EPAPER

Project K: ప్రాజెక్ట్-కె ఫస్ట్ లుక్‌పై ట్రోలింగ్.. అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ..

Project K: ప్రాజెక్ట్-కె ఫస్ట్ లుక్‌పై ట్రోలింగ్.. అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ..
project k

Project K: ప్రాజెక్ట్ కే మూవీలో ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. ట్విట్టర్ వేదికగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేతో కూడిన క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్టు కే కోసం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.


ప్రాజెక్ట్ – కే ఫస్ట్ లుక్ విడుదలైన మరుక్షణం నుంచే ట్రోలింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు. ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ని చూసి.. డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకాలం ఊరించి ఇచ్చే అవుట్ పుట్ ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఈ లుక్ కోసమేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. రకరకాల మీమ్స్ ను పోస్టు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రేపుతున్నారు. తన అభిమానానికి తెలుగు రాష్ట్రాలైనా.. అమెరికా అయినా తేడా లేదని తెగేసి చెబుతున్నారు. ఎల్లలు దాటినా తమ యంగ్ రెబల్ స్టార్ పట్ల తమకున్న అభిమానాన్ని చూపించడంలో తగ్గేదే లేదంటున్నారు.


ప్రాజెక్టు కే.. సినిమా యూనిట్.. అమెరికాలో జరగనున్న ప్రఖ్యాత శాన్ డియాగో కామిక్ కాన్‌ ఈవెంట్లో పాల్గొంటోంది. ఇదే వేదికపై ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్న తొలి భార‌తీయ సినిమాగా ప్రాజెక్ట్ కె రికార్డు సృష్టించింది.

ప్రఖ్యాత ఈవెంట్ లో పాల్గొనేందుకు మూవీ యూనిట్ ఇప్పటికే అమెరికాకు చేరింది. దీంతో అక్కడి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. మిస్సోరీలోని సెయింట్ లూయీస్ లో కార్లతో ర్యాలీ చేశారు. ప్రాజెక్ట్ అనే డిజైన్ వచ్చేలా కార్లను పార్క్ చేసిన తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో పాటు న్యూయార్క్ టైమ్‌ స్క్వేర్‌లో కూడా ప్రాజెక్ట్ కే కు సంబంధించిన పోస్టర్ దర్శనమిచ్చింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వీటిని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. తమ అభిమాన హీరో ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీ ఇండియన్ మూవీ రికార్డ్స్ ను షేక్ చేయాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.

ప్రాజెక్ట్ – కే ను.. వచ్చే ఏడాది జనవరి 12 రిలీజ్ కి ప్లాన్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అప్పటి వరకు సినిమా ప్రమోషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు భారీ ఈవెంట్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రకటించారు. ఇందులో భాగంగా అమెరికాలో తొలి ఈవెంట్ జరుగుతోంది. తదపని ఈవెంట్స్ ను.. సినీ రంగానికి చెందిన ప్రఖ్యాత వేదికలపై నిర్వహించేందుకు ప్లానింగ్ జరుగుతోందన్నారు.

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×