EPAPER
Kirrak Couples Episode 1

Parliament : రాతంత్రా ప్రతిపక్షాల మౌన దీక్ష .. మణిపూర్ పై చర్చకు పట్టు..

Parliament : రాతంత్రా ప్రతిపక్షాల మౌన దీక్ష .. మణిపూర్ పై చర్చకు పట్టు..
Parliament monsoon session live updates

Parliament monsoon session live updates(Latest breaking news in telugu): మణిపూర్‌ అల్లర్ల అంశం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. ఈ ఘటనలపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు రాజ్యసభలో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయడం మరో వివాదానికి దారి తీసింది. ఆప్‌ ఎంపీ అనుచితంగా ప్రవర్తించారంటూ వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రత్యేక తీర్మానం చేసి ఆయనను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో కేంద్రం తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. సోమవారం రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేశారు.


కాంగ్రెస్‌, ఆప్ సహా ఇండియా సభ్యులు సోమవారం రాత్రి 11 గంటలకు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్షకు దిగారు. సస్పెండైన ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ దీక్షలో పాల్గొన్నారు. విపక్ష కూటమి ఎంపీలు రాత్రంతా నిరసన కొనసాగించారు.

సోమవారం ప్రతిపక్షాలు ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. ఆ సమయంలో మణిపూర్‌ అంశంపై చర్చకు తాము సిద్ధమేనని లోక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కానీ ప్రతిపక్షాలే ఇందుకు అంగీకరించడం లేదని మండిపడ్డారు. మరోవైపు మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలు చర్చంచారు.


బీజేపీ సమావేశానికి ధీటుగా ఇండియా నాయకులు భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమై పార్లమెంట్ ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మణిపూర్ అంశమే ప్రధాన అజెండాగా మంతనాలు జరిపారు.

Related News

Vardhman Boss Duped: సంచలనం!.. రూ.7కోట్లు దోపిడికి గురైన వర్ధమాన్ కంపెనీ బాస్..

Delhi CM: ఢిల్లీ సీఎం అతిశీకి చేదు అనుభవం… తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోని పోలీసులు?

Prashant Kishore : అయ్యో… రాహుల్‌ గాంధీపై ఇవేం వ్యాఖ్యలయ్యా పీకే ?

Indian Railways: రైలు ప్రయాణికులారా బిగ్ అలర్ట్.. రూల్స్ మారాయ్.. తెలుసుకోకుంటే చిక్కులే

Haryana Elections: హర్యానాలో హస్తం మెరుస్తుందా..? కమలం వికసిస్తుందా?

CM Siddaramaiah: భార్య నిర్ణయం.. ఆశ్చర్యపోయిన సీఎం సిద్ధరామయ్య

Udhayanidhi: టార్గెట్ తలపతి.. ఉదయనిధి పదవి వెనక బిగ్ స్కెచ్

Big Stories

×