EPAPER
Kirrak Couples Episode 1

Dil Raju : తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు.. దిల్ రాజు ప్యానల్ గెలుపు..

Dil Raju : తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు.. దిల్ రాజు ప్యానల్ గెలుపు..

Dil Raju : తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలేమి రాలేదు. ఊహించిన విధంగానే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్యానెల్ సునాయాసంగా విజయం సాధించింది. దిల్ రాజు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్‌గా ప్రసన్న కుమార్ ను ఎన్నుకున్నారు.మొత్తం 48 ఓట్లలో దిల్ రాజుకు 31 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ప్రెసిడెంట్‌గా గెలిచారు.


ప్రొడ్యూసర్స్ సెక్టార్ లో మొత్తం ఓట్లు 891 ఉండగా.. దిల్ రాజు ప్యానల్ కు 563 ఓట్లు వచ్చాయి. సి. కల్యాణ్ ప్యానల్ కు 497 ఓట్లు మాత్రమే పడ్డాయి. ప్రొడ్యూసర్ సెక్టార్ లో 12 మంది సభ్యులకుగాను దిల్ రాజు ప్యానల్ నుంచి ఏడుగురు విజయం సాధించారు. దిల్ రాజు , దామోదర ప్రసాద్, వడ్లపాటి మోహన్ , పద్మిని, స్రవంతి రవికిషోర్ , యలమంచిలి రవి, మోహన్ గౌడ్ ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి గెలిచారు. స్టూడియో సెక్టార్ లో నలుగురు సభ్యులుకుగాను.. ముగ్గురు దిల్ రాజు ప్యానల్ నుంచి విజయం సాధించారు.

డిస్టిబ్యూటర్స్ సెక్టార్ లో మాత్రం రెండు ప్యానల్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇందులో దిల్ రాజు, సి. కల్యాణ్ ప్యానళ్ల నుంచి ఆరుగురు సభ్యుల చొప్పున గెలుపొందారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్ లో చెరో 8 మంది సభ్యులు గెలిచారు.


Related News

Rajinikanth: రజినీకాంత్ ను పరామర్శించిన సీఎం.. కాల్ చేసి మరీ..

Allu Arjun: అల్లు రామలింగయ్య జయంతి.. నివాళులు అర్పించిన అల్లు అర్జున్

Devara 2: మూవీలో ఈ హింట్‌ను గమనించారా.? సీక్వెల్ మొత్తం బ్లడ్ బాత్ పక్కా..

Srinu Vaitla: వెంకీట్రైన్ ఎపిసోడ్.. స్క్రిప్ట్ లో లేదు.. వాళ్లకే థాంక్స్ చెప్పాలి

Thalapathy69: విజయ్ చివరి సినిమా.. బాలయ్య హిట్ సినిమాకు రీమేక్ అని మీకు తెలుసా.. ?

Rajinikanth: తలైవా.. ఇక సినిమాలకు దూరమైతే మంచిదేమో..

Tollywood: సినిమా నచ్చకుంటే డబ్బు వాపస్ అంటున్న యాటిట్యూడ్ స్టార్.. నిజమేనా..?

Big Stories

×