EPAPER
Kirrak Couples Episode 1

Congress: సెల్ఫీ విత్ కాంగ్రెస్.. ఐడియా అదుర్స్.. కేసీఆర్ బెదుర్స్!

Congress: సెల్ఫీ విత్ కాంగ్రెస్.. ఐడియా అదుర్స్.. కేసీఆర్ బెదుర్స్!
bhatti selfie

Congress: కాంగ్రెస్‌లో ఎవరూ తగ్గట్లే. ఎవరికి వారే ఓ రేంజ్‌లో రాజకీయం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి దూకుడు మీదున్నారు. వరుస సభలు, ప్రెస్‌మీట్లతో కేసీఆర్ సర్కారును చీల్చిచెండాడుతున్నారు. ధరణి, ఉచిత విద్యుత్‌పై దడదడలాడిస్తున్నారు. రేవంత్‌కు తోడుగా ఎంపీ కోమటిరెడ్డి సైతం రంగంలోకి దిగారు. కరెంట్ ఆఫీసుకు వెళ్లి లాగ్ బుక్‌లు బయటకు తీసి.. రైతులకు ఎన్నిగంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారో లెక్కలు బయటకు లాగారు. 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వట్లేదనే విషయం బట్టబయలు చేసి.. బీఆర్ఎస్‌ను ఇరకాటంలో పడేశారు. రేవంత్, కోమటిరెడ్డిలతో పాటు లేటెస్ట్‌గా సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క కూడా నేను సైతం అంటూ సెల్ఫీ స్ట్రాటజీ ప్లే చేశారు.


పాదయాత్రతో భట్టి విక్రమార్క జోరు మీదున్నారు. ఖమ్మం సభతో మరింత కాక రేపారు. అదే టెంపోను కంటిన్యూ చేస్తూ.. ఇప్పుడు సెల్ఫీ విత్ కాంగ్రెస్ ప్రోగ్రాంను తీసుకొచ్చారు. ఉచిత విద్యుత్ పథకం దేశంలో మొదట తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ పథకంపై సంతకం పెట్టిన పోస్టర్ ముందు సెల్ఫీ తీసుకుని.. బీఆర్ఎస్‌ను ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ప్రజలకు తెలిసేలా ఈ సెల్ఫీ ప్రోగాం కొనసాగిస్తానని చెప్పారు.

ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయడానికి సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్‌మెంట్.. ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు. 2023 తరువాత బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు భట్టి.


ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం ఇలాంటి సెల్ఫీ ఛాలెంజే అమలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల ముందు సెల్ఫీ తీసుకుంటూ.. వైసీపీని సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు భట్టి విక్రమార్క సైతం ఇదే పొలిటికల్ స్ట్రాటజీతో ముందుకొచ్చినట్టున్నారు. ఇప్పటికే ఉచిత విద్యుత్ పోరులో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఎంతో ముందుకు వెళ్లాగా.. లేటైనా.. లేటెస్ట్ ఐడియాతో ముందుకొచ్చారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన పథకాలు, జరిగిన అభివృద్ధి చాలానే ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీ రీయింబ్స్‌మెంట్, మెట్రో రైలు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. వాటిముందు సెల్ఫీలతో సోషల్ మీడియా హోరెత్తితే.. కారుకు గింగిరాలే. అందుకే, సెల్ఫీ ఐడియా అదుర్స్.. కేసీఆర్ బెదుర్స్.. అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.

Related News

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

TDP VS BJP: కూటమిలో చిచ్చు పెట్టిన కమిషనర్‌! ఆ అధికారి ఎవరు ?

BRS Leaders: ఏదో చేద్దాం అనుకున్నారు కానీ.! అడ్డంగా బుక్కయ్యారు

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

Big Stories

×