EPAPER

Chikoti Praveen: ఏ1గా చికోటి ప్రవీణ్.. ఆ గన్ లైసెన్సులు ఫేక్..

Chikoti Praveen: ఏ1గా చికోటి ప్రవీణ్.. ఆ గన్ లైసెన్సులు ఫేక్..
chikoti praveen

Chikoti Praveen latest news(Today’s state news): క్యాసినోల నిర్వహణ కేసులో అప్పట్లో సంచలనం కలిగించిన చికోటి ప్రవీణ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల జాతరలో ఓ వ్యక్తి తుపాకీతో హల్ చల్ చేశాడు. సదరు వ్యక్తి.. చికోటి ప్రవీణ్ కు చెందిన ప్రైవేటు సెక్యురిటీగా గుర్తించారు. దీనిపై ఛత్రినాక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. ఈ వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ సహా ముగ్గురిపై పోలీసులు చీటింగ్‌ కేసుతో పాటు ఫోర్జరీ, ఆయుధాల చట్టం కింద కేసు పెట్టారు. ఇందులో ప్రధాన నిందితుడు A-1గా చికోటి ప్రవీణ్ ను చేర్చారు. A-2గా సుందర్ నాయక్, A-3గా రమేష్ గౌడ్, A-4గా రాకేష్ కుమార్‌లను పోలీసులు చేర్చారు. 420, 109 ఆర్మ్స్ యాక్ట్ 25, 30 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. A-1 చికోటి ప్రవీణ్ పరారీలో ఉన్నట్లు చూపించారు.


ముగ్గురు ప్రైవేట్ గన్ మెన్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు గన్‌లు స్వాధీనం చేసుకుని ఛత్రినాక పోలీసులు రిమాండ్‌కి తరలించారు. ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్న చికోటి ప్రవీణ్ వారితో కలిసి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాపలా డ్యూటీల్లో ఉన్న పోలీసులు ప్రైవేట్ సెక్యూరిటీని అడ్డుకుని వారిని చెక్ చేయగా, ఆయుధాలు బయటపడ్డాయి.

తమ దగ్గర ఉన్న తుపాకీలకు సంబంధించి ఒరిజినల్ లైసెన్స్‌ పత్రాలను.. చాలా నెలల క్రితమే తాము ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో సమర్పించామని ప్రవీణ్ వివరణ ఇచ్చారు. తనకు ప్రాణ హాని ఉన్నందున ప్రైవేటు సెక్యురిటీతో భద్రత ఏర్పాటు చేసుకున్నానని ఆయన చెప్పారు. తుపాకీలకు లైసెన్స్ ఉందని తమకు డాక్యుమెంట్స్ చూపించారని వెల్లడించారు. ఆ డాక్యుమెట్స్ ఫోర్జరీ అని ఇప్పుడు పోలీసులు అంటుననారని.. అవి నకిలీ అంటూ తమపైనే పోర్జరీ కేసు పెట్టారని చికోటి ప్రవీణ్ చెబుతున్నారు.


నకిలీ పత్రాలు అయితే తాము పోలీస్ స్టేషన్ కు పంపినప్పుడే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు ప్రవీణ్. ఇది పోలీసుల తప్పిదమే అని తప్పు బట్టారు. గజ్వేల్‌ ఘటన తర్వాత తనను టార్గెట్‌ చేశారని చికోటి విమర్శించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక తనపై ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. మతం కోసం, హిందుత్వం కోసం తాను పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు.

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×