EPAPER
Kirrak Couples Episode 1

AP: మిస్టరీ లీడర్.. కొత్త పార్టీతో కేక!.. ఎవరికి కాక?

AP: మిస్టరీ లీడర్.. కొత్త పార్టీతో కేక!.. ఎవరికి కాక?

AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోంది. అయితే అది రాజకీయ భవిష్యత్తు కోసమేనా? లేదంటే ఏదో ఓ పార్టీకి Bటీమ్‌గా ఉండనుందా? లేదంటే వ్యూహాత్మకంగా రాజకీయ కార్యకలపాలు ప్రారంభిస్తోందా? అసలు ఈ పొలిటకల్‌ పార్టీ ఎంట్రీ వెనక కారణాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన జనసేన మాజీ నాయకుడు పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ గుంటూరు వేదికగా నాగార్జున యూనివర్సిటి మైదానంలో ప్రజా సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏడాది కాలంగా రాష్ట్రమంతా పర్యటించి BC సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు పార్టీ ప్రకటనతో ప్రజా రాజకీయాల్లోకి వచ్చారు. అసలు ఎవరీ యాదవ్.. అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? అని పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ డిస్కషన్‌ జరుగుతోంది..


చిత్తూరు జిల్లా ప్రస్తుతం పలమనేరు నియోజకవర్గంలో ఉన్న పెద్ద పంజాణీ మండలానికి చెందిన రామచంద్ర యాదవ్ 2018 వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. అంతకు మునుపు ఉపాధ్యాయురాలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అంతే తర్వాత 15 సంవత్సరాల పాటు కనిపించకుండా పోయారు. ఇన్నాళ్లూ ఉత్తరాదిలో ఉన్నరని సమాచారం. ఉత్తరాది ప్రముఖులతో పెద్దఎత్తున లాబీయింగ్ చేయడంలో సిద్దహస్తుడని రామచంద్ర యాదవ్‌కు పేరుంది. 2018లో పుంగనూరుకు వచ్చి హడావుడి చేసారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత జనసేన నుంచి పోటీ చేసారు. 15వేల ఓట్లు సంపాదించుకున్నారు. టీడీపీ ఓట్లను మాత్రం చీల్చగలిగారు. ఆ తర్వాత జనసేన పార్టీకి దూరం అయ్యారు రామచంద్ర యాదవ్‌. పుంగనూరులో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తానే దీటైన అభ్యర్తినని ప్రచారం చేసుకున్నారు. నియోజకవర్గంలో యాదవ, కురుమ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువుగా ఉన్నాయి. దీంతో వారి ఓట్లే టార్గెట్‌గా రాజకీయం చేయాలనుకున్నారు. 2019 ఎన్నికల్లో డబ్బులకు బదులు స్లిప్‌లు పంచారని.. గెలిస్తే డబ్బులు ఇస్తానని చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

2020 నుంచి రామచంద్ర యాదవ్‌ తిరిగి యాక్టివ్ అయ్యారు. కరోనా సమంయలో కిట్లు పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తే మంత్రి అడ్డుకున్నారని ఆరోపించారు. తర్వాత జాబ్ మేళా అంటూ హడావుడి చేసారు. జాబ్ మేళాను పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత రైతు సదస్సు అంటూ హల్చల్‌ చేశారు. ఇక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారని యాదవ్‌ ఆరోపించారు. అదేరోజు రాత్రి పుంగనూరులో నూతనంగా నిర్మించుకున్న ఇంటిపై YCP వర్గీయులు దాడి చేశారని అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో గొడవ పెద్దదే అయింది. తర్వాత రాష్ట వ్యాప్తంగా విస్తృతంగా ఫ్లెక్సీలు, హోర్డింగులతో బీసీ నాయకుడిగా ప్రచారం చేసుకున్నారు. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ఎక్కడ చూసిన రామచంద్ర యాదవ్‌ భారీ హోర్డింగులే దర్శనమిచ్చాయి. దీనికితోడు తన ఇంటిమీద జరిగిన దాడి తర్వాత కేంద్రంలో పెద్దల వద్దకు వెళ్లి Y ప్లస్ సెక్యూరిటి తెచ్చుకున్నారు. తాజాగా అతను పార్టీ పెట్టడం వెనక వ్యూహం ఏంటనే చర్చ జరుగుతోంది. ఎవరి లాభం కోసం కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌హాట్‌ డిస్కషన్ నడుస్తోంది. అతని అర్థిక వనరులపైనా ప్రజల్లో చర్చ జరగుతోంది..


రామచంద్రా యాదవ్ 15 సంవత్సరాల పాటు అజ్ఞాతం లాంటి జీవితం గడిపారు. ఒక్క సారిగా ధనవంతుడిగా బయటకు వచ్చారు. సంపాదన ఎలా వచ్చిందనే దాని మీదా ఇప్పటికీ క్లారిటీ లేదు. ముఖ్యంగా గతంలో మదనపల్లిలో మనీ సర్క్యులేషన్ స్కీం నడిపే ఓ వ్యక్తి వద్ద పనిచేశారు. ఆ తర్వాత అదే స్కీమ్‌ ఉత్తరాదిలో పెట్టారనే టాక్‌ ఉంది. దీంతో పాటు మెడికల్ కాలేజీల విషయంలో కూడా లాబీయింగ్ నడిపారని అంటారు. మొదట్లో పారిశ్రామిక వేత్త అన్నారు. తర్వాత వ్యాపార వేత్త అంటున్నారు. ఏం వ్యాపారులు ఉన్నాయో ఎవ్వరూ చెప్పడం లేదు. కుటుంబం కూడా సాదాసీదా దిగువ మధ్య తరగతి. ఈయన భార్య గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పుంగనూరులో ఇంటిని ఇంద్రభవనంలా నిర్మించారు. ప్రారంభోత్సవం కూడా 21 రోజుల పాటు హడావుడి చేశారు. ప్రతిరోజు ప్రముఖులు, సన్యాసులు, సినిమా వాళ్లు వచ్చేలా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పెద్దఎత్తున భోజనాల హడావుడి నడిచింది. అతని సంపాదన ఇప్పటికి ప్రశ్నగానే మిగిలిపోయింది. దగ్గరి అనుచరులు కూడా సమాధానం చెప్పలేక పోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు అమిత్ షా అపాయింట్‌మెంటు కూడా ఇతనికి లభిస్తుందనే ప్రచారం ఉంది. ఢిల్లీలో లాబీయింగ్‌లో మాత్రం యాదవ్ అరితేరారని అంటున్నారు స్థానికులు. ఇంటి మీద దాడి జరిగినప్పుడు జనసేన అధినేత పరామర్శకు వస్తానంటే వద్దన్నారనే ప్రచారం కూడా ఉంది. ఎన్నికల తర్వాత జనసేనతో పూర్తిగా తెగతెంపులు చేసుకొని బీజేపీ అగ్రనాయకుల వద్దకు చేరారు రామచంద్ర యాదవ్‌.

రాష్టంలో యాదవ సామాజిక వర్గం ఓట్లు టార్గెట్‌గా రాజకీయం చేయడానికే పార్టీ పెట్టబోతున్నారని టాక్‌ నడుస్తోంది. రాష్ట్రంలో యాదవులు రాజకీయశక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. యాదవులు అన్ని పార్టీల్లో ఉండగా.. కొత్తగా అదే సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేలా పార్టీ పెట్టడం వెనక ఎవరికి ప్రయోజనం కలగనుందనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయడం మంత్రి పెద్దిరెడ్డికి లాభించిందనే టాక్‌ ఉంది. అందువల్ల రామచంద్ర యాదవ్‌ YCPకి B టీమ్‌ అంటున్నారు. ఐప్యాక్ టీమ్ అతని వెనుక ఉందనే ప్రచారం కూడా ఉంది. ఒకానోక దశలో టీడీపీ పుంగనూరు టికెట్‌ ఇవ్వడానికి సిద్దపడింది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌గా ఉన్న చల్లాబాబు రెడ్డి సైతం కొంత స్లో అయ్యారు. అయితే టీడీపీ ఆహ్వానాన్ని అతనే తిరస్కరించారనే ప్రచారం ఉంది. కేవలం YCP..B టీమ్‌గానే ఉన్నారనే టాక్‌ ఉంది. జనసేన నాయకులు మాత్రం తమ సింబల్‌తో ఓట్లు తెచ్చుకొని దాన్ని సొంత బలంగా ప్రచారం చేసుకుంటా రాజకీయం చేస్తున్నారని మండిపడుతోంది.

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×