EPAPER
Kirrak Couples Episode 1

Big tv on Manipur incident: ఆ మణిపూర్ నగ్న మహిళల గ్రామం నుంచి.. బిగ్ టీవీ డేరింగ్ రిపోర్ట్..

Big tv on Manipur incident: ఆ మణిపూర్ నగ్న మహిళల గ్రామం నుంచి.. బిగ్ టీవీ డేరింగ్ రిపోర్ట్..
Big TV ground report Manipur

Big TV ground report Manipur(Telugu flash news): మణిపూర్‌ హింస ఏకంగా దేశాన్ని షేక్ చేస్తోంది. మహిళల్ని నగ్నంగా ఊరేగించిన మయితీలను నరరూప రాక్షసులుగా చెప్తున్నారు. మహిళల్ని నగ్నంగా ఊరేగించిన గ్రామం ఎక్కడుంది? ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేశంలో ఏ మీడియా కూడా చూపించలేకపోతోంది. బాధితురాలి ఇంటి దగ్గర నుంచి సాహసోపేతంగా గ్రౌండ్‌ రిపోర్టింగ్ చేసింది బిగ్ టీవీ.


అయితే, తమ గ్రామంలోకి మీడియా రావడాన్ని సహించలేకపోయారు స్థానికులు. అక్కడి నుంచి రిపోర్టింగ్ చేస్తున్న బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్‌ను, కెమెరామెన్ సంతోష్‌ను, కారు డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారు. కొట్టుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లి చీకటి గదిలో పడేశారు. చిత్రహింసలు పెట్టడం షాకింగ్ పరిణామం.

మారణహోమం రగులుతున్న మణిపూర్‌ నుంచి నాలుగు రోజులుగా రిపోర్టింగ్ చేస్తున్నారు బిగ్ టీవీ అశోక్. అక్కడి వాస్తవ పరిస్థితుల్ని బాహ్య ప్రపంచానికి చూపిస్తున్నారు. ఈ క్రమంలో కుకీ తెగకు చెందిన మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ‘బిఫైనోమ్’ గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అది డేజంరని తెలిసినా ముందడుగే వేశారు. తమను కిడ్నాప్ చేస్తారని.. కొట్టుకుంటూ ఊరేగిస్తారని.. చీకటిగదిలో చిత్రహింసలు పెడతారని వాళ్లు ఊహించలేదు.


బిగ్ టీవీ టీమ్ బి-ఫైనోమ్ వెళ్తుండగా మయితీలు అడ్డుకున్నారు. నాన్‌పాక్ సెక్మై గ్రామంలో అశోక్‌ టీమ్‌ను అడ్డుకున్నారు. కుకీల గ్రామం బి-ఫైనోమ్‌కు వెళ్లొద్దని హెచ్చరించారు. ఏకంగా నాలుగు గంటల పాటు అశోక్‌ టీంని నిర్బంధించారు. బి-ఫైనోమ్‌లో ఏమి జరిగిందో తమ వెర్షన్ వినిపించారు. తమ ఇంటర్వ్యూలు తీసుకుని తిరిగి వెళ్లిపోవాలంటూ మయితీలు అల్టిమేటం జారీ చేశారు.

సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లోనే కనిపిస్తాయి. కానీ మణిపూర్‌లో బిగ్ టీవీ టీం ప్రత్యక్షంగా అనుభవించింది. 6 గంటల తర్వాత లోకల్ పోలీస్ కమాండర్ అరుణ్‌కుమార్ బృందం అక్కడకు వచ్చింది. కిడ్నాప్ చేసిన మైతీయి వర్గం నేతలతో చర్చలు జరిపింది. వీళ్లు ద్రోహులు, చంపేయాలంటూ పోలీసుల ముందే వాళ్లు నినాదాలు చేశారు. చివరకు జర్నలిస్టుల్ని విడిచి పెట్టకుంటే ఆర్మీ రంగంలోకి దిగుతుందని హెచ్చరించడంతో మయితీ కిడ్నాపర్లు వెనక్కి తగ్గారు. అలా మయితీల కిడ్నాప్ నుంచి విముక్తి పొందారు అశోక్ అండ్ టీమ్. తమను రక్షించిన లోకల్ టీమ్ కమాండర్ అరుణ్‌కుమార్‌కు థ్యాంక్స్ చెప్పారు.

అక్కడి నుంచి వెనుదిరిగి ఉంటే ఇది రిపోర్టింగ్ అనిపించుకోదు. ఒకరి వెర్షన్ మాత్రమే తీసుకోవడం ఏంటి? బాధితులకు అండగా నిలిచేదే మీడియా. ఎప్పుడూ ప్రజలపక్షం..అందరిపక్షం ఉండాలి. బాధితుల గొంతుకగా మారాలి. మహిళల్ని నగ్నంగా ఊరేగించి భరతజాతికే మాయని మచ్చగా నిలిచిన మయితీల వాదన వరకే వింటే ఎలా? అసలు కుకీల గ్రామంలో ఏం జరిగింది? ఆ ఊరు ఇప్పుడెలా ఉంది? ఇలా నిఖార్సయిన, దమ్మున్న జర్నలిస్టుగా ఆలోచించారు బిగ్ టీవీ అశోక్. మయితీల కళ్లుగప్పి.. మరో దారిలో బి-ఫైనోమ్ గ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్టింగ్ చేశారు.

బి-ఫైనోమ్ గ్రామం. అది ఒకప్పుడు ఊరు. ఇప్పుడు వల్లకాడు. అంతా శ్మశాన నిశ్శబ్దం. మయితీల దుర్మార్గానికి సజీవసాక్ష్యం. ఎటుచూసినా నిర్మాణుష్యం. మయితీల దుర్మార్గం ఏం రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. ఒకవేళ ఉన్నా మయితీలు విడిచిపెట్టరు. చంపి పాతేసేవారు. బి-ఫైనోమ్ గ్రామంలో కుకీల మహిళల్ని నగ్నంగా ఊరేగించడంతోనే వాళ్ల ఉన్మాదం చల్లారలేదు. ఊరు మొత్తాన్ని తగలబెట్టేశారు. అది వాళ్ల రాక్షసత్వం. చుట్టుపక్కల కుకీలు నివశించే 20 ఊళ్లను నామరూపాల్లేకుండా చేశారు. ఒకప్పుడు ఇక్కడ ఊరు ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇలా గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేశారు అశోక్. బి-ఫైనోమ్ చేరిన ఏకైక జర్నలిస్ట్‌గా నిలిచారు.

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×