EPAPER
Kirrak Couples Episode 1

TS Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్.. వానలతో జర జాగ్రత్త..

TS Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్.. వానలతో జర జాగ్రత్త..
Rain Alert in Telangana

Rain Alert in Telangana(Breaking news updates in telangana): వాన గండం ఇంకా వీడనే లేదు. తెలంగాణలో తడి ఆరనే లేదు. మళ్లీ అతిభారీ వర్షాలంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో రెండు రోజుల పాటు ఇంతేనట. ద్యావుడా.


వాయవ్య బంగాళాఖాతంలో.. ఏపీ, ఒడిశా తీరంలో.. తీవ్ర అల్పపీడనం ఉందట.. అంతేకాదు అల్పపీడనానికి తోడుగా ఆవర్తనం కూడా ఏర్పడిందని చెబుతున్నారు. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతోందనేది వెదర్ రిపోర్ట్.

ఆ అల్పపీడనం, ఆవర్తనం ఎఫెక్ట్‌తో తెలంగాణలో రెండ్రోజుల పాటు అతిభారీ నుంచి అత్యంతభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.


ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి-భువనగిరి, నిర్మల్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ అయింది.

చూస్తున్నాంగా వానలకు రాష్ట్రం ఎలా ఆగమాగం అవుతోందో. అసలే పరిస్థితి అసలేమాత్రం బాగోలేదు. అనవసరంగా బయటకు రావడం ఎందుకు? వర్షాలు ఆగే వరకు ఇంట్లో సేఫ్‌గా ఉంటేనే బెటరు. ఎమర్జెన్సీ అయితే.. ఎలానూ బయటకు వెళ్లక తప్పదు. అందుకే, జర జాగ్రత్త.

Tags

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×