపై కాంట్రవర్సీ క్రియేట్ చేసి సినిమాకు ప్రమోషన్ చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. బ్రో మూవీ వరకూ 55.27 కోట్ల షేర్ రాబట్టిందని.. పవన్ రెమ్యునరేషనే 50 కోట్లకు పైగా తీసుకున్నారని.. అందుకే మరిన్ని వసూళ్ల కోసం తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తనను విమర్శించాలనే.. పవన్‌, త్రివిక్రమ్‌ కలిసి అలాంటి క్యారెక్టర్ క్రియేట్ చేశారని తప్పుబట్టారు.

వాహనానికి వారాహి అమ్మవారి పేరు పెట్టుకొని.. దాన్ని ఎక్కి, కాళ్లతో తొక్కుతూ.. అబద్ధాలు, విమర్శలు చేస్తున్నారని.. అందుకే వారాహి అమ్మవారి శాపం తగిలి.. సినిమా ఫ్లాప్ అయిందని అన్నారు. ఇకపైనా పవన్ సినిమాలేవీ ఆడబోవని చెప్పారు.


నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌‌కు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉన్నాయని.. చంద్రబాబు, అతని ముఠా సభ్యులు యూఎస్‌లో డబ్బులు కలెక్ట్‌ చేసి విశ్వప్రసాద్‌కు ఇస్తున్నారని.. ఆ డబ్బులను పవన్‌కు ఇచ్చి సినిమా పేరుతో.. బ్లాక్ మనీని వైట్ చేస్తున్నారని.. ఆ విధంగా ప్యాకేజీ అందిస్తున్నారని ఆరోపించారు అంబటి రాంబాబు. తాను తీసుకున్న రెమ్యునరేషన్‌కు పవన్ ట్యాక్స్ కడుతున్నారా? అని ప్రశ్నించారు.

పవన్‌పై తానూ ఓ సినిమా తీయబోతున్నట్టు పరోక్షంగా సెటైర్లు వేశారు రాంబాబు. హీరోగా రాణించి.. మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని.. రాజకీయాల్లోకి వచ్చిన ఓ వ్యక్తి కథతో సినిమా చేయాలనుకుంటున్నామని చెప్పారు. ‘నిత్య పెళ్లి కొడుకు’, ‘పెళ్లిళ్లు పెటాకులు’, ‘తాళి-ఎగతాళి’, ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు’, బ్రో లాగా మ్రో (మ్యారేజెస్‌, రిలేషన్స్‌, అఫెండర్‌) ఇలా పలు టైటిల్స్‌ అనుకుంటున్నామని అన్నారు.

ఈ సందర్బంగా టాలీవుడ్ నటులు, దర్శకనిర్మాతలకు, త్రివిక్రమ్ లాంటి రచయితలకు వార్నింగ్ ఇచ్చారు అంబటి రాంబాబు. మళ్లీ మళ్లీ ఇలాంటి సీన్స్ తీస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.

Related News

Tirupati Laddu Row: తిరుమలకు వెళ్లిన భూమన.. లడ్డూ కల్తీలో తమ తప్పులేదని ప్రమాణం చేసేందుకు..

Anjaneyulu: జగన్… సిట్‌తో పాపాల పుట్ట పగలడం ఖాయం: జీవీ ఆంజనేయులు

Subramanian Swamy: తిరుమల లడ్డూ వివాదం.. స్వామిని దించిన జగన్, సుప్రీంలో పిటిషన్

Target Dwarampudi: ద్వారంపూడి చిక్కినట్టేనా? కాకినాడలో షాపుల కూల్చివేత

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ

TTD Conduct On Hhomam: తిరుమలలో హోమం, నాలుగు గంటలపాటు..

Maredumilli Tour: విషాదాన్ని నింపిన మారేడుమిల్లి టూర్.. జలపాతంలో గల్లంతై మెడికోలు మృతి

Big Stories

×