EPAPER
Kirrak Couples Episode 1

TFCC Election : ఉత్కంఠగా ఫిలిం ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ ఎన్నికలు.. దిల్‌ రాజు, సి. కల్యాణ్‌ ప్యానెల్స్ మధ్య తీవ్ర పోటీ..

TFCC Election : ఉత్కంఠగా ఫిలిం ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ ఎన్నికలు.. దిల్‌ రాజు, సి. కల్యాణ్‌ ప్యానెల్స్ మధ్య తీవ్ర పోటీ..

TFCC Election : తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆసక్తిగా జరుగుతున్నాయి. వారంరోజులపాటు హోరాహోరీగా ప్రచార సాగింది. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. దిల్‌ రాజు, సి. కల్యాణ్‌ ప్యానెల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించారు. 6 గంటలకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌ నుంచి 16 మంది ఈసీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు.  


ఫిలిం ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో అనే 4 సెక్టార్స్ ఉన్నాయి. నిర్మాతల సెక్టార్‌ నుంచి 1567 ఓట్లు ఉండగా.. 891 డిస్ట్రిబ్యూటర్ల నుంచి 509 ఓట్లగాను 380, స్టూడియోల సెక్టార్ నుంచి 98 మంది ఓట్లగానూ.. 68 ఓట్లు పోలయ్యాయి.

మరోవైపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఇంత హాట్ హాట్‌గా జరగడానికి దిల్ రాజే కారణమని కొందరు అంటున్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉండగానే దిల్ రాజు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పాటు చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది. కౌన్సిల్, గిల్డ్ నిర్ణయాలకు పొంతనలేదు. దీంతో టాలీవుడ్ రాజకీయాలకు నెలవుగా మారింది.


2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు కూడా పెద్ద వివాదాన్ని రాజేశాయి. అప్పుడు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పానెల్స్ హోరాహోరీగా పోటీపడ్డాయి. సాధారణ ఎన్నికలకు మించిన రాజకీయం నడిచింది. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఇలా టాలీవుడ్ పరువు బజారుకి ఈడ్చారు. ఎన్నికల రోజు గొడవలు కూడా జరిగాయి. మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలవడంతో.. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయిని, సరిగ్గా పోలింగ్‌ నిర్వహించలేదని ఆరోపించారు ప్రకాష్ రాజ్. ఆయన ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులు రాజీనామా చేయడంతో పెద్ద హైడ్రామానే నడిచింది.

తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు మాటల యుద్ధానికి దారి తీశాయి. సి.కళ్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నాయి. దిల్ రాజు ఎన్నికల ప్రచారం తీరు నచ్చని సి.కళ్యాణ్ ఆయనపై ధ్వజమెత్తారు. ఆయన నిర్మాతలకు చేసిందేమీ లేదని.. కేవలం వ్యాపారం కోసమే ఎన్నికల్లో నిలబడ్డారని సి.కళ్యాణ్‌ అన్నారు. 20 మంది పెద్ద నిర్మాతల కోసం పని చేస్తున్నారని.. చిన్న నిర్మాతల సమస్యలను ఏనాడు పట్టించుకోలేద విమర్శించారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ డబ్బులు గిల్డ్ వాళ్లు దోచుకుంటున్నారని.. చిన్న నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్‌ను దిల్ రాజు తొక్కేసి పరిశ్రమలో లేకుండా చేశారని ఆరోపించారు.

దిల్ రాజు ఒక్కో విభాగంపై పట్టుసాధిస్తూ వస్తున్నారు. దిల్ రాజుకు టాలీవుడ్ లో తిరుగులేదు. తాను అనుకున్నదే చేస్తారు. పరిశ్రమను శాసిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువైపోయాయి. 2023 సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రం విడుదలను అడ్డుకోవాలని చూసింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. కానీ దిల్ రాజు తన మాట నెగ్గించుకున్నారు. ఇటు పరిశ్రమపై అటు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై పట్టు సాధించి తిరుగులేని శక్తిగా మారారు. ఇది పరిశ్రమలో ఓ వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రేస్‌ లో ఉన్న తాజాగా దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ రాజకీయ నాయకులతో దిల్ రాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంటుంది. దీనికి బలం చేకూర్చేలా కీలక వ్యాఖ్యలు చేశారు దిల్‌రాజు. తాను ఏ రాజకీయ పార్టీ తరపున నిలబడినా ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కానీ తన ప్రాధాన్యత సినిమా రంగానికే ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో కూడా అందరి కోరిక మేరకే తాను పోటీ చేశానని స్పష్టం చేశారు.

Related News

Rajinikanth: రజినీకాంత్ ను పరామర్శించిన సీఎం.. కాల్ చేసి మరీ..

Allu Arjun: అల్లు రామలింగయ్య జయంతి.. నివాళులు అర్పించిన అల్లు అర్జున్

Devara 2: మూవీలో ఈ హింట్‌ను గమనించారా.? సీక్వెల్ మొత్తం బ్లడ్ బాత్ పక్కా..

Srinu Vaitla: వెంకీట్రైన్ ఎపిసోడ్.. స్క్రిప్ట్ లో లేదు.. వాళ్లకే థాంక్స్ చెప్పాలి

Thalapathy69: విజయ్ చివరి సినిమా.. బాలయ్య హిట్ సినిమాకు రీమేక్ అని మీకు తెలుసా.. ?

Rajinikanth: తలైవా.. ఇక సినిమాలకు దూరమైతే మంచిదేమో..

Tollywood: సినిమా నచ్చకుంటే డబ్బు వాపస్ అంటున్న యాటిట్యూడ్ స్టార్.. నిజమేనా..?

Big Stories

×